చట్టబద్ధంగా లేని రుణ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి తొలగించింది. 2022లో ఇలాంటివి ఏకంగా 3,500 యాప్‌లను గూగుల్ తొలగించినట్లు ప్లే ప్రొటెక్ట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 2022లో భారతదేశంలో 3,500 కంటే ఎక్కువ లోన్ యాప్‌లపై గూగుల్ చర్య తీసుకుంది. అంటే ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం!
భారత్‌లో వ్యక్తిగత రుణాలు, ఆర్థిక సేవల యాప్‌లకు సంబంధించి గూగుల్ తన విధానాన్ని 2021లో అప్‌డేట్ చేసింది. ఈ విధానం 2021 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. వ్యక్తిగత రుణాలను అందించడానికి ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందినట్లు యాప్ డెవలపర్‌లు ధ్రువీకరించాలి. అలాగే లైసెన్స్ కాపీని సమర్పించాలి. ఒక వేళ వారికి ఈ లైసెన్స్ లేకపోతే లైసెన్స్ ఉన్న రుణదాతలకు ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే తాము ఉన్నట్లు ధ్రువీకరించాలి. డెవలపర్ ఖాతా పేరు నమోదిత వ్యాపార పేరు ఒక్కటే అయి ఉండాలి.
ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు!
ఈ రుణ యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్ 2022లో మరిన్ని నిబంధనలు చేర్చింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), బ్యాంకులకు ఫెసిలిటేటర్‌లుగా వ్యక్తిగత రుణాలను అందించే యాప్ డెవలపర్‌లు మరికొన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డెవలపర్‌లు వారి భాగస్వామి NBFC, బ్యాంకుల పేర్లను, వాటికి తాము అధీకృత ఏజెంట్లనే విషయం తెలియజేసే వెబ్‌సైట్‌ల లైవ్ లింక్‌ను యాప్ వివరణలో బహిర్గతం చేయాలి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రుణ యాప్‌లకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసిన గూగుల్ ఉల్లంఘించిన యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment