Shot fire
-
అమెరికాలో టీచర్‌పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు
నోర్‌ఫోల్క్: అమెరికాలో చిన్నారుల చేతుల్లో కూడా తుపాకీ పేలుతోంది. వర్జీనియాలో రిచ్‌నెక్ ఎలమెంటరీ స్కూలులో ఆరేళ్ల విద్యార్థి తన క్లాస్‌రూమ్‌లో పాఠం చెబుతున్న టీచర్‌పై హఠాత్తుగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో టీచర్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ గాయాలు కాలేదని పోలీసు చీఫ్ స్టీవ్ డ్రూ చెప్పారు. ఆ విద్యార్థి హ్యాండ్‌గన్‌తో క్లాసుకి హాజరైనా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఈ దారుణం జరిగింది. విద్యార్థి మైనర్ కావడంతో పోలీసులు క్లాసు లోపల జరిగిన విషయాలు వెల్లడించలేదు. -
ఇండియన్ రెస్టారెంట్‌పై కాల్పులు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ భారతీయ రెస్టారెంట్లో దుండగుడు తెగబడ్డాడు. రెస్టారెంట్ పలువురు కస్టమర్లతో రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపి కలకలం సృష్టించాడు. గడిచిన కొద్ది రోజుల్లో ఇది రెండో ఘటన. పశ్చిమ సిడ్నిలోని విగ్రామ్ వీధిలో బిల్లు ఇండియన్ ఈటర్ యాన్ అనే రెస్టారెంట్ ఉంది. ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. బ్లూ దుస్తులు ధరించి వచ్చిన ఓ అఘంతకుడు అనూహ్యంగా అంతా బిజిబిజీగా ఉన్న సమయంలో కాల్పులు జరిపాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ ఎవరికి తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నాడు. కాల్పులు జరిపిన దుండగుడు పారిపోయాడు.