బోణీ కొట్టిన ఇంగ్లండ్‌.. 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ చిత్తు | England Beats Bangladesh to Claim First Win of Campaign | Sakshi
Sakshi News home page

ODI WC 2023: బోణీ కొట్టిన ఇంగ్లండ్‌.. 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ చిత్తు

Published Tue, Oct 10 2023 6:51 PM | Last Updated on Tue, Oct 10 2023 8:03 PM

England Beats Bangladesh to Claim First Win of Campaign - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ బోణీ కొట్టింది. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌(107 బంతుల్లో 140) విధ్వసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

అతడితో పాటు జో రూట్‌(82), జానీ బెయిర్‌ స్టో(52) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మెహదీ హసన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. షోర్‌ఫుల్‌ ఇస్లాం మూడు, టాస్కిన్‌ అహ్మద్‌, షకీబ్‌ తలా వికెట్‌ సాధించారు.



బంగ్లా టాప్‌ లేపిన టాప్లీ..
365 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 227 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ పేసర్‌ టాప్లీ.. ఆదిలోనే మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాను కోలుకోలేని దెబ్బతీశాడు. బంగ్లాబ్యాటర్లలో లిటన్‌ దాస్‌(76) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రహీమ్‌(51) తౌహిద్ హృదయ్(39) పరుగులతో పర్వాలేదనపించారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో టాప్లీ 4 వికెట్లు.. క్రిస్‌ వోక్స్‌ రెండు, వుడ్‌, సామ్‌ కర్రాన్‌,రషీద్‌, లివింగ్‌ స్టోన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇంగ్లండ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 15న ఢిల్లీ వేదికగా ఆఫ్టానిస్తాన్‌తో తలపడనుంది.
చదవండిODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్‌.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement