devoloment
-
18ఏళ్లు.. ఎన్నో మేళ్లు.. పథకానికి వన్నె తెచ్చిన వైఎస్సార్!
కడప సిటీ : జాతీయ మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకానికి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమై అభివృద్ధిలో పరుగులు తీసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నీరు–చెట్టు పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ పథకాన్ని నిధులు దోచుకునేందుకు అవకాశం ఇచ్చారు. నాణ్యతకు తిలోదకాలిచ్చి.. నిధులు పక్కకు మళ్లించి.. కూలీలకు డబ్బులు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పథకానికి నిధులు కేటాయిస్తుంటాయి. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పనులు జియో ట్యాగ్ ద్వారా చేపట్టి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ అనుసంధానం చేసి కూలీల డబ్బులు చేతికి సక్రమంగా అందేలా డీబీటీ విధానాన్ని తీసుకొచ్చారు. 18 సంవత్సరాల కిందట ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో 2006 ఫిబ్రవరి 2న బండ్లపల్లెలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిచారు. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ఈ పథకం అభివృద్ధిలో పరుగులు తీసింది. తర్వాత చంద్రబాబు హయాంలో నత్తనడకన సాగింది. ఇదీ లక్ష్యం.. దేశంలోని పేద కూలీల బతుకులకు భద్రత కల్పించడంతోపాటు పస్తులు, ఆకలి చావులు, వలసలు, కరువులేని గ్రామీణ భారతం ఆవిష్కృరించేందుకు ఈ పథకం ఏర్పాటైంది. నైపుణ్యం, అవసరం లేని శారీరక శ్రమతో కూడిన పనులు చేసేందుకు ముందుకు వచ్చే వారందరికీ సంబంధిత కుటుంబానికి కనీసం ఏడాదికి 100 రోజులు పనిదినాలు కల్పించడం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా నిరుపేదల్లో ఆర్థిక వృద్ధి పెరిగింది. మహిళల్లో సాధికారత, కూలీల కుటుంబాల్లో ఆత్మగౌరవం పెరిగింది. దివంగత నేత వైఎస్సార్ హయాంలో ఉపాధిహామీ పనులు పరుగులు తీసిన సందర్భాలు ఉన్నాయి. హార్టికల్చర్ ద్వారా పండ్ల తోటల పెంపకం, ఇందిర జలప్రభ ద్వారా ఎస్సీ ఎస్టీలకు చెందిన బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చారు. దీంతో వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నీటి సంరక్షణ, కాలువ పనులు, సాగునీటి సదుపాయాలకు అనుగుణంగా పనులు, భూమిని అభివృద్ది పర్చడం వంటి పనులు చేశారు. పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి హామీ అభివృద్ది పనులపై ప్రత్యేక శ్రద్ద వహించారు. ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కూలీల డబ్బులు ఏ వారానికి ఆ వారం ఖాతాలో పడుతున్నాయి. ఆధార్ అనుసంధానం చేయడంతో కూలీల డబ్బులు పక్కదారి పట్టకుండా వారి చేతికి అందుతున్నాయి. డైరెక్ట్ బెనిఫిషరి ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం వల్ల ప్రతి రూపాయి కూలీలకు చేరుతోంది. అంతేకాకుండా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. చంద్రబాబు హయాంలో నిధులు పక్కదారి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఉపాధి పథకం సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరిట టీడీపీ నాయకులకు వరంగా మారి నిధులు దోచుకునేందుకు అవకాశం కల్పించారన్న విషయంపై ప్రజలు అప్పట్లో మండిపడ్డారు. వాస్తవంగా ఈ పనుల్లో నాణ్యత లోపించి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.విచారణలో ఇది వాస్తవమేని నిర్ధారణ కావడం గమనార్హం. నిధులు పక్కదారి పట్టడం, కూలీలకు డబ్బులు సకాలంలో అందకపోవడంతో అప్పట్లో ఇబ్బందులు పడ్డారు. కుట్ర పూరితంగా టీడీపీ వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి. వేతనాలు భారీగా పెరుగుదల ఉపాధి ఉనికిలోకి రాకముందు ‘సీమ’, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూలీల రోజు వేతనం రూ. 20 ఉండేది. ఈ చట్టం వచ్చాక కూలీల వేతనం గణనీయంగా పెరిగింది. కూలీలపై జరిగే ఆర్థిక దోపిడీ కనిష్ఠ స్థాయికి తగ్గిపోయింది. 2006–07లో పథకం ప్రారంభించిన సమయంలో రూ. 80 కనీస వేతనం కాగా, రూ. 77.67 వరకు వచ్చేది. 2010–11లో రూ. 121 కనీస వేతనం కాగా రూ. 91.76 వేతనం దక్కింది. 2015–16లో కనీస వేతనం రూ. 180 కాగా రూ. 131.42గా వచ్చేది. 2019–20లో కనీస వేతనం రూ. 211 కాగా, రూ. 210.10గా ఉంది. 2023–24లో ప్రస్తుతం కనీస వేతనం రూ. 272 ఉండగా, రూ.244.40గా అందుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రారంభంలో కనీస వేతనం రూ. 80 ఉండగా, ప్రస్తుతం ఈ మొత్తం రూ. 272కు చేరింది. పని అడిగిన 15 రోజుల్లోపల పని కల్పించకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పురుషులతోపాటు మహిళలకు సమాన వేతనం ఇవ్వాలని చట్టం ఉంది. అలాగే పని ప్రదేశాల్లో కూలీలకు, వారి పిల్లలకు అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కూలీలకు పనిని హక్కుగా కల్పిస్తూ ఈ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు. అభివృద్ధి పనులకు శ్రీకారం ఉపాధి పనుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నాం.కలెక్టర్ విజయరామరాజు ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆయన సూచనల, సలహాల మేరకు ఉపాధిహామీలో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఏర్పడింది. – పి.యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప -
ప్రజల మధ్యనే ఉంటూ.. తిరుపతి అభివృద్ధికి శ్రమిస్తూ..
తిరుపతి: టెంపుల్ సిటీగా తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ విదేశాల్లోనూ తిరుపతి వైపు అందరి చూపు ఉంటుంది. అలాంటి తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకునే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా ఎవరో కాదు చెప్పేది, తిరుపతి స్థానికులే చెబుతున్నారు. బుధవారం అభినయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరమంతా పలు వేడుకలు, అన్న దాన, రక్త దాన, సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. అభినయ్ ని మరెన్నో ఉన్నత పదవుల్లో చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరిస్తూ నిరంతర శ్రామికుడిగా పేరు తెచ్చుకుంటున్నారు అని భూమన అభినయ్ ని కొనియాడారు. 'మీ అందరి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ ఇంటి బిడ్డగా కష్టాల్లో, సుఖాల్లో ఎప్పటికీ నేను తోడుంటా. ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మన తిరుపతి గౌరవాన్ని పెంచేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముంఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలోనే సాధ్యం. ఆయన అడుగు జాడల్లో నడుస్తాను, తిరుపతి ప్రజలారా.. మీకు అండగా ఉంటా.. తిరుపతి ఖ్యాతిని పెంచుదాం' అంటూ అభినయ్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
టీడీపీ మోసపూరిత హామీల పార్టీ
మైదుకూరు టౌన్ : ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక కనీసం మేనిఫెస్టోలోని ఏఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశాడని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక నంద్యాల రోడ్డులోని పాతూరులో కూశెట్టి రాయుడు తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. ఈయనకు వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషాలు పార్టీ కండువాలు వేసి పార్టీలో చేర్చుకొన్నారు. ఈ సందర్భంగా కూశెట్టిరాయుడు, పట్టణ అధ్యక్షుడు లింగన్నలు స్థానిక అంకాళమ్మ గుడి వద్ద నుంచి పెద్దమ్మతల్లి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 నెలల పాలనలో మున్సిపాలిటీలో ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు. ఏ ప్రాంతంలోకి వెళ్లినా డ్రైనేజీలు, రోడ్లు, వీధిలైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునారన్నారు. అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో అడ్డగోలు హామీలు గుప్పించి ఇప్పటి వరకు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడమే కాకుండా మైదుకూరు మున్సిపాలిటీలోని ప్రజలను కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు రూ.5కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. మరుగుదొడ్ల డబ్బులు వదలని అధికార పార్టీ నేతలు.. మైదుకూరు మున్సిపాలిటీలో మరుగుదొడ్ల అవినీతి రూ. 