ఆడవాళ్లు అలానే బావుంటారట! | There's beauty in a woman's veil: Dharmendra | Sakshi
Sakshi News home page

ఆడవాళ్లు అలానే బావుంటారట!

Published Thu, Jun 18 2015 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

ఆడవాళ్లు అలానే బావుంటారట!

ఆడవాళ్లు అలానే బావుంటారట!

ముంబై: 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమాతో బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన  హీరో ధర్మేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల అందం గోప్యంగా ఉంటేనే బాగుంటుందట. 'టూ మచ్' ఓపెన్గా  ఉండడం అనేది కొంతకాలం తర్వాత బోర్ కొడుతుందనీ,  రహస్యంగా ఉంటేనే బాగుంటుందన్నారు. చక్కగా బొట్టు పెట్టుకుని, నిండా ముసుగు కప్పుకొని ఉంటే ఆడవాళ్ల అందం మరింత ఇనుమడిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకటి తరం హీరోయిన్లు పొడుగు జాకెట్లతో పూర్తిగా శరీరాన్ని కవర్ చేసేలా, నిండుగా ఉండేవారని పేర్కొన్నారు. ఇపుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. అంతమాత్రాన ప్రస్తుత ట్రెండ్ను తాను  విమర్శించడం లేదని.. తాను ఎవరినీ తప్పుబట్టడం లేదంటూ సమర్థించుకున్నారు. అయితే  ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.  

జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకున్న ధర్మేంద్ర ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  వగలాడి భర్తను రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసే కథాంశంతో రూపొందిన  సెకండ్ హ్యాండ్ హజ్బెండ్  మంచి సినిమా  అవుతుందన్నారు. అసభ్యతకు   తావు లేకుండా సినిమాను నిర్మించామంటూ చెప్పుకొచ్చారు. హిందీలో అనేక యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో కథానాయకుడిగా నటించిన ధర్మేంద్ర ... అలనాటి హీరోయిన్ హేమమాలినిని  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement