బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విటర్‌లో మార్పుల్ని ముమ‍్మరం చేశారు. త్వరలో ఎంపిక చేసిన ట్విటర్ వెరిఫైడ్ అకౌంట్‌లకు ‘అఫీషియల్’ అనే లేబుల్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్ ఎస్తేర్ క్రాఫోర్డ్ తెలిపారు.
ట్విటర్ ఇప్పటికే బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్‌ను ప్రారంభించింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేకి చెందిన ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 8 (సుమారు 7.99) డాలర్లు చెల్లించి ట్విటర్ బ్లూకి సైనప్ కావొచ్చంటూ ఐఫోన్ యూజర్లకు నోటిఫికేషన్ పంపించింది. మరో నెలలో భారత్‌లో ఎనేబుల్ చేయనుంది.
ఈ నేపథ్యంలో 8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్ వెరిఫికేషన్ చేయించుకునే అకౌంట్‌లకు మాత్రమే అఫీషియల్ లేబుల్‌ను అందిస్తామని ట్విటర్ తెలిపింది. ఈ లేబుల్ మీడియా సంస్థలు, ఆయా ప్రభుత్వాలు వినియోగించే ట్విటర్ అకౌంట్‌లకు సైతం అందించనుంది.
గతంలో లేదు
గతంలో అఫీషియల్ అనే లేబుల్ వెరిఫైడ్ అకౌంట్‌లకు లేదు. ఆ అకౌంట్‌ల కోసం ఎలాంటి ఛార్జీలను ట్విటర్ విధించేది కాదు. కానీ మస్క్ కొనుగోలుతో ట్విటర్ స్వరూపం మారింది. ఐడీ వెరిఫికేషన్ కోసం 8 డాలర్లు వసూలు చేస్తుంది. వాటికి అనుగుణంగా వెరిఫైడ్ అకౌంట్ వినియోగదారులకు..సాధారణ యూజర్లు వినియోగించే ఫీచర్లకంటే అదనపు ఫీచర్లను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment