ఇండియన్ రెస్టారెంట్పై కాల్పులు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ భారతీయ రెస్టారెంట్లో దుండగుడు తెగబడ్డాడు. రెస్టారెంట్ పలువురు కస్టమర్లతో రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపి కలకలం సృష్టించాడు. గడిచిన కొద్ది రోజుల్లో ఇది రెండో ఘటన.
పశ్చిమ సిడ్నిలోని విగ్రామ్ వీధిలో బిల్లు ఇండియన్ ఈటర్ యాన్ అనే రెస్టారెంట్ ఉంది. ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. బ్లూ దుస్తులు ధరించి వచ్చిన ఓ అఘంతకుడు అనూహ్యంగా అంతా బిజిబిజీగా ఉన్న సమయంలో కాల్పులు జరిపాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ ఎవరికి తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నాడు. కాల్పులు జరిపిన దుండగుడు పారిపోయాడు.