Elementary school
-
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్‌లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్‌లో ఒక ΄ాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్‌ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
నాష్విల్లే స్కూల్లో దురాగతం..మాజీ విద్యార్థి పనే
నాష్విల్లే: అమెరికాలోని నాష్విల్లే క్రిస్టి యన్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో తొమ్మిదేళ్ల ముగ్గురు చిన్నారులతోపాటు స్కూల్ హెడ్ కేథరిన్, ఒక సబ్‌స్టిట్యూట్ టీచర్, కస్టోడియన్ ఒకరు ఉన్నారు. అనంతరం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ల ఆడ్రే ఎలిజబెత్ హేల్ అనే ట్రాన్స్‌జెండర్ మహిళగా గుర్తించారు. కాల్పుల గురించి పోలీసులకు 10.13 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే స్కూల్ వద్దకు చేరుకుని మొదటి అంతస్తులో ఉన్న విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. రెండో అంతస్తులో కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై హేల్ కాల్పులకు తెగించింది. వెంటనే జరిపిన ఎదురుకాల్పుల్లో హేల్ అక్కడికక్కడే హతమైంది. ఆమె వద్ద ఉన్న రెండు అసాల్ట్ రైఫిళ్లు, ఒక హ్యాండ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 నిమిషాల్లో ఇదంతా జరిగిపోయింది. ఆమె స్కూల్లోకి కారులో వచ్చినట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డయి ఉంది. షూటర్ హేల్ మాజీ విద్యార్థి అని అంటున్న పోలీసులు ప్రస్తుతం ఆమెకు స్కూల్‌తో గానీ స్కూల్ స్టాఫ్‌తో గానీ ఎటువంటి సంబంధాలున్నాయి? ఎవరిపై అయినా విరోధంతో ఈ ఘోరానికి పాల్పడిందా? అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే, కోవెనంట్ స్కూల్‌పై ద్వేష భావం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీస్ చీఫ్ జాన్ డ్రేక్ అన్నారు. మరోచోట కూడా కాల్పులు జరిపేందుకు హేల్ పథకం వేసినట్లు భావిస్తున్నామన్నారు. ఎన్కౌంటర్ ముగిసిన వెంటనే హేల్ ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు రెండు షాట్గన్లు దొరికాయి. ఇంకా స్కూల్‌కు సంబంధించిన మ్యాప్, ఇతర ప్రదేశాల మ్యాప్‌లు, కాల్పులకు ముందు రెక్కీ చేపట్టినట్లు ఆధారాలు దొరికాయి. ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు, అనూహ్య ఘటన జరగబోతోందంటూ కొద్ది నిమిషాలకు ముందే హేల్ తమకు మెసేజీలు పంపినట్లు స్నేహితులు చెబుతున్నారు. దారుణానికి వేదికైన కోవెనంట్ ప్రెస్బిటేరియన్ చర్చి స్కూల్ 2001లో ప్రారంభమైంది. ఇక్కడ ప్రి స్కూల్ నుంచి ఆరో గ్రేడ్ వరకు 200 మంది వరకు చిన్నారులు చదువుకుంటుండగా, 50 మంది సిబ్బంది ఉన్నారు. -
స్కూల్లో నరమేధం.. చిన్నారులు, సిబ్బంది మృతి
నాష్విల్లే: అగ్రరాజ్యంలోని గన్ కల్చర్ మరోసారి ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. టేనస్సీ స్టేట్ రాజధాని నాష్‌విల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్లో సోమవారం ఘోరం జరిగింది. ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు(9 ఏళ్లలోపు వయసు వాళ్లే), ముగ్గురు సిబ్బంది(స్కూల్ హెడ్ సహా) ఉన్నారు. కాల్పులు జరిపింది అదే స్కూల్ పూర్వ విద్యార్థి కాగా, ఆమెను అక్కడిక్కడే కాల్చి చంపారు పోలీసులు. నాష్‌విల్లేకు చెందిన 28 ఏళ్ల ఆడ్రీ హేల్ ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు ప్రకటించారు. రెండు రైఫిల్స్ Assault Rifles, ఓ హ్యాండ్ గన్‌తో స్కూల్ సైడ్ డోర్ నుంచి ప్రవేశించిన దుండగురాలు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే కుప్పకూలారు. ఎమర్జెన్సీ కాల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పదిహేను నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని