bonded labor
-
Thayamma: వెట్టి నుంచి విముక్తి వరకు
మైసూరు చుట్టుపక్కల చెరుకు తోటల్లో వెట్టి పాలేర్లను పెట్టుకోవాలని చూస్తారు కొంతమంది. అప్పులిచ్చి వాళ్లను పాలేర్లుగా మారుస్తారు. తాయమ్మ కూడా ఒక వెట్టి పాలేరు. కానీ, ఆమె వెట్టి నుంచి బయట పడింది. సొంత ఉపాధి పొందింది. అంతే కాదు అప్పులపాలై వెట్టికి వెళ్లే దిగువ వర్గాల స్త్రీల విముక్తికి పోరాడుతోంది. మైసూరుకు చెందిన తాయమ్మ ఒక యోధురాలు. ధీర.‘అదంతా ఎలా తట్టుకున్నానో. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది’ అంటుంది తాయమ్మ. 33 ఏళ్ల ఈ ముగ్గురు పిల్లల తల్లి చేసిన నేరం ఏదైనా ఉంటే వెనుకబడిన వర్గాల్లో పుట్టడం. పేదరికంలో ఉండటం. ‘మా పేటల్లో సరైన ఇళ్లు ఉండవు. పరిశుభ్రత ఉండదు. మా కాలంలో మమ్మల్ని చదివించకుండా పొలాల్లో పని చేసే కూలీలను చేశారు. నేనూ నా భర్త మూర్తి ఇద్దరం పాలేరు పనులు చేస్తూనే పెళ్లి చేసుకున్నాం. ముగ్గురు పిల్లల్ని కన్నాం. వారి భవిష్యత్తు కోసం ఆరాట పడటమే మేము చేసిన నేరం’ అంటుంది తాయమ్మ.మైసూరు జిల్లాలోని లోపలి ్రపాంతమైన హన్సూర్ అనే ఊరిలో చెరకు పండిస్తారు. రోజువారీ కూలీల కంటే వెట్టి కూలీలుగా కొందరిని పెట్టుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తారు. దిగువ వర్గాల వారి ఆర్థికస్థితిని అవకాశంగా తీసుకుని వారి చేత వెట్టి చేయించుకుంటారు. ‘నా భర్త మూర్తి మాకున్న కొద్ది స్థలంలో ఒక చిన్న ఇల్లేదైనా వేసుకుందామని అనుకున్నాడు. మా ముగ్గురు పిల్లల్ని శుభ్రమైన వాతావరణంలో పెంచాలని అనుకున్నాము. అందుకు 60 వేలు అప్పు తీసుకున్నాం. ఆ కొద్ది అప్పు వడ్డీతో కలిసి మా జీవితాలను తల్లకిందులు చేసింది. అప్పు తీర్చలేకపోవడం వల్ల నేను, నా భర్త వెట్టికి వెళ్లాల్సి వచ్చింది. 2015 నుంచి 2017 వరకు మూడేళ్ల పాటు నేను, నా భర్త చెరుకు తోటల్లో వెట్టి చాకిరీ చేశాం. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మాకు పని ఉండనే ఉండేది. నేను నా చిన్న కొడుకును వీపున కట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని, కూడు నెత్తిన పెట్టుకుని పనికి వెళ్లేదాన్ని. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోయినా ఒకరు పొలంలో ఉండి ఒకరు ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అంత ఘోరమైన వెట్టి అది. నా పిల్లలు బాగా చదువుకుంటేనే ఇలాంటి వెట్టి నుంచి బయటపడగలరనుకున్నాను. మూడేళ్లు కష్టపడి పని చేసినా మాకు విముక్తి రాకపోయేసరికి ఎవరో అధికారులకు చెప్పి మాకు విముక్తి కలిగించారు.’ అని చెప్పింది తాయమ్మ.స్వేచ్ఛ పొందిన తాయమ్మ, ఆమె భర్త వాళ్లకు ఉన్న ఒక కొబ్బరి చెట్టు కాయలతో చిన్న షాప్ పెట్టుకున్నారు. కర్నాటకలో వెట్టి పాలేర్ల విముక్తి కోసం పని చేసే ‘ఉదయోన్ముఖ ట్రస్ట్’ తాయమ్మకు లోన్ ఇప్పించింది– కుట్టు మిషన్ల కోసం. తాయమ్మకు కుట్టు పనిలో ఉన్న ్రపావీణ్యం ఇప్పుడు ఆమెనే కాదు, ఆమెలా వెట్టి నుంచి విముక్తి పొందిన మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కలిగిస్తోంది.‘ఇంటిని ముందుకు నడపడంలో స్త్రీ కీలకం. ఆమె ఓడిపోకూడదు. కుటుంబం కోసం పోరాడాలి. అడ్డంకులను అధిగమించాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఈ హక్కు అందరు పిల్లలకు దొరకాలి. వలస వచ్చే కూలీలు, దిగువ కులాల పేదలు వెట్టిలో చిక్కుకుంటున్నారు. వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వారి పిల్లలకు సరైన చదువు అందేలా ప్రభుత్వాలు పని చేయాలి’ అంటోంది తాయమ్మ. -
