హరికృష్ణను అవార్డుతో సత్కరిస్తున్న మాజీ గవర్నర్ రోశయ్య
నిజామాబాద్‌అర్బన్ : ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు హరికృష్ణకు వైద్యరత్న, సేవ రత్న అవార్డు లభించింది. తెలుగుభాష సాంస్కృతికశాఖ ఆదర్శపౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా హరికృష్ణ ఈ అవార్డును అందుకున్నారు.
కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లాలో నవజాత శిశువులకు అత్యవసర వైద్యచికిత్సలు అందించడం, అత్యాధునిక వైద్యసేవలు తీసుకరావడం, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఇఫ్తార్ విందులు, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడంతో డా.హరికృష్ణను ఈ అవార్డుకు ఎంపికచేశారు.
శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలను అవార్డు కారణమైనట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందని, మరింత బాధ్యతయుతంగా వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
ఉచిత ఆరోగ్యశిబిరాలు, వ్యాధుల నియంత్రణకు పాటుపడుతానన్నారు. తెలంగాణ సాహితీ అకాడమి చైర్మన్ నందనిసిద్దారెడ్డి, ఆదర్శ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కనుమ బోగరాజు, యువ కళావాహిణి అధ్యక్షులు వై.కె.నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment