కృష్ణా ట్రిబ్యునల్‌ కేసు.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం | Supreme court to ask central government about Krishna tribunal case | Sakshi
Sakshi News home page

కృష్ణా ట్రిబ్యునల్‌ కేసు.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

Published Thu, Dec 3 2015 3:22 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Supreme court to ask central government about Krishna tribunal case

ఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్‌ అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్‌ పరిధిని నాలుగు రాష్ట్రాలకు విస్తరించాలా? లేదా కొత్త ట్రిబ్యునల్‌ వేయాలా ? అనే అంశంపై ఇంకా అఫిడవిట్‌ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం మండిపడింది. దాంతో ఈ అంశంపై ఎలాంటి సమాచారం లేదని కేంద్రం తరపు న్యాయవాది మిశ్రా సుప్రీంకోర్టుకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గురువారమే దీనిపై నిర్ణయం తీసుకుందంటూ ఆయన కోర్టుకు తెలిపారు. ఆ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు కోర్టుకు అందించేందుకు తగిన సమయం కావాలని మిశ్రా సుప్రీంకోర్టును కోరారు.

అయితే వాదనలు మొదలైనప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదంటూ కోర్టు ఆయనను ప్రశ్నించింది. కౌన్సిల్ నిర్వహించాల్సిన బాధ్యతలు అడ్వకేట్‌గా మీకు తెలియవా? అంటూ న్యాయవాది మిశ్రాపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ విషయం అనేది వెంటనే తెలపాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.  ఈ నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్‌ కేసు డిసెంబర్‌ 8 కి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement