ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ‘‘అసలే రోజులు బాగాలేవు.. ఒంటరిగా బయటకు వెళ్లకూడదు.. స్నేహితులు, షికార్లు అంటూ బయట తిరగడం మంచిది కాదు.. అసలు ఎవర్ని నమ్మేలా లేవు రోజులు’’ అంటూ తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతుండటం ఆ యువతికి నచ్చలేదు. ఇల్లు జైలులా కనిపించింది. దాంతో ఇంటి నుంచి బయపటడి.. స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు జీవించాలని ఆశించింది. ఈ క్రమంలో అర్థరాత్రి అందరూ నిద్రిస్తుండగా.. ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆంక్షలున్నప్పటికి ఇంట్లో ఉన్నంత కాలం సురక్షింతగా ఉన్న యువతి బయట అడుగుపెట్టిన మరుక్షణమే మృగాడి చేతికి చిక్కి.. అత్యాచారానికి గురయ్యింది. బాధితురాలిని కాపాడటం కోసం వచ్చిన ఆమె అంకుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు.
వివారాలు.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన బాధితురాలు ఇంట్లో తనకు ఫ్రీడం ఇవ్వటం లేదని భావించి.. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. కారులో అటుగా వెళ్తోన్న నిందితుడు యువతి దగ్గరకు వచ్చి.. కత్తితో బెదిరించి కారులో తీసుకెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ హెచ్చరించి ఆమెపై అత్యాచారం చేశాడు.
అయితే యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెని వెతకడం ప్రారంభించారు. వీరిని గమనించిన యువతి సాయం కోసం పెద్దగా ఏడ్వడం ప్రారంభించింది. దాంతో బాధితురాలి అంకుల్ ఆమెని కాపాడటం కోసం.. పరిగెత్తాడు. ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈలోపు మిగతా కుటుంబ సభ్యులు అక్కడకు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment