- సేఫ్టీ సెమినార్‌లో రైల్వే డీఆర్‌ఎం మిశ్రా
- పాల్గొన్న కాజీపేట-బల్లార్షా, కొండపల్లి, భువనగిరి అధికారులు
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : రైల్వే సిబ్బంది విధి నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగుకుండా వ్యవహరించాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్‌కె.మిశ్రా సూచించారు. కాజీపేట జంక్షన్‌లోని సెమినార్ హాల్‌లో శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ స్థాయి సేప్టి సమావేశం జరిగింది. ఈ సెమినార్‌లో కాజీపేట-బల్లార్షా, కొండపెల్లి, భువనగిరి రైల్వే సెక్షన్లలో పనిచేస్తున్న రైల్వే అధికారులు, సూపర్‌వైజర్లు, రైల్వే గేట్‌మెన్‌లు.
సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, పాయింట్స్ మెన్లు, స్టేషన్ మాస్టర్లు, డ్రైవర్లు, కీ మెన్‌లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు హాజరయ్యూరు. ఈ సేఫ్టీ సెమినార్‌లో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్‌కె.మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అన్ని విభాగాల వారు అప్రమత్తంగా ఉండి రైల్వే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.
సమావేశంలో సికింద్రాబాద్ సీనియర్ డీఎస్‌ఓ మోహన్‌రాం, డీఈఎన్ సెంట్రల్ నాయక్, డిప్యూటీ సీఎస్‌ఓ ప్రజాపతి, కాజీపేట ఆర్‌పీఎఫ్ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్, కాజీపేట ఏరియా ఆఫీసర్ కుమార్, స్టేషన్ మేనేజర్ ఓదేలు, ఆర్‌పీఎఫ్ సీఐ సయ్యద్ ఇక్బాల్ అహ్మద్, జీఆర్‌పీ ఎస్సై శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్‌ఎం మిశ్రా కాజీపేట జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వరకు గూడ్స్ రైళ్లో ఫుట్‌ప్లేటింగ్ తనిఖీ చేస్తూ వెళ్లారని అధికారులు తెలిపారు.
డీఆర్‌ఎంకు రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుల వినతి
కాజీపేటలో రైల్వే కార్మికులు ఎదుర్కొటున్న పలు సమస్యలపై మజ్దూర్ యూనియన్ ఇంజినీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ బి. రామనాథం ఆధ్వర్యంలో నాయకులు డీఆర్‌ఎం మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే క్వార్టర్స్‌లలో సౌకర్యాలు లేవని, నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ను నేలమట్టం చేయకపోవడంతో అందులో అసాంఘిక కార్యాకలాపాలు సాగుతున్నాయ ని, రైల్వే ఆస్పత్రిలో మందుల కొరత ఉందని తదితర సమస్యలను వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు ఎ.శ్రీనివాస్, పి.వేదప్రకాష్, ఎన్.సదానందం, నిజాముద్దీన్, జేపీ యాదవ్, ఎన్.కుమారస్వామి ఉన్నారు.