దాడులకు ప్లాన్! మిగతా పిల్లలు, స్టాఫ్‌ను భద్రంగా బయటకు తీసుకొచ్చారు. కాల్పులకు దిగిన మహిళను అక్కడిక్కడే కాల్చి చంపారు. ఇదిలా ఉంటే.. ఆడ్రీ హేల్ అదే స్కూల్లో పూర్వ విద్యార్థి. ఆమెను ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమెకు ఎలాంటి నేర చరిత్ర లేదని, బహుశా కోపంలోనే ఆమె అలా దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఆమె కాల్పులకు తెగబడింది. కేవలం స్కూల్‌ను మాత్రమే ఆమె లక్ష్యంగా చేసుకోలేదు. ఆమె దగ్గర మరికొన్ని లొకేషన్లకు సంబంధించిన మ్యాప్‌లు దొరికాయి. అందులో ఈ స్కూల్ ఒకటి. బహుశా.. ఆమె మరిన్ని దాడులకు సిద్ధమై ఉందేమో అని ఓ అధికారి తెలిపారు. కోపంలోనే ఆమె కాల్పులకు దిగిందా? లేదా ఇంకా వేరే కారణం ఉందా? అనేది దర్యాప్తులో తేలుస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే కాల్పుల ఘటనపై వైట్‌హౌజ్ స్పందించింది. హృదయవిదారకరమైన ఘటన అని ఓ ప్రకటన విడుదల చేసింది. జో బైడెన్ ప్రభుత్వం చేస్తున్న ఆయుధ నిషేధ చట్టానికి Assault weapons Ban మద్దతు ఇవ్వాలంటూ రిపబ్లికన్లను వైట్‌హౌజ్ ఆ ప్రకటనలో కోరింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి స్కూల్స్‌పై దాడుల్లో నరమేధం ఎప్పటికప్పుడు ఆయుధాల నిషేధ చట్టం గురించి చర్చ తీసుకొస్తోంది అక్కడ. కిందటి ఏడాది టెక్సాస్ రాష్ట్రంలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు చనిపోయారు. 2012లో.. కనెక్టికట్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో 26 మంది చనిపోగా.. అందులో 20 మంది పిల్లలే ఉన్నారు. -
అమెరికాలో టీచర్‌పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు
నోర్‌ఫోల్క్: అమెరికాలో చిన్నారుల చేతుల్లో కూడా తుపాకీ పేలుతోంది. వర్జీనియాలో రిచ్‌నెక్ ఎలమెంటరీ స్కూలులో ఆరేళ్ల విద్యార్థి తన క్లాస్‌రూమ్‌లో పాఠం చెబుతున్న టీచర్‌పై హఠాత్తుగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో టీచర్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ గాయాలు కాలేదని పోలీసు చీఫ్ స్టీవ్ డ్రూ చెప్పారు. ఆ విద్యార్థి హ్యాండ్‌గన్‌తో క్లాసుకి హాజరైనా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఈ దారుణం జరిగింది. విద్యార్థి మైనర్ కావడంతో పోలీసులు క్లాసు లోపల జరిగిన విషయాలు వెల్లడించలేదు. -
టెక్సాస్‌లోని ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు
-
ఏపీ: ప్రాథమిక విద్యలో కీలక సంస్కరణలు
సాక్షి, అమరావతి: కేంద్రం నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిలబస్‌ని పూర్తిగా మార్చింది. రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ నూతన సిలబస్ మార్పులపై భారీ కసరత్తే చేసింది. దాదాపు పది దేశాల ప్రాధమిక విద్యావిధానాలని పూర్తిగా పరిశీలించారు. దీంతో పాటు దేశంలోని 15 రాష్ట్రాలకి చెందిన ఎస్సీఈఆర్టీ సిలబస్‌లని కూడా పరిశీలించి కొత్త సిలబస్‌ని రూపొందించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కమీషనర్ చినవీరభద్రుడు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలమేరకు నూతన సిలబస్ రూపొందించడంలో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ కీలక పాత్ర పోషించింది. ఇందుకు గాను వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న విద్యావిధానం....అమెరికా, ఆస్డ్రేలియా లాంటి పలు దేశాల విద్యా విధానాలని పరిశీలించింది. ఈ విధంగా ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు దాదాపు 84 రకాల పాఠ్య పుస్తకాలు, 63 వర్క్ బుక్‌లు రూపొందించింది. దాంతోపాటు తమిళం, ఒరియా, కన్నడ, ఉర్ధూ మీడియంలలో కూడా పాఠ్య పుస్తకాలు ముద్రించింది’’ అని తెలిపారు. అంతేకాక ‘మారిన సిలబస్ ప్రకారం ఒకటి, రెండు తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు.. మూడు, నాలుగు, అయిదు తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, మేథ్స్, సైన్స్ పాఠ్య పుస్తకాలు.. ఇక ఆరవ తరగతి విధ్యార్ధులకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలగా ఉంటాయి. మరోవైపు దేశంలోనే తొలిసారిగా ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ఏపీలో ప్రవేశపెడుతున్నారు. ఇందుకు తగినట్లుగానే పాఠ్య పుస్తకాలని మూడు సెమిస్టర్‌లలాగా విభజించారు. అలాగే ఒక పేజిలో తెలుగులో... మరో పేజీలో ఇంగ్లీష్‌లో ముద్రించడం ద్వారా ఇంగ్లీష్ బోధన అర్దమయ్యే రీతిలో పుస్తకాలు రూపొందించింది. దీంతో పాటు తెలుగుకి అత్యధిక ప్రదాన్యతనిచ్చాము. ఇందుకుగాను పాఠ్యాంశాలలో 116 మంది కవులని పరిచయం చేశాము. అలాగే తొలిసారిగా విధ్యార్ధులకి వర్క్ బుక్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాము. దీంతోపాటు టీచర్స్ కి, తల్లితండ్రులకి కూడా హేండ్ బుక్స్ ఇవ్వనున్నాము’ అని తెలపారు. అంతేకాక విధ్యార్దులని ఆకర్షించే విధంగా రంగురంగుల బొమ్మలతో పాఠ్య పుస్తకాల రూపకల్పన చేశామన్నారు చిన వీరభద్రుడు. (చదవండి: ఒకే వేదికపైకి వంద విదేశీ వర్సిటీలు ) పాఠ్య పుస్తకాల రూపకల్పన నుంచి ప్రింటింగ్ వరకు విద్యా శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందన్నారు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డైరక్టర్ మధుసూదనరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత అక్టోబర్ నాటికే టెండర్లు ఖరారు చేయడమే కాకుండా రాష్ట్ర స్ధాయిలో 55 ప్రింటింగ్ ప్రెస్‌లని గుర్తించి వాటి ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ సకాలంలో పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాము. దీంతో పాటు వీటి పర్యవేక్షణకి అయిదు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించాము. రికార్డు స్ధాయిలో మార్చి నెలాఖరునాటుకి హైస్కూళ్లకి.. జూన్ నాటికి ప్రాదమిక పాఠశాలలకి పాఠ్యపుస్తకాలని పంపిణీ చేశాము’ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకి అనుగుణంగా విద్యా శాఖలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ స్ధాయిలో మన విద్యార్ధులు పోటీపడే విధంగా సిలబస్ రూపొందించడం ఒక ఎత్తైతే వాటిని సకాలంలో ప్రింట్ చేసి విద్యార్ధుల వరకు చేరవేయగలగటం మరో ఎత్తు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ చరిత్ర సృష్టించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికే స్కూళ్లకి చేరుకున్న ఆ పాఠ్యపుస్తకాలని ఈ నెల 8 న ప్రారంభం కానున్న జగనన్న విద్యాకానుక కిట్‌తో పాటుపాటు విద్యార్ధులకి అందించనున్నాము’ అని తెలిపారు. (చదవండి: 3,5,8,10 తరగతులకే పరీక్షలు) -
ప్రమాదపు అంచున పాఠశాల
సాక్షి,బేతంచెర్ల : కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన ఉన్న అయ్యలచెర్వు ప్రాథమిక పాఠశాల పరిసరాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పాఠశాలలో సుమారు 158 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి పరిశ్రమల నుంచి వచ్చే నాపరాయి వేస్టేజీ, ఒండ్రు మట్టిని పాఠశాల వెనక భాగాన తరలించి, అక్కడే డంప్ చేయడంతో.. ఆ ప్రాంతం పెద్ద కొండలా కనిపిస్తోంది. ఎప్పుడైనా వర్షాలు ఎక్కువై నాపరాయి వేస్టేజీ కొండ కూలితే పాఠశాలపై పడే అవకాశం ఉంది. దానికితోడు, ఆ వేస్టేజీ రాళ్ల కింద ఉండే ఒండ్రుమట్టి పాఠశాల ఆవరణలోకి వచ్చి అసౌకర్యంగా దర్శనమిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి, నాపరాళ్లు, ఒండ్రుమట్టి వేస్టేజీని వేరే ప్రాంతానికి తరలించి, పాఠశాల ఆవరణాన్ని విద్యార్థులకు సౌకర్యంగా మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
స్కూల్ బ్యాగ్‌లో రక్తపింజర!
కేసముద్రం: ఓ విద్యార్థిని తెచ్చుకున్న పుస్తకాల సంచిలో రక్తపింజర పాము దాగివున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. కోమటిపల్లి శివారు చంద్రుతండాకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని అజ్మీరా అఖిల కోమటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. బ్యాగ్‌లో నుంచి పుస్తకం తీయడానికి చేయిపెట్టింది. చేతికి మెత్తగా తాకినట్లుగా అనిపించడంతో బ్యాగ్‌ను పూర్తిగా తెరిచేసరికి లోపల పాము కనిపించింది. ఆమె ఒక్కసారిగా అరుస్తూ క్లాస్ టీచర్ క్రిష్ణయ్య వద్దకు పరుగెత్తింది. ఆ క్లాస్‌టీచర్, హెచ్ఎం సోమిరెడ్డి కలసి క్లాసులో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించారు. వెంటనే దాన్ని కర్రతో కొట్టి చంపేయడంతో ప్రమాదం తప్పింది. -
వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేజీ టు పీజీ: కడియం
⇒ ప్రాథమిక పాఠశాలలతో అంగన్వాడీ కేంద్రాల అనుసంధానం ⇒ ఐదు నుంచి 12వ తరగతి వరకు గురుకులాల్లో విద్య ⇒ డిగ్రీ, పీజీలకు రీయింబర్స్మెంట్.. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య సాక్షి, హైదరాబాద్: ‘‘అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానిస్తాం. ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకులాల్లో ఉచిత విద్య ఉంటుంది. డిగ్రీ, పీజీలకు ఫీజు రీయిం బర్స్మెంట్ అమలు చేస్తున్నాం. మొత్తంగా ‘కేజీ టు పీజీ’వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుంది..’’అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 529 గురుకుల పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం శాసనసభలో విద్యా సంబం ధిత అంశాల పద్దుపై జరిగిన చర్చలో కడి యం మాట్లాడారు. ఇప్పటికే ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించామని, మరో ఐదు వేల పాఠశా లల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. మూడేళ్లుగా ఏం చేశారు? తొలుత ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడారు. ఎన్నికల ప్రణాళికలో కేజీ టు పీజీని పొందుపరిస్తే పేద ప్రజలు ఎంతో సంతోషించారని.. కానీ ఆ పథకం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే పరిమితమైందని విమర్శించారు. ఇంటర్ విద్య అందుబాటులో లేక మారుమూల ప్రాంతాల్లోని బాలికలు పదో తరగతితో చదువు ఆపేస్తున్నారని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు. మండల కేంద్రాల్లో ఇంటర్, నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి కోరారు. కాలేజీలు మంజూరు చేస్తూ కాగితాలు వస్తున్నాయని.. కానీ భవనాలు, ఫర్నీచర్, అధ్యాపకులు లేకుంటే ఎలా నడుస్తాయని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి కడియం వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో మ్యాపింగ్ చేశామన్నారు. భవనాలు, ఫర్నిచర్, ఇతర అవ సరాల కోసం 480 కోట్లు కేటాయించామన్నారు. ఎమ్మెల్యేల ఇళ్ల డిజైన్‌లో వాస్తు లోపం! నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మె ల్యేలకు కట్టిస్తున్న క్యాంపు కార్యా లయం, నివాస సముదాయ భవన నమూనాలో వాస్తుదోషం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఉందని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేల తల్లి దండ్రులు కూడా ఉండేందుకు మరో బెడ్రూం నిర్మించాలని.. నిర్మాణ వ్యయాన్ని రూ.రెండు కోట్లకు పెం చాలని కోరారు. మంత్రి తుమ్మల సమాధానమిస్తూ.. ఎమ్మెల్యేల ఇళ్ల నమూనాలో ఎలాంటి వాస్తు దోషం లేదని తెలిపారు. ఇంధనాన్ని పొదుపు చేసే ఆర్టీసీ సిబ్బందికి ప్రోత్సాహకాల మొత్తాన్ని పెంచాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: ఇటీవల నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో 5ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తు సాంబార్ పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం బుధవారం నోటీసులు వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై 6 వారాల్లో గా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నివేదికలో పేర్కొనాలంది. ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల భద్రతకు సంబం ధించిందని అభిప్రాయపడింది. -
ఇకపై ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్లు
