29న క్రీడాప్రతిభా పురస్కారాల ప్రదానం
29న క్రీడాప్రతిభా పురస్కారాల ప్రదానం
Published Sun, Aug 14 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
నెల్లూరు(బృందావనం): జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని సింహపురి స్పోర్ట్సు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు క్రీడాకారులకు ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ఆ ఫౌండేషన్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. నవాబుపేటలోని ఎస్‌ఎస్‌ఎఫ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఆరేళ్ల క్రితం స్పోర్ట్సు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పట్నుంచి జాతీయ క్రీడాదినోత్సవం నాడు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. క్రీడాప్రతిభా పురస్కారాలకు సంబంధించిన దరఖాస్తులను ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్సు కాంప్లెక్స్‌లోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయం, సింహపురి స్పోర్ట్సు ఫౌండేషన్ కార్యాలయంలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 25లోగా క్రీడాకారులు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. వివరాలకు 92467 77777 నంబరులో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్‌రావు, సహాయ కార్యదర్శి సరాబు సుబ్రహ్మణం, కార్యవర్గసభ్యులు అమరా వెంకు పాల్గొన్నారు.
Advertisement
Advertisement