ఇకపై ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్లు | Certificates on the Elementary Schools | Sakshi
Sakshi News home page

ఇకపై ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్లు

Published Thu, Aug 25 2016 2:38 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

ఇకపై ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్లు - Sakshi

ఇకపై ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్లు

8వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఆదేశాలు
‘క్యుములేటివ్, కాంప్రెహెన్సివ్ ప్రోగ్రెస్ రికార్డు’ నిర్వహణ
చదువు, ఆరోగ్యం స్థితిగతులన్నింటిపైనా సమాచారం

సాక్షి, హైదరాబాద్ : ప్రతి విద్యార్థికి ఒక రికార్డు... అది చూస్తే విద్యార్థి చదువు, పరీక్ష ఫలితాలు, వ్యాధులు, చేయించాల్సిన చికి త్సలు.. అన్నీ ఇట్టే తెలిసిపోతాయి. క్యుములేటివ్, కాంప్రెహెన్సివ్ ప్రోగ్రెస్ రికార్డు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థికి సంబంధించిన రికార్డుల నిర్వహణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నుంచే అమలు చేసేందుకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం రూపొందించిన రికార్డులను ఆయా పాఠశాలలకు పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో విద్యార్థి పదో తరగతి పూర్తయ్యే నాటికి రెండు రికార్డులను నిర్వహించనుంది. ఐదో తరగతి వరకు ఒకటి..

ఆరు నుంచి పదో తరగతి వరకు మరొకటి ఉంటుంది. అవి పాఠశాలల్లోనే ఉంటాయి. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థి సామర్థ్యాలు, పరీక్ష ఫలితాలు అన్నింటిని ఇందులో రికార్డు చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అదే రికార్డులో నమోదు చేయాలి. అంతేకాదు.. విద్యార్థి 8వ తరగతి పూర్తయ్యాక.. ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్ పేరుతో ధ్రువపత్రాన్ని ఇస్తుంది. వీటిని వెంటనే అమలు చేయాలని, త్రైమాసిక పరీక్షల (సమ్మేటివ్ అసెస్‌మెంట్ 1 పరీక్షలు) ఫలితాలను, విద్యార్థి సామర్థ్యాలను, వెనుకబడిన సబ్జెక్టులు,  అందించాల్సిన ప్రత్యామ్నాయ బోధన అంశాలను అందులో పొందుపరచాలని విద్యాశాఖ.. అధికారులను ఆదేశించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ సెప్టెంబర్ నుంచే ప్రత్యామ్నాయ బోధనను ప్రారంభించాలని ఆదేశించింది.

 ‘ప్రోగ్రెస్ రికార్డు’లో నమోదు చేసే  అంశాలు
విద్యార్థి ఫొటో, తల్లిదండ్రుల పేర్లు, అడ్మిషన్ నంబరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, మతం, మొబైల్ నంబరు, ఈ మెయిల్ ఐడీ, బ్లడ్ గ్రూపు, ఎత్తు, బరువు వివరాలు పొందుపరచాలి.

నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా విద్యార్థి పని తీరును అన్ని సబ్జెక్టుల్లో విశ్లేషిస్తూ.. వారి భాగస్వామ్యం, ప్రతి స్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు, మార్కులు గ్రేడ్ ఇవ్వాలి. ఆరోగ్యం, వ్యాయామ విద్య, కళలు, సాంస్కృతిక విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాల్లో విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తారు.

విద్యార్థుల అన్నిరకాల ఆరోగ్య సమస్యలను నమోదు చేయాలి.

ప్రతి రోజు, నెల వారీగా విద్యార్థులు వేసుకోవాల్సిన మందులు, ఇంజెక్షన్లు, మెరుగైన చికిత్స అవసరమైతే రెఫర్ చేసే ఆసుపత్రి వివరాలు, చేసిన చికిత్సలు అన్నింటిని వైద్యాధికారి నమోదు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement