సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
మైదుకూరు టౌన్ : ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక కనీసం మేనిఫెస్టోలోని ఏఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశాడని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక నంద్యాల రోడ్డులోని పాతూరులో కూశెట్టి రాయుడు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈయనకు వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషాలు పార్టీ కండువాలు వేసి పార్టీలో చేర్చుకొన్నారు. ఈ సందర్భంగా కూశెట్టిరాయుడు, పట్టణ అధ్యక్షుడు లింగన్నలు స్థానిక అంకాళమ్మ గుడి వద్ద నుంచి పెద్దమ్మతల్లి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 నెలల పాలనలో మున్సిపాలిటీలో ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు.
ఏ ప్రాంతంలోకి వెళ్లినా డ్రైనేజీలు, రోడ్లు, వీధిలైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునారన్నారు. అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో అడ్డగోలు హామీలు గుప్పించి ఇప్పటి వరకు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడమే కాకుండా మైదుకూరు మున్సిపాలిటీలోని ప్రజలను కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు రూ.5కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వకుండా మోసం చేశారన్నారు.
మరుగుదొడ్ల డబ్బులు వదలని అధికార పార్టీ నేతలు..
మైదుకూరు మున్సిపాలిటీలో మరుగుదొడ్ల అవినీతి రూ. 87లక్షలకు పైగా జరిగినా బాధ్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఎందుకంటే మరుగుదొడ్ల నిధులు స్వాహా చేసిందంతా అధికార పార్టీ నాయకులు, కొంత మంది వార్డు కౌన్సిలర్లే అన్నారు.
పుట్టా అభివృద్ధి పనులంటే ఇవేనా...?
నియోజకవర్గంలో అదిచేశాం.. ఇదేచేశాం అని చెప్పుకునే టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పని ఏదైనా చేశారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైదుకూరుకు అగ్నిమాపక కేం ద్రం, 30 పడకల ఆసుపత్రి తీసుకొచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూ రు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి జ్వాలానరసింహాశర్మ, శ్రీమన్నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మదీనా దస్తగిరి, పట్టణ అధ్యక్షుడు లింగన్న, గోశెట్టి లక్షుమయ్య, బి.సుబ్బ రాయుడు, సర్పంచ్‌లు సుధాకర్ రెడ్డి.
కొండా భాస్కర్‌రెడ్డి, నరసింహారెడ్డి, లెక్కల శివప్రసాద్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, కొండారెడ్డి, చొక్కం శివ, షేక్‌మున్నా, జెడ్పీటీసీ భర్త అవి లి రామకృష్ణారెడ్డి, యూత్ సెక్రటరీ అమర్‌నా«థ్‌రెడ్డి, చాపల షరీఫ్, చాపాడు నాయకులు ఎంపీపీ భర్త లక్షుమయ్య, ఉపమండలాధ్యక్షుడు సానా నరసింహారెడ్డి, ఎంపీటీసీలు యల్లారెడ్డి, మహేష్‌యాదవ్, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, సోషల్ æమీడియా ప్రతినిధి దస్తగిరి, రామాంజనేయరెడ్డి, నారాయణరెడ్డి, జయరాజు, బొలెరోబాషా, ఖాజీపేట మండల అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, బీసీ నాయకుడు వెంకటయ్య, చెన్నారెడ్డి, ఓబుల్‌రెడ్డి, మనోహర్, అంకయ్య, వెంకటసుబ్బారెడ్డి, కానాల జయచంద్రారెడ్డి, చింతకుంట వీరారెడ్డి, తువ్వపల్లె రఘు. వెన్నపూస ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment