'తెరపై తనని చూస్తే ఏడుపు ఆగలేదు' | I was teary eyed seeing my daughter on screen, says Govinda | Sakshi
Sakshi News home page

'తెరపై తనని చూస్తే ఏడుపు ఆగలేదు'

Sep 19 2015 5:14 PM | Updated on Apr 3 2019 6:23 PM

'తెరపై తనని చూస్తే ఏడుపు ఆగలేదు' - Sakshi

'తెరపై తనని చూస్తే ఏడుపు ఆగలేదు'

తన గారాలపట్టిని వెండితెరపై చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా చెప్పాడు.

ముంబయి : తన గారాలపట్టిని వెండితెరపై చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా చెప్పాడు. ఆ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఏడ్చేశానన్నాడు. గోవిందా కూతురు టినా అహుజా ఇటీవలే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సుమీప్ కాంగ్ దర్శకత్వం వహించిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' మూవీలో తొలిసారిగా తన కూతుర్ని స్క్రీన్ మీద చూడగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడట. ఇది కలయా.. నిజమా అనే సందేహం వచ్చిందన్నాడు. గిప్పి గ్రేవల్, ధర్మేంద్ర, గీతా బస్రా తదితరులు నటించిన ఈ మూవీ గత జూలైలో విడుదలైన విషయం అందరికి విదితమే.

ఇండియా లీడర్ షిప్ ఎన్క్లేవ్ లో భాగంగా ఓ అవార్డును తొలి మూవీకే టినా సాధించినందుకు ఆయన చాలా గర్వపడుతున్నానని ఓ కార్యక్రమంలో చెప్పాడు. తన కుటుంబం టినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతుందన్నాడు. తను మంచి నటిగానే కాదు.. మంచి కూతురుగానూ పేరు నిలుపుకుంటుందని అన్నాడు. ఆమె విజయానికి కుటుంబం ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సాయిబాబాని ప్రార్థిస్తానన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement