Maruti Suzuki Removes S-Cross From Official Nexa Website - Sakshi
Sakshi News home page

మారుతి ఎస్‌-క్రాస్ ఔట్‌: వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌

Published Thu, Oct 13 2022 1:41 PM | Last Updated on Thu, Oct 13 2022 3:21 PM

Maruti S Cross removed from the Official Nexa website - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన ఫ్టాగ్‌షిప్‌ కారు మారుతి ఎస్‌-క్రాస్ కారును నిలిపివేసింది. గ్రాండ్‌ విటారాకు కంటే ముందు తీసుకొచ్చిన నెక్సా తొలి కారుఎస్‌-క్రాస్‌ను మారుతి నెక్సా వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. అంటే మార్కెట్‌నుంచి నిలివేసింది. 2015లో నెక్సా ఫస్ట్‌ అండ్‌  ఫ్లాగ్‌షిప్ కార్‌గా దీన్ని లాంచ్‌ చేసింది. (‘ప్లీజ్‌..కొనండి’ సేల్స్‌మేన్‌లా ఎలాన్‌ మస్క్‌ లేటెస్ట్‌ ట్వీట్‌​ సంచలనం)

కాంపాక్ట్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా లాంచ్‌, ధర ప్రకటన తర్వాత మారుతి తన అధికారిక నెక్సా వెబ్‌సైట్ నుండి ఎస్‌-క్రాస్‌ను తీసివేసింది. గ్రాండ్ విటారా ఇప్పటికే 60వేల బుకింగ్‌లను పొందింది. దీనికి 28 వారాల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది. తాజాగా మారుతి ఎస్‌-క్రాస్‌ ప్లేస్‌ను 2022 గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఆక్రమించింది.

1.6-లీటర్, 1.3-లీటర్ డీజిల్ ఇంజీన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S-క్రాస్ ముందుగా మార్కెట్లోకి వచ్చింది. తర్వాత డీజిల్‌ వెర్షన్‌ను ఆపేసి, 2020లో పెట్రోల్‌ వెర్షన్‌ను అందుబాటులోకి  తెచ్చింది. అయితే ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌ దూసుకుపోవడంతో S-క్రాస్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఈ సంవత్సరం జూలై, ఆగస్టులో ఒక్క కారు కూడా విక్రయించలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌లో S-క్రాస్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు మారుతి ప్రకటించింది.

గ్రాండ్‌ విటారాతో మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ మార్కెట్‌లో పట్టు నిలుపుకోవాలని మారుతి భావిస్తోంది. క్రెటా, సెల్టోస్‌కు రానున్న రోజుల్లో ఇది గట్టి పోటీ ఇస్తుందని మారుతి అంచనా వేస్తోంది. (క్లిక్ చేయండి: గ్రాండ్‌ విటారా లాంచ్‌.. స్టైలిష్‌ లుక్‌, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement