Second Hand Husband
-
'తెరపై తనని చూస్తే ఏడుపు ఆగలేదు'
ముంబయి : తన గారాలపట్టిని వెండితెరపై చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా చెప్పాడు. ఆ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఏడ్చేశానన్నాడు. గోవిందా కూతురు టినా అహుజా ఇటీవలే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సుమీప్ కాంగ్ దర్శకత్వం వహించిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' మూవీలో తొలిసారిగా తన కూతుర్ని స్క్రీన్ మీద చూడగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడట. ఇది కలయా.. నిజమా అనే సందేహం వచ్చిందన్నాడు. గిప్పి గ్రేవల్, ధర్మేంద్ర, గీతా బస్రా తదితరులు నటించిన ఈ మూవీ గత జూలైలో విడుదలైన విషయం అందరికి విదితమే. ఇండియా లీడర్ షిప్ ఎన్క్లేవ్ లో భాగంగా ఓ అవార్డును తొలి మూవీకే టినా సాధించినందుకు ఆయన చాలా గర్వపడుతున్నానని ఓ కార్యక్రమంలో చెప్పాడు. తన కుటుంబం టినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతుందన్నాడు. తను మంచి నటిగానే కాదు.. మంచి కూతురుగానూ పేరు నిలుపుకుంటుందని అన్నాడు. ఆమె విజయానికి కుటుంబం ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సాయిబాబాని ప్రార్థిస్తానన్నాడు. -
ఆ చలిలో జిప్పీ లేకపోతే...
సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమవుతున్న టీనా ఆహూజా తన తొలి సినిమా షూటింగ్లో మాంచి బిజీగా ఉంది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. సినిమా హీరో జిప్పీ గ్రేవాల్ తనకు బాగా సహకరిస్తున్నాడని, అతడు లేకపోతే యాక్టింగ్ వదిలేసి ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయేదాన్నని చెప్పుకొస్తోంది. బాగా చలిగా ఉన్న ప్రదేశంలో ఒక రొమాంటిక్ సీన్లో నటించాల్సి వచ్చినపుడు చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. ఇక నా వల్లకాదు.. పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో జిప్పీ తన కోటు ఇచ్చి రక్షించాడని తెలిపింది. గడ్డ కట్టుకుపోయే చలిలో రొమాంటిక్ సీన్లను పండించడం అంత ఈజీ కాదంటోంది. ఆ చలికి వణికిపోతూ ఇబ్బంది పడుతోంటే జిప్పీ ఇచ్చిన జాకెట్ తనను కాపాడిందంటోంది. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా.. ఇదంతా నటనలో భాగమని అర్థమయ్యాక పెద్ద కష్టమనిపించలేదని పేర్కొంది. ఎలాగైతేనే చివరికి ఆ సీన్ పూర్తి చేశాం... ఇట్ వజ్ ఫన్ అంటూ ముగించింది. కాగా స్మీప్ కాంగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ధర్మేంద్ర కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కాగా, హీరోయిన్ టీనా అహూజా కూడా.. మరో ప్రముఖ హీరో గోవిందా కూతురు. -
'సెకండ్ హ్యాండ్ మొగుడు'తో హీరోయిన్ బోణీ
చిత్ర విచిత్రమైన డాన్సులు, కామెడీ నిండిన డైలాగులతో దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన గోవిందా కుమార్తె టీనా అహూజా త్వరలోనే తెరంగేట్రం చేస్తోంది. 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' అనే సినిమాతో ఆమె బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోంది. తన తండ్రి వారతస్వం కారణంగా తన మీద చాలా పెద్ద బాధ్యత ఉందని టీనా చెబుతోంది. తన తొలి ప్రాజెక్టు గురించి ఒకవైపు ఎంతో ఉత్సుకతగాను, మరోవైపు భయంభయంగాను ఉందని తెలిపింది. సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ సినిమాలో ఆమెతో పాటు ధర్మేంద్ర, జిప్పీ గ్రేవాల్ కూడా నటిస్తున్నారు. తొలి సినిమా చేసేందుకు ఎందుకు ఇంతకాలం వేచి చూశారని ప్రశ్నించగా, తానింకా సినీపరిశ్రమలోకి ప్రవేశించడానికి సిద్ధం కానప్పుడే తన గురించి మీడియాలో రాశారని.. నిజానికి 2013లోనే తాను సినిమాల్లోకి రావాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాల వల్ల కుదరలేదని చెప్పింది. -
ఆడవాళ్లు అలానే బావుంటారట!
ముంబై: 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమాతో బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరో ధర్మేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల అందం గోప్యంగా ఉంటేనే బాగుంటుందట. 'టూ మచ్' ఓపెన్‌గా ఉండడం అనేది కొంతకాలం తర్వాత బోర్ కొడుతుందనీ, రహస్యంగా ఉంటేనే బాగుంటుందన్నారు. చక్కగా బొట్టు పెట్టుకుని, నిండా ముసుగు కప్పుకొని ఉంటే ఆడవాళ్ల అందం మరింత ఇనుమడిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకటి తరం హీరోయిన్లు పొడుగు జాకెట్లతో పూర్తిగా శరీరాన్ని కవర్ చేసేలా, నిండుగా ఉండేవారని పేర్కొన్నారు. ఇపుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. అంతమాత్రాన ప్రస్తుత ట్రెండ్‌ను తాను విమర్శించడం లేదని.. తాను ఎవరినీ తప్పుబట్టడం లేదంటూ సమర్థించుకున్నారు. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకున్న ధర్మేంద్ర ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వగలాడి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా బుక్ చేసే కథాంశంతో రూపొందిన సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ మంచి సినిమా అవుతుందన్నారు. అసభ్యతకు తావు లేకుండా సినిమాను నిర్మించామంటూ చెప్పుకొచ్చారు. హిందీలో అనేక యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో కథానాయకుడిగా నటించిన ధర్మేంద్ర ... అలనాటి హీరోయిన్ హేమమాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.