గ'జీత'గాళ్ల దీనస్థితి
* పుష్కరాల్లో వేతనం కంటే.. పని ఎక్కువ * పనిగంటలు పాటించని అధికారులు * కనీసం భోజనం కూడా అందని వైనం రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారిని.. కృష్ణా పుష్కరాల్లో భక్తుల రక్షణ కోసం పని చేస్తే.. అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెప్పారు.. కానీ ఇక్కడకు వస్తే.. కనీసం భోజనం కూడా పెట్టని పరిస్థితి.. ఎనిమిది గంటల పాటే విధులన్నారు.. పన్నెండు గంటల పాటు పని చేయిస్తున్నారు. అన్ని గంటలు నీటిలో నిలబడ్డా.. కనీసం వారిని పట్టించుకునే నాథుడే లేడు.. అమరావతిలోని పుష్కర ఘాట్లులో గజఈతగాళ్ళు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పట్నంబజారు (గుంటూరు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఏదైనా ఘటనలు జరిగినా.. భక్తులు పొరపాటున నీటిలో మునిగినా.. కీలక పాత్ర పోషించేది ఈతగాళ్ళే. బ్లూ టీషర్ట్ వేసుకుని పడవలపై వృద్ధులకు సాయం అందిస్తూ భక్తులకు రక్షణగా ఉంటున్నారు. ఆఖరికి మట్టిని కూడా తొలగించే బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా నిత్యం రూ. 450 చెల్లించి 250 మంది ఈతగాళ్ళను మత్య్సశాఖ వారు విధుల్లోకి తీసుకున్నారు. 11వ తేదీ రాత్రి నుంచే వీరు విధుల్లో ఉన్నారు. కానీ వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నిత్యం రాత్రి సమయాల్లో కూడా పడవల్లోనే నిద్రించాల్సి దుస్థితి. తినేందుకు భోజనం కూడా దొరకని పరిస్థితి. అధికారులు భోజనం పంపటంలేదని ఈతగాళ్లు చెబుతున్నారు. దీని వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సేవలు... కేవలం ఇబ్బందులు కలిగిన సమయంలోనే కాకుండా భక్తులకు ఈతగాళ్లు ఎన్నో సేవలందిస్తున్నారు. అనేక మంది వృద్ధులు పిండ ప్రదానం చేసేందుకు వచ్చి నీటిలోకి దిగాలంటనే ఒకటికి పలుమార్లు ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయాల్లో వారు ఆ వృద్ధులను తీసుకుని వెళ్లి నదిలోకి చివర పిండ ప్రదానాలు చేయించి తిరిగి ఘాట్లపై వదలి పెడుతున్నారు. ఏక కాలంలో ఎనిమిది గంటల పాటు నీటిలో ఉండాలంటే సామాన్యమైన విషయం కాదని భక్తులు అంటున్నారు. భక్తులకు ఇటువంటి సేవలందిస్తున్న వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
చిన్నారులతో పనులా?
వెల్దుర్తి: బొమ్మారంప్రాథమిక పాఠశాల విద్యార్థులతో గురువారం ఉపాధ్యాయులు వెట్టిచాకిరి చేయించారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టు కొమ్మలను నరికేశారు. ఆ కొమ్మలను తొలగించే పనులను చిన్నారులతో చేయించారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు ఈ పనులు చేశారు. చిన్నారులతో పనిచేయించడమేమిటని పలువురు విస్మయాన్ని వ్యక్తం చేశారు. -
ఎంత కష్టం.. ఎంత కష్టం..
