చిన్నారులతో పనులా?
వెల్దుర్తి: బొమ్మారంప్రాథమిక పాఠశాల విద్యార్థులతో గురువారం ఉపాధ్యాయులు వెట్టిచాకిరి చేయించారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టు కొమ్మలను నరికేశారు. ఆ కొమ్మలను తొలగించే పనులను చిన్నారులతో చేయించారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు ఈ పనులు చేశారు. చిన్నారులతో పనిచేయించడమేమిటని పలువురు విస్మయాన్ని వ్యక్తం చేశారు.