బాలీవుడ్ నటి హేమ మాలిని అద్భుతమైన నటిగా రాణించడమే కాదు..రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని మూడోసారి యూపీలోని మధుర నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని 2014 నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె.. తన భర్తకు తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదనే విషయాన్ని వెల్లడించారు.
హేమ మాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం తన భర్త, నాటి హీరో ధర్మేంద్రకు ఇష్టంలేదంటూనే, మరో హీరో వినోద్ ఖన్నా సూచనలతో రాజకీయాల్లో కాలుమోపానని తెలిపారు. రాజకీయాల్లో నెగ్గుకురావడం చాలా కష్టమని, అందుకే ధర్మేంద్ర తనను రాజకీయాల్లోకి వెళ్లవద్దని సూచించారన్నారు. ధర్మేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అందుకే తనకు అలాంటి సలహా ఇచ్చిరని హేమ మాలిని తెలిపారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ధర్మేంద్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు.
అయితే తాను తన భర్త ఎదుర్కొన్న పరిస్థితులను సవాల్‌గా స్వీకరించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టానని అన్నారు. ధర్మేంద్ర 2004 నుండి 2009 వరకు బికనీర్ నుండి ఎంపీగా ఉన్నారని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో నాడు నటుడు వినోద్ ఖన్నా తనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఎలా ప్రసంగించాలో వినోద్‌ను చూసి నేర్చుకున్నానని, పబ్లిక్‌ని ఎలా ఫేస్ చేయాలో కూడా ఆయనే నేర్పించారన్నారు. బీజేపీ నేత వినోద్ ఖన్నా గురుదాస్‌పూర్ నుండి రెండుసార్లు ఎంపీగా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment