అమెరికాలో టీచర్‌పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు | 6-Year-Old Shoots Teacher at Virginia Elementary School | Sakshi
Sakshi News home page

అమెరికాలో టీచర్‌పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు

Published Sun, Jan 8 2023 6:21 AM | Last Updated on Sun, Jan 8 2023 6:21 AM

6-Year-Old Shoots Teacher at Virginia Elementary School - Sakshi

నోర్‌ఫోల్క్‌: అమెరికాలో చిన్నారుల చేతుల్లో కూడా తుపాకీ పేలుతోంది. వర్జీనియాలో రిచ్‌నెక్‌ ఎలమెంటరీ స్కూలులో ఆరేళ్ల విద్యార్థి తన క్లాస్‌రూమ్‌లో పాఠం చెబుతున్న టీచర్‌పై హఠాత్తుగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో టీచర్‌ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ గాయాలు కాలేదని పోలీసు చీఫ్‌ స్టీవ్‌ డ్రూ చెప్పారు. ఆ విద్యార్థి హ్యాండ్‌గన్‌తో క్లాసుకి హాజరైనా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఈ దారుణం జరిగింది. విద్యార్థి మైనర్‌ కావడంతో పోలీసులు క్లాసు లోపల జరిగిన విషయాలు వెల్లడించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement