కంకిపాడు (కృష్ణా) : టీచర్ కొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని గోడవర్రు గ్రామానికి చెందిన ఇంటూరి. చింటూ అనే బాలుడు 8 వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 9 వ తేదీన ట్యూషన్ మాస్టర్ కొట్టడంతో చింటూ తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో బాధితుడు హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందాడు. ఆ తర్వాత చికిత్స ఖర్చు భరించే స్థోమత లేక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు శుక్రవారం మృతి చెందాడు.
టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి
Published Fri, Aug 28 2015 7:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM
Advertisement
Advertisement