♦ 8వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు ♦ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఆదేశాలు ♦ ‘క్యుములేటివ్, కాంప్రెహెన్సివ్ ప్రోగ్రెస్ రికార్డు’ నిర్వహణ ♦ చదువు, ఆరోగ్యం స్థితిగతులన్నింటిపైనా సమాచారం సాక్షి, హైదరాబాద్ : ప్రతి విద్యార్థికి ఒక రికార్డు... అది చూస్తే విద్యార్థి చదువు, పరీక్ష ఫలితాలు, వ్యాధులు, చేయించాల్సిన చికి త్సలు.. అన్నీ ఇట్టే తెలిసిపోతాయి. క్యుములేటివ్, కాంప్రెహెన్సివ్ ప్రోగ్రెస్ రికార్డు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థికి సంబంధించిన రికార్డుల నిర్వహణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నుంచే అమలు చేసేందుకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం రూపొందించిన రికార్డులను ఆయా పాఠశాలలకు పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో విద్యార్థి పదో తరగతి పూర్తయ్యే నాటికి రెండు రికార్డులను నిర్వహించనుంది. ఐదో తరగతి వరకు ఒకటి.. ఆరు నుంచి పదో తరగతి వరకు మరొకటి ఉంటుంది. అవి పాఠశాలల్లోనే ఉంటాయి. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థి సామర్థ్యాలు, పరీక్ష ఫలితాలు అన్నింటిని ఇందులో రికార్డు చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అదే రికార్డులో నమోదు చేయాలి. అంతేకాదు.. విద్యార్థి 8వ తరగతి పూర్తయ్యాక.. ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్ పేరుతో ధ్రువపత్రాన్ని ఇస్తుంది. వీటిని వెంటనే అమలు చేయాలని, త్రైమాసిక పరీక్షల (సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు) ఫలితాలను, విద్యార్థి సామర్థ్యాలను, వెనుకబడిన సబ్జెక్టులు, అందించాల్సిన ప్రత్యామ్నాయ బోధన అంశాలను అందులో పొందుపరచాలని విద్యాశాఖ.. అధికారులను ఆదేశించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ సెప్టెంబర్ నుంచే ప్రత్యామ్నాయ బోధనను ప్రారంభించాలని ఆదేశించింది. ‘ప్రోగ్రెస్ రికార్డు’లో నమోదు చేసే అంశాలు ⇒ విద్యార్థి ఫొటో, తల్లిదండ్రుల పేర్లు, అడ్మిషన్ నంబరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, మతం, మొబైల్ నంబరు, ఈ మెయిల్ ఐడీ, బ్లడ్ గ్రూపు, ఎత్తు, బరువు వివరాలు పొందుపరచాలి. ⇒ నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా విద్యార్థి పని తీరును అన్ని సబ్జెక్టుల్లో విశ్లేషిస్తూ.. వారి భాగస్వామ్యం, ప్రతి స్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు, మార్కులు గ్రేడ్ ఇవ్వాలి. ఆరోగ్యం, వ్యాయామ విద్య, కళలు, సాంస్కృతిక విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాల్లో విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తారు. ⇒ విద్యార్థుల అన్నిరకాల ఆరోగ్య సమస్యలను నమోదు చేయాలి. ⇒ ప్రతి రోజు, నెల వారీగా విద్యార్థులు వేసుకోవాల్సిన మందులు, ఇంజెక్షన్లు, మెరుగైన చికిత్స అవసరమైతే రెఫర్ చేసే ఆసుపత్రి వివరాలు, చేసిన చికిత్సలు అన్నింటిని వైద్యాధికారి నమోదు చేయాలి. -
నలుగురు విద్యార్థులను కాపాడి.. ప్రధానోపాధ్యాయురాలు మృతి
స్వాతంత్య్ర దిన వేడుకల ఏర్పాట్లలో ప్రమాదం * జెండాగా అమర్చే ఇనుప పైపును సిద్ధం చేసిన ప్రధానోపాధ్యాయురాలు * గద్దెపై అమర్చి, తీస్తుండగా విద్యుత్ తీగలకు తగిలిన పైపు * నలుగురు విద్యార్థులకు విద్యుత్ షాక్.. * ప్రాణాలకు తెగించి వారిని తోసేసిన హెచ్ఎం * విద్యుత్ షాక్ తగలడంతో కన్నుమూత పూడూరు: అదో ప్రాథమిక పాఠశాల.. తెల్లవారితే స్వాతంత్య్ర దినోత్సవం.. ముందుగా ఏర్పాట్లు చేసుకునేందుకు ఆదివారమే ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చారు.. కొందరు విద్యార్థుల సహాయంతో జెండా గద్దెను శుభ్రం చేశారు. జెండాగా అమర్చే ఇనుపపైపును సిద్ధం చేశారు.. ఓసారి పరిశీలిద్దామని జెండా గద్దెలో పైపును అమర్చారు.. తిరిగి తీస్తుండగా పాఠశాల పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలకు తాకింది.. దీంతో పైపును పట్టుకున్న విద్యార్థులంతా విద్యుత్ షాక్ తగిలి అల్లాడిపోయారు.. అది చూసిన హెచ్ఎం ప్రాణాలకు తెగించి విద్యార్థులను పక్కకు తోసేశారు.. కానీ దురదృష్టవశాత్తు ఆమె విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్‌కు చెందిన ప్రభావతి (40) మేడికొండ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల కోసం ఏర్పాట్లు చేసేందుకు ఆమె ఆదివారం పాఠశాలకు వచ్చారు. విద్యార్థుల సాయంతో జెండా గద్దెను సిద్ధం చేశా రు. దానిపై ఇనుప పైపును అమర్చి జెండా ఎగుర వేసేందుకు రిహార్సల్ నిర్వహించారు. పైపును తొలగిస్తుండగా పాఠశాల పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆ పైపును పట్టుకున్న మూడో తరగతి విద్యార్థులు కీర్తన (8), గణేశ్ (8), మధుమతి (8), ఒకటో తరగతి విద్యార్థి శివతేజ (6)లు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే ప్రభావతి విద్యార్థులను పక్కకు తోసేసింది. కానీ ఆమెకు పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. విద్యార్థులకు గాయాలయ్యా యి. స్థానికులు వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రభావతి మార్గమధ్యలోనే మరణించారు. విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. కాగా ప్రభావతికి భర్త రాజీవ్‌రెడ్డి, కుమార్తెలు సుభిక్ష (14), నాగహర్షిత (13) ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, ఎంఈవో కిషన్ తదితరులు ఆస్పత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభావతి కుటుంబానికి ట్రాన్స్‌కో నుంచి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి. -
చిన్నారులతో పనులా?
వెల్దుర్తి: బొమ్మారంప్రాథమిక పాఠశాల విద్యార్థులతో గురువారం ఉపాధ్యాయులు వెట్టిచాకిరి చేయించారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టు కొమ్మలను నరికేశారు. ఆ కొమ్మలను తొలగించే పనులను చిన్నారులతో చేయించారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు ఈ పనులు చేశారు. చిన్నారులతో పనిచేయించడమేమిటని పలువురు విస్మయాన్ని వ్యక్తం చేశారు. -
పాత పుస్తకం.. కొత్త పాఠం!
♦ ఈ విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే కొత్త తరగతులు ♦ పుస్తకాలు సమకూర్చడంపై విద్యాశాఖ మల్లగుల్లాలు ♦ ప్రస్తుతం ముద్రణ షురూ, పంపిణీకి మరింత సమయం ♦ పాతపుస్తకాల సేకరణకు సిద్ధమవుతున్న అధికారులు ♦ జిల్లాలో అవసరమైన పుస్తకాలు: 20,62,012 ♦ ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి: 43,954 ♦ మార్చి 21లోపు అందాల్సినవి: 20,18,058 ♦ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానం ఉపాధ్యాయులను, విద్యార్థులను అయోమయంలో పడేసింది. సాధారణంగా జూన్ రెండో వారంలో విద్యాసంవత్సరం మొదలయ్యేది. కానీ ప్రస్తుతం మార్చి 21 నుంచే కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని స్పష్టం చేసింది. మార్చి 15లోపు పరీక్షలు పూర్తిచేస్తే ఈ ప్రక్రియ సులభమవుతుందని ఆదేశించింది. ఈక్రమంలో అటు వార్షిక పరీక్షల నిర్వహణతోపాటు కొత్త విద్యాసంవత్సర ప్రారంభానికి పాఠశాల యాజమాన్యాలు సమాయత్తమవుతున్నాయి. అయితే కొత్త తరగతిని ప్రారంభించేలోపు విద్యార్థులకు అందే పాఠ్య పుస్తకాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇదిలాఉంటే ఈ ఏడాది తరగతులు పూర్తి చేసుకున్న వారి పుస్తకాలను కింది తరగతి విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలిస్తుందో లేదోనని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 2,369 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,594 ప్రాథమిక పాఠశాలలు, 250 ప్రాథమికోన్నత పాఠశాలలు, 525 ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్ పాఠశాలలున్నా యి. వీటి పరిధిలో 3.45 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రతి సంవత్సరం సగటున 20.62 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ వద్ద కేవలం 43,954 పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యేటా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తోంది. సాధారణంగా జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. మూడో వారం నాటికి విద్యార్థుల చేతిలో కొత్తపుస్తకాలు కనిపించేవి. ఈ ఏడాది విద్యాసంవత్సరం మూడు నెలల ముందుకు జరగడంతో పాఠ్యపుస్తకాల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. మరో పక్షం రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సాధారణంగా పుస్తకాల స్టాకు జిల్లా గోదాములకు చేరితే వాటిని కనిష్టంగా పక్షం రోజుల్లో మండలాలకు చేర్చవచ్చు. ప్రస్తుతం పాఠపుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. ముద్రణ పూర్తయి.. జిల్లా గోదాములకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి నూతన పాఠ్య పుస్తకాలు అందడం కష్టమే. పాత పుస్తకాలే దిక్కు.. ఈనెల 15వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ తర్వాత వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు పాఠ్యపుస్తకాలు అందడం కష్టమని భావించిన విద్యాశాఖ పాతపుస్తకాల సేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈమేరకు మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ముగించుకున్న విద్యార్థుల నుంచి పాఠ్యపుస్తకాలు సేకరించి.. వాటిని కొత్త తరగతిలో అడుగుపెట్టే వారికి అందజేయాలని ఆయన సూచించారు. దీంతో కొత్త విద్యాసంవత్సరం పాత పుస్తకాలతోనే ప్రారంభం కానున్నట్లు అవగతమవుతోంది. -
కీచక టీచర్ సస్పెన్షన్
ఐదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌ను సస్పెండ్ చేశారు.శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం సర్సివాడ ప్రాధమికొన్నత పాఠశాలలో పనిచేస్తున్న సి. ఉమాపతి అనే ఉపాధ్యాయుడు ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు విచారణ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి సదరు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
