tina ahuja
-
అందుకే నేను నెపో-కిడ్ కాదు: టీనా
ముంబై: బి-టౌన్లో స్టార్ కిడ్స్ హవా ఎక్కువ. అందుకే బాలీవుడ్‌ను నెపోటిజానికి కేరాఫ్‌గా చెబుతుంటారు. తల్లిదండ్రుల సపోర్టుతో సినిమాల్లోకి వచ్చి స్టార్స్‌గా ఎదిగిన అలియా భట్, రణ్‌బిర్ కపూర్, జాన్వి కపూర్, వరుణ్ దావన్, అర్జున్ కపూర్ తదితరులను టాలీవుడ్ నెపో-కిడ్స్(నెపోటిజం)గా పిలుస్తుంటారు. అయితే వీరిలో ప్రముఖ సినీయర్ నటుడు, హీరో గోవిందా గారాల పట్టి, హీరోయిన్ టీనా అహుజా పేరు మాత్రం వినిపించదు. దీనిపై ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. తాను ఎప్పుడూ నెపో-కిడ్ని కాదని, ఎందుకంటే తన సినిమాలను ప్రమోట్ చేయాలని ఆమె తండ్రి(గోవిందా) ఎప్పుడూ ఏ నిర్మాతను కోరలేదని వెల్లడించారు. మీ తండ్రి ఎప్పుడైన మీకు సినిమాల్లో సహాయం చేశారా? అని అడగ్గా ఆమె ‘ఎప్పుడు చేయలేదు. ఒకవేళ అలా చేసుంటే ఇప్పటికే నేను 30 నుంచి 40 సినిమాలకు సంతకం చేసేదాన్ని. కానీ ఆయన నాకు ఎప్పుడు సాయం చేయలేదు. నేను కూడా ఆయనను ఎప్పుడు అడగలేదు. ఒకవేళ నాకు అవసరమని భావించి ఆయనను అడిగేతే.. సహాయం చేయడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. కానీ నెపో-కిడ్‌గా ముద్ర వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నా సొంత గుర్తింపుతోనే సినిమా అవకాశాలు పొందాను. అయితే నేను ఏం చేస్తున్నాను, నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే రిపొర్టులను మాత్రం ఆయన పరిశీలిస్తూంటారు. అలా అని నా ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటారని కాదు. సినిమాల ఎంపికలో నా సొంత నిర్ణయాలను నాకే వదిలేస్తారు. అందుకే ఆయన నన్ను సినిమాల్లో ప్రమోట్ చేయమని ఇప్పటి వరకూ ఏ నిర్మాతను అడగలేదు. అందుకే నాకు నెపో-కిడ్(నెపోటిజం) అనే పేరు రాలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా టీనా అహుజా 2015 స్మిప్ కాంగ్ దర్శకత్వంలో వచ్చిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్'లో హీరోయిన్గా నటించి బాలీవుడ్ అరంగేట్రం చేశారు. (చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా) (నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్) -
'తెరపై తనని చూస్తే ఏడుపు ఆగలేదు'
ముంబయి : తన గారాలపట్టిని వెండితెరపై చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా చెప్పాడు. ఆ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఏడ్చేశానన్నాడు. గోవిందా కూతురు టినా అహుజా ఇటీవలే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సుమీప్ కాంగ్ దర్శకత్వం వహించిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' మూవీలో తొలిసారిగా తన కూతుర్ని స్క్రీన్ మీద చూడగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడట. ఇది కలయా.. నిజమా అనే సందేహం వచ్చిందన్నాడు. గిప్పి గ్రేవల్, ధర్మేంద్ర, గీతా బస్రా తదితరులు నటించిన ఈ మూవీ గత జూలైలో విడుదలైన విషయం అందరికి విదితమే. ఇండియా లీడర్ షిప్ ఎన్క్లేవ్ లో భాగంగా ఓ అవార్డును తొలి మూవీకే టినా సాధించినందుకు ఆయన చాలా గర్వపడుతున్నానని ఓ కార్యక్రమంలో చెప్పాడు. తన కుటుంబం టినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతుందన్నాడు. తను మంచి నటిగానే కాదు.. మంచి కూతురుగానూ పేరు నిలుపుకుంటుందని అన్నాడు. ఆమె విజయానికి కుటుంబం ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సాయిబాబాని ప్రార్థిస్తానన్నాడు. -
'సెకండ్ హ్యాండ్ మొగుడు'తో హీరోయిన్ బోణీ
చిత్ర విచిత్రమైన డాన్సులు, కామెడీ నిండిన డైలాగులతో దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన గోవిందా కుమార్తె టీనా అహూజా త్వరలోనే తెరంగేట్రం చేస్తోంది. 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' అనే సినిమాతో ఆమె బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోంది. తన తండ్రి వారతస్వం కారణంగా తన మీద చాలా పెద్ద బాధ్యత ఉందని టీనా చెబుతోంది. తన తొలి ప్రాజెక్టు గురించి ఒకవైపు ఎంతో ఉత్సుకతగాను, మరోవైపు భయంభయంగాను ఉందని తెలిపింది. సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ సినిమాలో ఆమెతో పాటు ధర్మేంద్ర, జిప్పీ గ్రేవాల్ కూడా నటిస్తున్నారు. తొలి సినిమా చేసేందుకు ఎందుకు ఇంతకాలం వేచి చూశారని ప్రశ్నించగా, తానింకా సినీపరిశ్రమలోకి ప్రవేశించడానికి సిద్ధం కానప్పుడే తన గురించి మీడియాలో రాశారని.. నిజానికి 2013లోనే తాను సినిమాల్లోకి రావాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాల వల్ల కుదరలేదని చెప్పింది.