బంగ్లాదేశ్‌పై 21 పరుగులతో గెలుపు
రాణించిన డానీ వ్యాట్, స్మిత్, డీన్
మహిళల టి20 ప్రపంచకప్
షార్జా: ఇంగ్లండ్ స్థాయికి సరితూగని బంగ్లాదేశ్ బౌలింగ్‌లో మెరిసింది. కలిసొచ్చిన పిచ్‌పై మాజీ చాంపియన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. కానీ రెండాకులు ఎక్కువే తిన్న ఇంగ్లండ్ బౌలర్లు బౌలింగ్‌కు అనుకూలించే వికెట్‌పై నిప్పులు చెరగడంతో మహిళల టి20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు విజయంతో ఆరంభించింది.
గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్ల 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులే చేయగలిగింది.
ఆరంభం అదిరినా...
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానీ వ్యాట్ (40 బంతుల్లో 41; 5 ఫోర్లు), మయా బౌచర్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు) మంచి ఆరంభమే ఇచ్చారు. 48 పరుగుల వద్ద బౌచర్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ గతి తప్పింది. మరో ఓపెనర్ డానీ వ్యాట్ మినహా నట్ సీవర్ బ్రంట్ (2), కెప్టెన్ హీథెర్ నైట్ (6), అలైస్ క్యాప్సీ (9)లను స్వల్ప వ్యవధిలో బోల్తా కొట్టించిన బంగ్లా బౌలర్లు ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ల తర్వాత ఎమీ జోన్స్ (12 నాటౌట్) ఒక్కరిదే రెండంకెల స్కోరు!
శోభన పోరాడినా...
బంగ్లా ముందున్న లక్ష్యం చిన్నదే. కానీ ప్రత్యర్థి కష్టమైంది. బౌలింగ్ క్లిష్టమైంది. దీంతో బంగ్లా బ్యాటర్ల ఆటలేమి సాగలేదు. వన్‌డౌన్ బ్యాటర్ శోభన మోస్తరి (48 బంతుల్లో 44; 1 ఫోర్, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది.
కెప్టెన్ నిగార్ సుల్తానా (15) కూడా ప్రభావం చూపకపోగా, ఇతర బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోవడంతో ఓవర్లు గడుస్తున్న కొద్దీ బంగ్లా లక్ష్యానికి దూరమైంది. లిన్సే స్మిత్ (2/11), చార్లీ డీన్ (2/22) ప్రత్యరి్థని దెబ్బ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment