verified accounts
-
ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్ పెయిడ్ సబ్క్రిప్షన్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాత వెరిఫైడ్ బ్లూటిక్‌లను బంద్ చేసిన ట్విటర్ సబ్క్రిప్షన్ ఛార్జ్ చెల్లించినవారికి బ్లూటిక్‌లు అందిస్తోంది. అయితే కొంతమందికి మాత్రం ఉచితంగా బ్లూటిక్‌లు అందిస్తోంది. (ఈవీల జోరు.. అమ్మకాల హుషారు! ఎంతలా కొన్నారంటే..) ట్విటర్ గతంలో ఉన్న బ్లూ టిక్‌లను ఏప్రిల్ 1 నుంచి తొలగించి కొత్త సబ్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ప్రసిద్ధ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ దాని వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను కోల్పోయింది. తమ ఉద్యోగుల ఖాతాలను వెరిఫై చేసేందుకు చెల్లించబోమని వైట్‌హౌస్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాపార సంస్థలు తమ ఖాతాలను వెరిఫైడ్‌గా మార్చుకోవడానికి ప్రతి నెలా సుమారు రూ. 82,000 చెల్లించాలి. అయితే కొన్ని సంస్థలు నెలవారీ ఛార్జీలను చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చని తెలుస్తోంది. ట్విటర్‌ను ఎక్కువగా వినియోగించే 500 మంది ప్రకటనకర్తలకు వెరిఫైడ్ బ్లూ టిక్‌ను ఉచితంగా అందిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... ఫాలోవర్లు అధికంగా ఉన్న అగ్రశ్రేణి 10,000 సంస్థలకు కూడా ట్విటర్ ఉచితంగా వెరిఫైడ్ టిక్‌లు అందిస్తోంది. (ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా? ) మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాని ప్రకటనల ఆదాయం క్రమంగా తగ్గిపోయింది. కొన్ని భారీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు తమ క్లయింట్లకు ట్విటర్ వినియోగంపై జాగ్రత్తలను సూచించాయి. ఈ నేపథ్యంలో వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను ఉచితంగా అందిస్తే ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలో ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు ట్విటర్ కొంతమంది ప్రకటనకర్తలకు ఈ ఉచిత వెరిఫైడ్ మార్క్‌లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
ట్విటర్ వెరిఫైడ్ అకౌంట్లకు ‘అఫీషియల్’ లేబుల్..ఎందుకంటే?
బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విటర్లో మార్పుల్ని ముమ్మరం చేశారు. త్వరలో ఎంపిక చేసిన ట్విటర్ వెరిఫైడ్ అకౌంట్లకు ‘అఫీషియల్’ అనే లేబుల్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్ ఎస్తేర్ క్రాఫోర్డ్ తెలిపారు. ట్విటర్ ఇప్పటికే బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్‌ను ప్రారంభించింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేకి చెందిన ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 8 (సుమారు 7.99) డాలర్లు చెల్లించి ట్విటర్ బ్లూకి సైనప్ కావొచ్చంటూ ఐఫోన్ యూజర్లకు నోటిఫికేషన్ పంపించింది. మరో నెలలో భారత్‌లో ఎనేబుల్ చేయనుంది. ఈ నేపథ్యంలో 8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్ వెరిఫికేషన్ చేయించుకునే అకౌంట్లకు మాత్రమే అఫీషియల్ లేబుల్‌ను అందిస్తామని ట్విటర్ తెలిపింది. ఈ లేబుల్ మీడియా సంస్థలు, ఆయా ప్రభుత్వాలు వినియోగించే ట్విటర్ అకౌంట్లకు సైతం అందించనుంది. గతంలో లేదు గతంలో అఫీషియల్ అనే లేబుల్ వెరిఫైడ్ అకౌంట్లకు లేదు. ఆ అకౌంట్ల కోసం ఎలాంటి ఛార్జీలను ట్విటర్ విధించేది కాదు. కానీ మస్క్ కొనుగోలుతో ట్విటర్ స్వరూపం మారింది. ఐడీ వెరిఫికేషన్ కోసం 8 డాలర్లు వసూలు చేస్తుంది. వాటికి అనుగుణంగా వెరిఫైడ్ అకౌంట్ వినియోగదారులకు..సాధారణ యూజర్లు వినియోగించే ఫీచర్లకంటే అదనపు ఫీచర్లను అందిస్తుంది. -
అవును! అప్పుడు పొరపాటు జరిగింది : ట్విట్టర్
గతంలో తమ వల్ల పొరపాటు జరిగిందంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఒప్పుకుంది. ఇకపై అలాంటి తప్పులకు తావివ్వబోమంటూ యూజర్లకు హామీ ఇచ్చింది. ఇకపై మరింత నాణ్యతతో సేవలు అందిస్తామని పేర్కొంది. ఫేక్ అకౌంట్లు మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియాగా సంచలనం సృష్టించిన ట్విట్టర్ గతంలో ఫేక్ ఖాతాలను వడబోసేది. అయితే ఈ వడపోత కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ట్విట్టర్ 2017 నుంచి ఈ పని నిలిపేసింది. అయితే అప్పటికే అనేక ఫేక్ అకౌంట్లు ట్విట్టర్లో ఉండిపోయాయి. వీటి వల్ల యూజర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. తప్పు జరిగింది దాదాపు నాలుగేళ్ల తర్వాత 2021 మే నుంచి మరోసారి వెరిఫికేషన్ ప్రోగ్రామ్ చేపట్టింది ట్విట్టర్. ఈ సందర్భంగా ట్విట్టర్ ప్రతినిధులు స్పందిస్తూ ... గతంలో పొరపాటుగా కొన్ని ఫేక్ అకౌంట్లకు తాము అనుమతి ఇచ్చామని, వెరిఫికేషన్‌లో జరిగిన తప్పులే ఇందుకు కారణమని తెలిపారు. ఇకపై ఫేక్ అకౌంట్లకు ఎట్టి పరిస్థితుల్లో వెరిపై చేసి బ్లూ టిక్ ఇచ్చే ప్రశ్నే లేదని తెలిపారు. ఇవి నిబంధనలు మానిప్యులేషన్, స్పామ్ పాలసీ ప్రకారం ఫేక్ అకౌంటర్లను శాశ్వతంగా తొలగిస్తున్నామని, అదే విధంగా వాటికి జారీ చేసిన వెరిఫైడ్ బ్యాడ్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ట్విట్టర్. ఫేక్ ఖాతా కాదు అనేందుకు ట్విట్టర్ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం గత ఆరు నెలలుగా ఖాతా ఉపయోగంలో ఉండాలి. దీంతో పాటు ఖాతాకు సంబంధించిన ఈమెయిల్, ఫోన్ నంబరు వివరాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ నేమ్, ఇమేజ్‌లు కూడా ఉండాలి. అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిటీస్ ఉండాలి. ఈ నియమాలు పాటించే ఖాతా దారులకు వెరిఫైడ్ బ్యాడ్జీని జారీ చేస్తుంది ట్విట్టర్. లేని పక్షంలో ఫేక్‌గా గుర్తించి ఖతాలు స్తంభింప చేస్తుంది. -
ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయ్యిందా.. జరభద్రం!
ట్విట్టర్ అకౌంటు ఉండటం ఒక ఎత్తయితే.. దాన్ని వెరిఫై చేయించుకుని అధికారికంగా 'బ్లూ టిక్' పెట్టించుకోవడం మరో ఎత్తు. సోషల్ మీడియాలో ప్రెజెన్స్ చూపించుకోవడంతో పాటు, తమకు సంబంధించి ఇదే సరైన అకౌంట్ అని, మిగిలినవన్నీ ఫేక్ అకౌంట్లని చెప్పుకోడానికి ఈ రకంగా వెరిఫై చేయించుకుంటారు. కానీ, ఇలా వెరిఫై చేయించుకున్న లక్షలాది ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను తాము బయట పెట్టేస్తామని వికీలీక్స్ హెచ్చరించింది. మొత్తం అన్ని వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు, వాళ్ల కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక అంశాలు, సంబంధాలు అన్నింటితో ఒక ఆన్లైన్ డేటాబేస్ ఏర్పాటుచేస్తామని వికీలీక్స్ ఒక ట్వీట్లో తెలిపింది. అయితే దాన్ని ట్విట్టర్ వెంటనే తీసేసింది. 'వికీలీక్స్ టాస్క్‌ఫోర్స్' అనే పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంటుద్వారా చెప్పిన ఈ వివరాలను న్యూయార్క్ డైలీ న్యూస్ బయటపెట్టింది. మొదటి ట్వీట్‌ను డిలీట్ చేసిన వెంటనే అదే అకౌంటుతో మరో ట్వీట్ కూడా చేశారు. అయితే ఈసారి తమ వ్యాఖ్యలలో ఘాటు కాస్తంత తగ్గించారు. తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వివరాలను బయట పెట్టాలనుకుంటున్నామని, ఎవరైనా సూచనలిస్తారా అని ఆ ట్వీట్లో తెలిపారు. ట్విట్టర్ అధికారికంగా గుర్తించిన అకౌంట్లను వెరిఫైడ్ అకౌంట్లు అంటారు. వాటికి ట్విట్టర్ ఐడీ పక్కన నీలిరంగు సర్కిల్లో ఒక టిక్ మార్క్ వస్తుంది. అయితే, ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం తమ నిబంధనలకు విరుద్ధమని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వికీలీక్స్ చేసిన హెచ్చరికపై బ్రిటిష్ నటుడు ఎతాన్ లారెన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరో ఒకరు మీ ఇంట్లోకి చొరబడిపోయి మీ సోఫా కుషన్లన్నింటినీ అటూ ఇటూ మార్చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని ఆయన అన్నారు.