న్యూఢిల్లీ:సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ యూజర్లకు మరో ఎదురు దెబ్బ. ఇప్పటికే బ్లూటిక్ పోవడంతో హతాశులైన యూజర్లు చాలామందికి ఇపుడిక ట్విటర్ లోడ్ కూడా కావడం లేదు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులకు మైక్రో బ్లాగింగ్ సేవలు అందుబాటులో లేవు. ప్రధానంగా డెస్క్‌టాప్ యూజర్లకు ‘దిస్ పేజ్ ఈజ్ డౌన్’ అనే సందేశం కనిపిస్తోంది. అయితే తొందరలోనే లోపాన్ని సవరిస్తామనే మెసేజ్ దర్శనమిస్తోంది. దీంతో ట్విటర్ మీకు పనిచేస్తోందా అంటూ నెటిజన్లు తెగ ఎంక్వయిరీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: Twitter Blue Tick: బడా బిజినెస్‌మేన్‌లకూ షాకిచ్చిన మస్క్!
ట్విటర్-డౌన్
ట్విటర యాప్ లేదా వెబ్‌సైట్ (డెస్క్‌టాప్, మొబైల్ రెండూ)చాలావరకు పని చేయలేదు. మొబైల్ సైట్‌ని యాక్సెస్ చేసినప్పుడు, ప్రస్తుతం ‘మీ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ సైట్‌ని చేరుకోవడం సాధ్యం కాదు’ అని లాంటి మెసేజెస్ కనిపించింది.
ఈ సమస్య ఎంత విస్తృతంగా వ్యాపించిందనే దాని గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు, అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీకి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు.
కాగా శుక్రవారం ఉదయం నుంచి సెలబ్రిటీలకు బ్లూటిక్ తీసివేయడంతో కలకలం రేగింది. దీంతో యూజర్లు జోక్స్, మీమ్స్‌తో ట్విటర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Elon Musk be like.#BlueTick pic.twitter.com/hlB9NxDKgd
— Farhan Khan (@babarazam215) April 21, 2023
ట్విటర్‌ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత చేసిన పలు మార్పుల్లో భాగంగా బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్లూటిక్ కావాలనుకునే యూజర్లు బ్లూటిక్ కోసం నెలవారీ రుసుము చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment