ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్ పెయిడ్ సబ్‌క్రిప్షన్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాత వెరిఫైడ్ బ్లూటిక్‌లను బంద్ చేసిన ట్విటర్ సబ్‌క్రిప్షన్ ఛార్జ్ చెల్లించినవారికి బ్లూటిక్‌లు అందిస్తోంది. అయితే కొంతమందికి మాత్రం ఉచితంగా బ్లూటిక్‌లు అందిస్తోంది.
(ఈవీల జోరు.. అమ్మకాల హుషారు! ఎంతలా కొన్నారంటే..)
ట్విటర్ గతంలో ఉన్న బ్లూ టిక్‌లను ఏప్రిల్ 1 నుంచి తొలగించి కొత్త సబ్‌క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ప్రసిద్ధ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ దాని వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను కోల్పోయింది. తమ ఉద్యోగుల ఖాతాలను వెరిఫై చేసేందుకు చెల్లించబోమని వైట్‌హౌస్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాపార సంస్థలు తమ ఖాతాలను వెరిఫైడ్‌గా మార్చుకోవడానికి ప్రతి నెలా సుమారు రూ. 82,000 చెల్లించాలి.
అయితే కొన్ని సంస్థలు నెలవారీ ఛార్జీలను చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చని తెలుస్తోంది. ట్విటర్‌ను ఎక్కువగా వినియోగించే 500 మంది ప్రకటనకర్తలకు వెరిఫైడ్ బ్లూ టిక్‌ను ఉచితంగా అందిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... ఫాలోవర్లు అధికంగా ఉన్న అగ్రశ్రేణి 10,000 సంస్థలకు కూడా ట్విటర్ ఉచితంగా వెరిఫైడ్ టిక్‌లు అందిస్తోంది.
(ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా? )
మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాని ప్రకటనల ఆదాయం క్రమంగా తగ్గిపోయింది. కొన్ని భారీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు తమ క్లయింట్లకు ట్విటర్ వినియోగంపై జాగ్రత్తలను సూచించాయి. ఈ నేపథ్యంలో వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను ఉచితంగా అందిస్తే ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలో ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు ట్విటర్ కొంతమంది ప్రకటనకర్తలకు ఈ ఉచిత వెరిఫైడ్ మార్క్‌లను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment