![Odia Premam Heroine Prakruti Mishra Casting Couch Producer Sanjay Naik - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/10/5_1.jpg.webp?itok=AzZYyGga)
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాల్సిందే..! ఇది ఒక్కరి మాట కాదు.. చాలామంది హీరోయిన్లు బహిరంగానే చెప్పిన విషయం. అయితే కొందరు బయటపడతారు.. ఇంకొందరు బయటపడరు. స్టార్ హీరోయిన్లు సైతం తమను నిర్మాతలు, హీరోలు కమిట్‌మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు 'క్యాస్టింగ్ కౌచ్' అనే పదం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.
(ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్ వైరల్)
తాజాగా ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్‌పై ఇద్దరు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఒడియా 'ప్రేమమ్' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ మీడియా ముందే నిర్మాతపై ఫైర్ అయింది. తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి నిర్మాత సంజయ్ నాయక్ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని తెలిపింది. ఆయన అవసరం తీరితే తరువాత ఆ నటి ముఖం కూడా చూడడని సెన్సెషనల్ కామెంట్ చేసింది. ఇలాంటి వారి టార్చర్ వల్ల ప్రస్తుతం రియాలిటీ షోలు చేసుకుంటూ.. వాటి ద్వారా మంచి నటిగా ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు తాను ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నాని తెలిపింది. ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు మరో నటి జాస్మిన్ రథ్ మద్ధతు తెలిపింది. తను కూడా సంజయ్ బాధితురాలినే అంటూ కామెంట్ చేసింది.
నిర్మాత సంజయ్ నాయక్ కామెంట్:
హీరోయిన్ల ఆరోపణలను సంజయ్ నాయక్ తప్పుబట్టాడు. ప్రకృతి మిశ్రా, హీరో బాబు సాన్ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.. ఆ సమయంలో బాబు సాన్‌కు మద్దతు ఇచ్చానన్న అక్కసుతో ప్రకృతి మిశ్రా ఇలాంటి నిరాధారమైన నిందలు వేస్తోందన్నాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలను కోర్టుకు లాగుతానని సంజయ్ తెలిపాడు.
(ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్)
Comments
Please login to add a commentAdd a comment