కూర్చుంటే కసురుకుంటున్న కాంట్రాక్టర్లు పనులు త్వరగా పూర్తిచేయాలంటూ నిర్వాహకుల ఒత్తిడిl తాత్కాలిక సచివాలయంలో అమలు కాని కార్మిక చట్టాలు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం చండ చండం తీవ్ర తీవ్రం.. జ్వరం కాస్తే, భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బుపట్టి, గాలికొట్టి వానవస్తే, వరదవస్తే దారితప్పిన బాటసారికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. ఇది పేదల ఎండిన డొక్కల చప్పుడు గురించి శ్రీశ్రీ తన అక్షరాలలో వినిపించిన గాథ. ప్రస్తుతం తాత్కాలిక రాజధాని నిర్మాణ పనుల్లో కార్మికుల పరిస్థితీ ఇలాగే ఉంది..బతుకుదెరువుకు ఊరిగాని ఊరి వచ్చి..అలుపెన్నది ఎరుగుక..ఆకలన్నది తీరక ఆయువును పణంగా పెట్టి పనులు చేస్తున్నారు..ప్రభుత్వ హడావుడి, కాంట్రాక్టర్ల కాఠిన్యానికి నిలువునా బలవుతున్నారు. సాక్షి, అమరావతి: సచివాలయ నిర్మాణ పనుల్లో కూలీలకు కాంట్రాక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. షిఫ్ట్‌ల పద్ధతిన కాకుండా ఏకదాటిగా 10 గంటలపాటు పనులు చేయిస్తున్నారు. ఐదు నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం లేదని కూలీలు కన్నీరు పెడుతున్నారు. బరువులెత్తి అలసి కూర్చుంటే కాంట్రాక్టర్లు కసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు లేదా 7 గంటలకు విడిచి పెడుతున్నారు. మహిళలకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయకపోవటంతో ఎక్కడపడితే అక్కడ నిద్రిస్తున్నారు. మహిళా కూలీలు బయటకు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. మంచినీరు కావాలంటే మందడం వెళ్లాలి. లేదంటే అక్కడే ఉన్న క్యాంటీన్లో కొనుగోలు చేసుకోవాలి. ప్రై వేటు క్యాంటీన్లో లీటరు రూ.5. అన్న క్యాంటీన్లో రూ.5లకు చిన్న గరిటే అన్నం పెడుతున్నారు. ఇది కూలీలకు సరిపోవడం లేదు. ఇదీ క్యాంటీన్ నిర్వహణ సమయానికి వెళితేనే. తాత్కాలిక సచివాలయ పనుల్లో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ఇప్పటికైనా కార్మిక సంఘాలు స్పందించాలని వారు కోరుతున్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా మొట్టమొదటగా చేపట్టి నిర్మాణం తాత్కాలిక సచివాలయం. ఐదు నెలల క్రితం ప్రారంభమైన నిర్మాణ పనుల కోసం ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. గతlనెల 10న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు మరణించారు. అంతకు ముందు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో కూలీ మరణించడంతో అనేక మంది వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పనిచేసే కాంట్రాక్టు కూలీలను తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులకు తరలించారు. ఇటీవల తాత్కాలిక సచివాలయం రెండో భవనంలో పిట్టగోడ కూలడంతో ఐదుగురు గాయపడ్డారు. అందులో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా గుంటూరు నుంచి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల కోసం కూలీలను తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వరుస సంఘటనలతో కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. తాత్కాలిక సచివాలయంలో పనిచేయటం ప్రాణాలతో చెలగాటమని తెలుసుకుని కొందరు మానేస్తుంటే.. మరి కొందరు విధిలేక నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పని చేస్తున్న కూలీలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. పనులు పూర్తి చేయటమే లక్ష్యంగా అధికారులు, పాలకులు దష్టి సారిస్తున్నారేగానీ వారి యోగక్షేమాల గురించి పట్టించుకోవడం లేదు. -
వెట్టిచాకిరి నుంచి పది మందికి విముక్తి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పదేళ్ల పాటు కట్టెలు కొట్టే పనిలో వెట్టిచాకిరి చేస్తున్న పది మందికి సబ్ కలెక్టర్, ఆర్డీవో అభిరామి ఆదివారం విముక్తి కల్పించారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని ఉట్కోట్టం ప్రాంతానికి చెందిన కుమార్(45) అదే ప్రాంతంలో కట్టెల దొడ్డిని నిర్వహిస్తున్నాడు. ఇతను కడంబత్తూరు ప్రాంతంలోని అదిగత్తూరు ప్రాంతానికి చెందిన పది మందితో పదేళ్లుగా వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. తమకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ బాధితులు ఆదివాసి సంక్షేమ సంఘం ప్రతినిధులను ఆశ్రయించారు. సంఘం ప్రతినిధులు తిరువళ్లూరు ఆర్డీవో అభిరామికి రహస్య సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులతో కలిసి ఆదివారం ఉదయం కట్టెల దొడ్డిపై ఆమె తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరి చేస్తున్న పది మంది కి విముక్తి కల్పించారు. అనంతరం కుమార్‌పై కేసు నమోదు చేశారు. పది మంది బాధితులకు తాత్కాలిక సహాయం కింద రూ.1000 అందజేశారు. స్వయం ఉపాధి చేసుకోవడానికి రూ.25 వేల చొప్పున అందజేస్తామని ఆర్డీవో అభిరామి వివరించారు.