ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్‌నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్‌లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్‌లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్‌నగర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్‌కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు.
2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్‌ల టీకాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment