
తిరుపతి: టెంపుల్ సిటీగా తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ విదేశాల్లోనూ తిరుపతి వైపు అందరి చూపు ఉంటుంది. అలాంటి తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకునే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా ఎవరో కాదు చెప్పేది, తిరుపతి స్థానికులే చెబుతున్నారు. బుధవారం అభినయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరమంతా పలు వేడుకలు, అన్న దాన, రక్త దాన, సేవా కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. అభినయ్ ని మరెన్నో ఉన్నత పదవుల్లో చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరిస్తూ నిరంతర శ్రామికుడిగా పేరు తెచ్చుకుంటున్నారు అని భూమన అభినయ్ ని కొనియాడారు.
'మీ అందరి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ ఇంటి బిడ్డగా కష్టాల్లో, సుఖాల్లో ఎప్పటికీ నేను తోడుంటా. ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మన తిరుపతి గౌరవాన్ని పెంచేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముంఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలోనే సాధ్యం. ఆయన అడుగు జాడల్లో నడుస్తాను, తిరుపతి ప్రజలారా.. మీకు అండగా ఉంటా.. తిరుపతి ఖ్యాతిని పెంచుదాం' అంటూ అభినయ్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం!
Comments
Please login to add a commentAdd a comment