prakrithi
-
Prakruthi Kambam: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!
సాక్షి, సిటీబ్యూరో: ఫెమినా మిస్ ఇండియా..! ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికుల చిరకాల కోరిక. సౌందర్య రంగంలో అత్యున్నత స్థానమైన ఫెమినా మిస్ ఇండియాగా నిలవాలంటే దేహ సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం, విజ్ఞాన కౌశలం, సేవా తత్పరత అన్నింటికీ మించి ఆత్మస్థైర్యం కూడా ఉండాలంటున్నారు ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంబం. ఈ సారి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి కంబం ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ముంబై వేదికగా జరిగిన ప్రీ ఫెమినా మిస్ ఇండియా పేజెంట్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుని ఫెమినా మిస్ తెలంగాణ–2024గా నిలిచారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొనే 30 మంది అందాల ముద్దుగుమ్మల్లో తానూ ఒకరు. ఈ నేపథ్యంలో తన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..ఫైనల్స్‌లో తెలుగమ్మాయి..ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా చిరకాల స్వప్నం. గతంలో జరిగిన సౌందర్య పోటీల్లో పాల్గొని టాప్ 5 స్థానంలో నిలిచి ఆ కిరీటాన్ని అందుకోలేకపోయాను. కానీ ఈ సారి ఫెమినా మిస్ ఇండియా క్రౌన్ గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాలన్నా కూడా ఫెమినా మిస్ ఇండియా కిరీటమే ప్రామాణికం. ఫైనలిస్టుగా ఎంపిక చేయడానికి బెంగళూరులో జరిగిన ఆడిషన్స్‌లో ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందల మంది ష్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో ఎంపిక చేసిన కొద్ది మందితో ముంబైలో మరో పేజెంట్ నిర్వహించగా.. అందులో ఫెమినా మిస్ తెలంగాణగా నేను నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.జీవితం నేర్పిన పాఠాలు..నా జీవితంలో స్వతహాగా ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, అడ్డంకులే నన్ను ఈ స్థాయికి చేర్చాయని అనుకుంటాను. ప్రతి సమస్య నుంచీ, ప్రతి సందర్భం నుంచీ జీవిత పాఠాలను నేర్చుకున్నాను. సౌందర్య రంగం అంటే అందంగా ఉంటే సరిపోతుందిని అంతా అనుకుంటారు. కానీ.. అందంతో పాటు ఆలోచనలు, అభిరుచులు, సంపూర్ణమైన వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత–అవగాహన ఇలా పలు అంశాలను పరిశీలించాకే, పరీక్షించాకే ఆ గౌరవమైన స్థానానికి ఎంపిక చేస్తారు. మల్టీ క్వీన్...నాకు 5 భాషల్లో ప్రావీణ్యముంది. ఫ్యాషన్‌తో పాటు థ్రోబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, క్యారమ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ని. పలు ఈవెంట్లలో ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్‌గా విజేతగా నిలిచాను. డ్యాన్స్–కొరియోగ్రఫీలో మంచి ప్రావీణ్యముంది. బాలీవుడ్, జాజ్, బ్యాలే, ఫోక్, సౌత్ స్టైల్స్ ఇలా అన్ని స్టెప్పుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించగలను. క్విల్లింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, మండాల ఆర్ట్స్ వంటి పలు కళల్లో మంచి పట్టు ఉంది. సమర్థవంతమైన అమ్మాయిగా నిలవడంలో ఈ అంశాలన్నీ దోహదపడ్డాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి గతంలో మిస్ గ్రాండ్ కర్ణాటక, టైమ్స్ ఫ్రెస్ ఫేస్‌తో పాటు పలు పేజెంట్లలో విజేతగా నిలిచాను. యాక్టింగ్ పై మక్కువతో టాలీవుడ్ వేదికగా ఒక సినిమాలో నటించాను. మరికొద్ది రోజుల్లో వెండి తెరపైన విడుదల కానుంది. ఇవన్నీ చేయగలడంలో నా టైమ్ మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.25 ఏళ్ల వయసులో..ఈ పోటీలకు అర్హత వయస్సు 25 ఏళ్లు మాత్రమే.. ఇంత చిన్న వయసులో సామాజికంగా, మానసికంగా, మోడలింగ్‌లో ఉన్నత భావజాలం ఉండాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. నడక, నడవడిక, అందం, ఆలోచనలు, డ్రెస్సింగ్, మోడ్రన్ ట్రెండ్స్ ఇలా ప్రతీ విషయంలో ఉన్నతంగా ఉంటేనే ఈ పోటీల్లో రాణించగలం. అక్క దగ్గర మోడలింగ్, అమ్మా–నాన్నల దగ్గర సామాజిక అంశాల పైన అవగాహన పొందాను. బాక్స్ ఆఫ్ స్మైల్ పేరుతో అమ్మా నాన్నలు పేద విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాలు నాలో సామాజిక స్పృహను పెంచాయి. -
ఆ నిర్మాత ఎంతోమందిని వాడుకుని వదిలేశాడు: ప్రేమమ్ హీరోయిన్
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాల్సిందే..! ఇది ఒక్కరి మాట కాదు.. చాలామంది హీరోయిన్లు బహిరంగానే చెప్పిన విషయం. అయితే కొందరు బయటపడతారు.. ఇంకొందరు బయటపడరు. స్టార్ హీరోయిన్లు సైతం తమను నిర్మాతలు, హీరోలు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు 'క్యాస్టింగ్ కౌచ్' అనే పదం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. (ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్ వైరల్) తాజాగా ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్‌పై ఇద్దరు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఒడియా 'ప్రేమమ్' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ మీడియా ముందే నిర్మాతపై ఫైర్ అయింది. తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి నిర్మాత సంజయ్ నాయక్ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని తెలిపింది. ఆయన అవసరం తీరితే తరువాత ఆ నటి ముఖం కూడా చూడడని సెన్సెషనల్ కామెంట్ చేసింది. ఇలాంటి వారి టార్చర్ వల్ల ప్రస్తుతం రియాలిటీ షోలు చేసుకుంటూ.. వాటి ద్వారా మంచి నటిగా ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు తాను ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నాని తెలిపింది. ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు మరో నటి జాస్మిన్ రథ్ మద్ధతు తెలిపింది. తను కూడా సంజయ్ బాధితురాలినే అంటూ కామెంట్ చేసింది. నిర్మాత సంజయ్ నాయక్ కామెంట్: హీరోయిన్ల ఆరోపణలను సంజయ్ నాయక్ తప్పుబట్టాడు. ప్రకృతి మిశ్రా, హీరో బాబు సాన్ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.. ఆ సమయంలో బాబు సాన్‌కు మద్దతు ఇచ్చానన్న అక్కసుతో ప్రకృతి మిశ్రా ఇలాంటి నిరాధారమైన నిందలు వేస్తోందన్నాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలను కోర్టుకు లాగుతానని సంజయ్ తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
సింగర్ ప్రకృతి రెడ్డి తో " గరం గరం ముచ్చట్లు "
-
వావ్.. అద్భుతం.. చూసి నేర్చుకుందాం భయ్యా!
సాక్షి, హైదరాబాద్: మనిషి గమనించాలేగానీ అనంతమైన అద్భుతాలు, విశేషాలకు నిలయం ప్రకృతి. నేర్చుకోవాలేగానీ, ప్రతీ జీవన సూత్రం, ధర్మం ప్రకృతిలో ఇమిడి ఉంది. సాధారణంగా నిస్సహాయులకు, జవసత్త్వాలుడిగిన పెద్దలకు, తల్లీదండ్రులకు ..వారి వారసులు, పిల్లలు సేవలు చేయడం సహజం. అది మానవధర్మం కూడా. నేటి ఆధునిక సమాజంలో ఎంతమంది ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ఆహారాన్ని సేకరించుకోలేకపోతున్న ముసలి పక్షికి, బుజ్జి పక్షులు ఆహారాన్ని తెచ్చి పెట్టడం చూశారా. ఆకలితో ఉన్న పెద్ద పక్షులకు చక్కగా ఆహారాన్ని నోటికి అందిస్తున్న వీడియో విశేషంగా నిలుస్తోంది. అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను హరి చందన (ఐఏఎస్) ట్విటర్లో షేర్ చేశారు. ప్రకృతి ధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్న యంగ్ బర్డ్స్ ని మీరు కూడా చూసేయండి! Young #birds feeding older 🐦 who are unable to search for #food. #lessons from #nature. pic.twitter.com/cmbzSKTen5 — Hari Chandana IAS (@harichandanaias) May 19, 2022 -
రిపబ్లిక్ డే పరేడ్కి విద్యార్థిని ఎంపిక
హిందూపురం రూరల్ : పట్టణంలోని చిన్మయ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ప్రాకృతి ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ భీమరాజశెట్టి బుధవారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కర్నూలు బెటాలియన్‌లో ఎన్సీసీ క్యాడెట్ల విభాగంలో విద్యార్థినికి చోటు దక్కినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాకృతిని అభినందించారు.