87లక్షలకు పైగా జరిగినా బాధ్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఎందుకంటే మరుగుదొడ్ల నిధులు స్వాహా చేసిందంతా అధికార పార్టీ నాయకులు, కొంత మంది వార్డు కౌన్సిలర్లే అన్నారు. పుట్టా అభివృద్ధి పనులంటే ఇవేనా...? నియోజకవర్గంలో అదిచేశాం.. ఇదేచేశాం అని చెప్పుకునే టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పని ఏదైనా చేశారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైదుకూరుకు అగ్నిమాపక కేం ద్రం, 30 పడకల ఆసుపత్రి తీసుకొచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూ రు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి జ్వాలానరసింహాశర్మ, శ్రీమన్నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మదీనా దస్తగిరి, పట్టణ అధ్యక్షుడు లింగన్న, గోశెట్టి లక్షుమయ్య, బి.సుబ్బ రాయుడు, సర్పంచ్‌లు సుధాకర్ రెడ్డి. కొండా భాస్కర్‌రెడ్డి, నరసింహారెడ్డి, లెక్కల శివప్రసాద్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, కొండారెడ్డి, చొక్కం శివ, షేక్‌మున్నా, జెడ్పీటీసీ భర్త అవి లి రామకృష్ణారెడ్డి, యూత్ సెక్రటరీ అమర్నా«థ్‌రెడ్డి, చాపల షరీఫ్, చాపాడు నాయకులు ఎంపీపీ భర్త లక్షుమయ్య, ఉపమండలాధ్యక్షుడు సానా నరసింహారెడ్డి, ఎంపీటీసీలు యల్లారెడ్డి, మహేష్‌యాదవ్, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, సోషల్ æమీడియా ప్రతినిధి దస్తగిరి, రామాంజనేయరెడ్డి, నారాయణరెడ్డి, జయరాజు, బొలెరోబాషా, ఖాజీపేట మండల అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, బీసీ నాయకుడు వెంకటయ్య, చెన్నారెడ్డి, ఓబుల్‌రెడ్డి, మనోహర్, అంకయ్య, వెంకటసుబ్బారెడ్డి, కానాల జయచంద్రారెడ్డి, చింతకుంట వీరారెడ్డి, తువ్వపల్లె రఘు. వెన్నపూస ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధిలో ఇంజనీర్లు కీలకం
జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ ఘనంగా మోక్షగండం విశ్వేశ్వరయ్య జయంతి హన్మకొండ : దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అన్నారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్లు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి చైర్పర్సన్ గద్దల పద్మ, ఇంజనీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పద్మ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఇంజనీర్ అని అని కొనియాడారు. విశ్వేశ్వరయ్య నుంచి నేటి ఇంజనీర్లు స్ఫూర్తిని పొందాలని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అదేక్రమంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతగా ఉండేల చూడాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సంయుక్తంగా జెడ్పీ ఆవరణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమని గద్దల పద్మ కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు శ్రీనివాస్‌రావు, రాజేంద్రప్రసాద్, డీఈలు సురేష్, కృష్ణారెడ్డి, ఇంజనీర్ అసోషియేషన్ల నాయకులు పులి ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హన్మకొండలోని జెడ్పీ ఆవరణలో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకుడు ఈవీ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి
త్వరలోనే మండల కమిటీల ఏర్పాటు చేస్తాం పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌కుమార్ మందమర్రి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజోపయోగ పథకాలు, ఆశయాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం మందమర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే జిల్లా అంతటా పర్యటించి అన్ని మండలాలకు కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా గ్రామస్థాయిలో అన్ని వర్గాల వారితో సమావేశం అవుతామని తెలిపారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందారని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది పేదవారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందారని వివరించారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్ప కొలువులు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని అన్నారు. ప్రజలు రాజశేఖరరెడ్డి పాలనను కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు ఓడ్నాల సతీశ్, కార్యదర్శి జాడి శ్రావణ్, మందమర్రి మండల అధ్యక్షుడు ఓడ్నాల అజయ్‌కుమార్, నాయకులు రాము, సాయి, రాజేశ్, రంజిత్, శ్రీనివాస్, వినోద్ వెంకట్, శ్రీకాంత్, సురేశ్ పాల్గొన్నారు.