
హిందీ నటుడు గోవింద సుపరిచితమే. డిఫరెంట్ మ్యానరిజమ్, సరికొత్త డ్యాన్స్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు ఆయన. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లినా మళ్లీ యాక్టర్‌గా బిజీ అయ్యారు. ఆయన లేటెస్ట్‌గా నటించిన చిత్రం ‘రంగీలా రాజా’. ఈ చిత్రానికి సెన్సార్ బృందం 20 కట్స్ చెప్పిందట. దాంతో సెన్సార్ బృందం తన సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోవింద. ‘‘నా సినిమాలు థియేటర్ వరకూ వెళ్లడం ఇబ్బంది అవుతోంది. ఇప్పుడనే కాదు.
తొమ్మిది సంవత్సరాలుగా నా సినిమాలను టార్గెట్ చేస్తున్నారు. నేను రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాను. కొంతమంది నా సినిమాలను అడ్డుకుంటున్నారు. నేనేం తప్పు చేశానో తెలియడంలేదు. ఎవరు టార్గెట్ చేసినా నేను వెనక్కి తగ్గను. నా పని నేను చేసుకుంటూనే వెళ్తాను. దయచేసి నాకు పని చేసుకోవడానికి ఓ ప్లాట్‌ఫామ్ కల్పించండి’’ అని పేర్కొన్నారు గోవింద.
Comments
Please login to add a commentAdd a comment