ముంబై: బి-టౌన్‌లో స్టార్ కిడ్స్ హవా ఎక్కువ. అందుకే బాలీవుడ్‌ను నెపోటిజానికి కేరాఫ్‌గా చెబుతుంటారు. తల్లిదండ్రుల సపోర్టుతో సినిమాల్లోకి వచ్చి స్టార్స్‌గా ఎదిగిన అలియా భట్, రణ్‌బిర్ కపూర్, జాన్వి కపూర్, వరుణ్ దావన్, అర్జున్ కపూర్ తదితరులను టాలీవుడ్ నెపో-కిడ్స్(నెపోటిజం)గా పిలుస్తుంటారు. అయితే వీరిలో ప్రముఖ సినీయర్ నటుడు, హీరో గోవిందా గారాల పట్టి, హీరోయిన్ టీనా అహుజా పేరు మాత్రం వినిపించదు. దీనిపై ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. తాను ఎప్పుడూ నెపో-కిడ్‌ని కాదని, ఎందుకంటే తన సినిమాలను ప్రమోట్ చేయాలని ఆమె తండ్రి(గోవిందా) ఎప్పుడూ ఏ నిర్మాతను కోరలేదని వెల్లడించారు. మీ తండ్రి ఎప్పుడైన మీకు సినిమాల్లో సహాయం చేశారా? అని అడగ్గా ఆమె ‘ఎప్పుడు చేయలేదు. ఒకవేళ అలా చేసుంటే ఇప్పటికే నేను 30 నుంచి 40 సినిమాలకు సంతకం చేసేదాన్ని. కానీ ఆయన నాకు ఎప్పుడు సాయం చేయలేదు. నేను కూడా ఆయనను ఎప్పుడు అడగలేదు.
ఒకవేళ నాకు అవసరమని భావించి ఆయనను అడిగేతే.. సహాయం చేయడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. కానీ నెపో-కిడ్‌గా ముద్ర వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నా సొంత గుర్తింపుతోనే సినిమా అవకాశాలు పొందాను. అయితే నేను ఏం చేస్తున్నాను, నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే రిపొర్టులను మాత్రం ఆయన పరిశీలిస్తూంటారు. అలా అని నా ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటారని కాదు. సినిమాల ఎంపికలో నా సొంత నిర్ణయాలను నాకే వదిలేస్తారు. అందుకే ఆయన నన్ను సినిమాల్లో ప్రమోట్ చేయమని ఇప్పటి వరకూ ఏ నిర్మాతను అడగలేదు. అందుకే నాకు నెపో-కిడ్(నెపోటిజం) అనే పేరు రాలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా టీనా అహుజా 2015 స్మిప్ కాంగ్ దర్శకత్వంలో వచ్చిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్'లో హీరోయిన్‌గా నటించి బాలీవుడ్ అరంగేట్రం చేశారు.
(చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా)
(నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్‌ఐఆర్)
Comments
Please login to add a commentAdd a comment