
ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా ఏళ్ల పాటు కలిసున్న కొందరు స్టార్ కపుల్స్ విడిపోతున్నారు. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్, హీరో జయం రవి.. ఇలా తదితరులు ఏళ్లకు ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ నటుడు చేరినట్లు తెలుస్తోంది.
అప్పట్లో బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న గోవిందా.. ప్రస్తుతం పెద్దగా లైమ్ లైట్ లో లేడు. ఇతడే తన 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడట. గోవిందా, ఇతడి భార్య సునీత అహుజా.. గత కొన్ని రోజుల నుంచి వేర్వురుగా ఉంటున్నారట.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)
కొంతకాలంగా గోవిందా దంపతుల మధ్య విబేధాలు నడుస్తున్నాయని, దీంతో ఇక విడాకులు తప్పనిసరి అనుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గోవిందా.. ఓ మరాఠీ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, భార్య నుంచి విడిగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. ఇప్పటివరకైతే ఈ జంట.. విడాకుల అంశంపై స్పందించలేదు. కానీ మీడియాలో మాత్రం టాక్ గట్టిగా వినిపిస్తోంది.
కొన్నాళ్ల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత కూడా.. భర్త గోవిందాతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకుతో కలిసి మాత్రమే ఉంటున్నానని పేర్కొంది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే విడిగా ఉంటున్నారని అర్థమైంది. త్వరలో విడాకుల విషయాన్ని అధికారికంగ ప్రకటిస్తారేమో చూడాలి. 1987లో వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోగా.. 1988లో కూతురు పుట్టిన తర్వాతే పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)

Comments
Please login to add a commentAdd a comment