కీచక టీచర్
విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉపాధ్యాయుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం సిర్శువాడ గ్రామంలోని ప్రాథమికోన్సత పాఠశాలలో శనివారం వెలుగు చూసింది. పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉమాపతి ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విధ్యార్థినులతో గురువారం అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఇవాళ స్కూల్ కు చేరుకున్న గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
స్కూళ్లకు కత్తెర
- జిల్లాలో 743పాఠశాలల రద్దు - రేషనలైజేషన్ పేరుతో వేటు - దూరాభారమైనా మరో స్కూలుకు వెళ్లాల్సిందే - లేకుంటే ప్రయివేటు బాట తప్పదు - చాపకిందనీరుగా సర్కారు చర్యలు ప్రాథమిక విద్య పిల్లలకు భవిష్యత్‌కు తొలి అడుగు. దానిని మెల్లగా వారికి దూరం చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. చదువు అవసరమైతే దూరమైనా వెళ్లాల్సిందేనంటోంది. లేదంటే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకోండంటూ పరోక్షంగా రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలల సంఖ్యను కుదించేందుకు సిద్ధమైంది. విశాఖ ఎడ్యుకేషన్: చాలా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధులు సంఖ్య తక్కువగాఉన్న పాఠశాలలను రద్దు చేసి వారిని సమీపంలో పాఠశాలకు తరలించం రేషనలైజేషన్ ప్రకియ. ఈ ప్రక్రియ ద్వారా పాఠశాలలను తగ్గించి అన్నింటిని సక్సెస్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాట. ఇప్పటికే ప్రభుత్వం రేషనలైజేషనుకు శ్రీకారం చుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను రద్దుచేసేందుకు పావులు కదుపుతోంది. సుమారు 743 పాఠశాలలను ఇలా పక్క సూళ్లలో విలీనం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఉపాధ్యాయ, విద్యార్ధి సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం తన పని తాను రహస్యంగా చేసుకుపోతోంది. రేషనలైజేషన్ ప్రకియపై తొలుత ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దాని ద్వారా నిబంధనలను సిద్ధం చేయించింది. కమిటీ నిబంధనల ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 20లోపు, 6,7 తరగతుల వరకు ఉన్న యూపీ స్కూల్స్‌లో 35 లోపు, 6,7,8 తరగతుల్లో 50 లోపు విద్యార్ధులు ఉంటే వాటిని వేరే స్కూళ్లలో విలీనం చేయాలని నిబంధనలు తయారు చేసింది. దీని ఆధారంగా విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించారు. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. భాష పండితులపై నిర్లక్ష్యం.. ఓ వైపు రేషనలైజేషన్ ప్రకియలో తగ్గించుకుంటూ సక్సెస్ పాఠశాలల సంఖ్య పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం మరో వైపు ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరిట ప్రక్రియల భాషా పండితుల సంఖ్యను కుదిస్తోంది. ఇతర సంబ్జెక్టులకు 3 నుంచి 5 మంది ఉపాధ్యాయులను ఉంచుతూ ఎంత మంది విద్యార్ధులైనా భాషా పండితులను మాత్రం ఒక్కరినే ఉంచుతుంది. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలు పెట్టి విద్యార్ధుల సంఖ్య పెరగడంతో భాషా పండితులు సంఖ్య అదనంగా అవసరమైన ఒక్కో సబ్జెక్టుకు ఒక్కరినే పరిమితం చేస్తుంది. ఫలితంగా ఉపాధ్యాయులు సామర్ధ్యానికి మించి తరగతులు బోధించాల్సి ఉంటుంది. దీనిపై ఉపాధ్యాయుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది. -
తెరుచుకోని ముల్లకట్ట ప్రాథమిక పాఠశాల
ఏటూరునాగారం : మారుమూల అటవీ గ్రామమైన ముల్లకట్టలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంగళవారం తెరుచుకోలేదు. ఇక్కడ బడి గంటలు మోగలేదు. చదువుకునే పిల్లలు చెట్ల కింద కోతికొమ్మచ్చి ఆడుకుంటూ కనిపించారు. ఎందుకు ఆడుతున్నారంటే... బడికి సారత్తలేడు.. మేం ఆడుకుంటానం అన్నారు. ముల్లకట్ట పాఠశాలకు గత ఏడాది నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేక విద్యార్థుల చదువు కుంటుపడుతోంది. చదువుకోవాల్సిన పిల్లలు చెట్లు, పుట్టలు, తునికికాయలు ఏరడానికి వె ళుతున్నారు. గత ఏడాది మెటర్నటీ సెలవుపై ఉపాధ్యాయురాలు సజిత వె ళ్లిపోగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠశాల ఒక రోజు తె రిస్తే రెండు రోజులు మూత పడి ఉంటుంది. దీంతో విద్యార్థులు చదువుకోలేని దుస్థితి నెలకొంది. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 38 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయురాలు లేకపోవడంతో తోలెం భాగ్యలక్ష్మి అనే మహిళ ను ఎంఈఓ గొర్రె కొమురయ్య విద్యావలంటీర్‌గా నియమించారు. ఆమెకు నెలకు రూ.2,500 వేతనం ఇస్తానని చెప్పి కేవలం రెండు నెలలు కలిపి రూ.2,200 ఇచ్చారు. అయితే ఆ వేతనానికి పని చేయలేనని భాగ్యలక్ష్మి బడికి వెళ్లడం మానేసింది. అప్పటి నుంచి సీఆర్పీలను వంతుల వారిగా పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నప్పటికీ పాఠశాలకు ఎవరు రాకపోవడంతో మూసి ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంఆర్సీ భవనంలో డిప్యూటేషన్‌పై ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, వారిని ముల్లకట్టకు పంపించేలా విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఎంఈఓ గొర్రె కొమురయ్యను వివరణ కోరగా సీఆర్పీలను ప్రతి రోజు పాఠశాలకు వెళ్లాలని ఆదేశించామన్నారు. అయితే మంగళవారం పరీక్ష పేపర్లు రావడం వల్ల క్లస్టర్ వారీగా సరఫరా చేయాలని సీఆర్పీలను కోరానని, అందువల్లనే ముల్లకట్టకు వెళ్లలేదన్నారు. -
పరీక్షలా..జన్మభూమా!
ఉపాధ్యాయులకు కొత్త చిక్కు వచ్చింది. సెలవుల్లో సరదాగా గడుపుతున్న టీచర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మంగళవారం నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు ప్రారంభమవుతుండగా పాఠశాల స్థాయిలో చేయాల్సిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం రోజూవారీ షెడ్యూల్ ప్రకటించారు. రెండూ జరపాల్సిందేనని డీఈవో, ఎస్ఎస్ఏ పీవోలు ఆదేశాలు ఇచ్చారు. రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలిరా దేవుడా అని ఉపాధ్యాయులు అయోమయంలో పడిపోయారు. పరీక్షలైనా వాయిదా వేయాలని లేదా ఉపాధ్యాయులను జన్మభూమి నుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు(ఎడ్యుకేషన్): జన్మభూమి గురువారం నుంచి ప్రారంభమవుతున్నా పాఠశాలలకు 6వ తేదీ వరకు దసరా సెలవులు ఉండటంతో ఈ నెల 7న మంగళవారం నుంచి పాఠశాల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 10వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగుతాయి. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 14వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. తెలుగు-2, ఇంగ్లిష్-2, ఎన్ఎస్-2 పరీక్షలు మధ్యాహ్నం జరుగుతాయి. డీఈవో, ఎస్ఎస్ఏ అధికారులు జన్మభూమి నేపథ్యంలో ఈనెల 20వ తేదీ వరకు రోజువారీగా చేయాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఇచ్చారు. పాఠశాల స్థాయిలో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంటుంది. సమన్వయం కుదురుద్దా? అధికారులు చెబుతున్న దాని ప్రకారం పరీక్ష అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజాప్రతినిధులను ఆహ్వానించి కార్యక్రమాలు చేయాలని చెప్పడంతో ఎక్కువగా ఉదయమే జరపాలి. ఉదయం పరీక్షలు ఉంటాయి. రెండూ ఏక కాలంలో చేయడం సాధ్యం కాదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమాల ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నానికి మార్చుకుంటే లేదా జన్మభూమిలో పాఠశాలలను మినహాయిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి జన్మభూమి విషయంలో వెనక్కు తగ్గే సూచనలు కనిపించడంలేదు. ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా చేయాలి పరీక్షలు, జన్మభూమి కార్యక్రమాలు ఏకకాలంలో జరగడం అసంభవం. ఉపాధ్యాయులు పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఇస్తే ప్రజాప్రతినిధుల కోపానికి బలి కావాల్సి ఉంటుంది. పరీక్షలు జరపకపోతే విద్యార్థులు ఇబ్బందులు పడుతారు. ప్రభుత్వం ఆలోచించి షెడ్యూల్ ఇస్తే బాగుంటుంది. -వీ.రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు