MLA raghurami Reddy
-
2019 ఎన్నికల తర్వాత టీడీపీ గల్లంతు
చాపాడు: రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. వెంగన్నగారిపల్లెలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలో వచ్చారన్నారు. ఎంపీ సీఎం రమేష్ చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలుసని, దొంగసారాయి వ్యాపారంలో తన తండ్రితో పాటు కేసుల్లో ఇరుక్కుంటే మైసూరారెడ్డి వద్ద కాళ్లబేరానికి వచ్చారన్నారు. ఈయన చంద్రబాబు పంచన చేరి ఆయన బినామీగా వేల కోట్లు సంపాదించారన్నారు. సొంత జిల్లా అనే రమేష్ ఏనాడైనా సాగునీటి గురించి పట్టించుకున్నాడా, పరిశ్రమల గురించి పోరాటాలు చేశాడా.. నాలుగున్నరేళ్లు బీజేపీ పంచన ఉండి, ఏనాడు పార్లమెంట్లో మాట్లాడకుండా ఉక్కు పరిశ్రమ అంటూ 10 రోజులు దొంగదీక్ష చేశాడన్నారు. ఈ నెల 20న ప్రొద్దుటూరులో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష అని సభ పెడుతున్నారని, ఈయన చేసేవి ధర్మ పోరాట దీక్షలు కాదని, అధర్మ పోరాట దీక్షలన్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం 857 అడుగులకు తగ్గిందని, మూడు అడుగులు తగ్గితే కేసీ కాలువలకు సాగునీరు అందదన్నారు. తాను ప్రతి ఏటా సాగునీటి కోసం అధికారులు, ప్రభుత్వంపై వత్తిడి చేస్తున్నానని, టీడీపీ నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజశేఖరరెడ్డి, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, ఎంపీపీ భర్త లక్షుమయ్య, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మదీనా దస్తగిరి, మండల నాయకులు అన్నవరం రామమోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ మోసపూరిత హామీల పార్టీ
మైదుకూరు టౌన్ : ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక కనీసం మేనిఫెస్టోలోని ఏఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశాడని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక నంద్యాల రోడ్డులోని పాతూరులో కూశెట్టి రాయుడు తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. ఈయనకు వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషాలు పార్టీ కండువాలు వేసి పార్టీలో చేర్చుకొన్నారు. ఈ సందర్భంగా కూశెట్టిరాయుడు, పట్టణ అధ్యక్షుడు లింగన్నలు స్థానిక అంకాళమ్మ గుడి వద్ద నుంచి పెద్దమ్మతల్లి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 నెలల పాలనలో మున్సిపాలిటీలో ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు. ఏ ప్రాంతంలోకి వెళ్లినా డ్రైనేజీలు, రోడ్లు, వీధిలైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునారన్నారు. అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో అడ్డగోలు హామీలు గుప్పించి ఇప్పటి వరకు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడమే కాకుండా మైదుకూరు మున్సిపాలిటీలోని ప్రజలను కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు రూ.5కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. మరుగుదొడ్ల డబ్బులు వదలని అధికార పార్టీ నేతలు.. మైదుకూరు మున్సిపాలిటీలో మరుగుదొడ్ల అవినీతి రూ. 87లక్షలకు పైగా జరిగినా బాధ్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఎందుకంటే మరుగుదొడ్ల నిధులు స్వాహా చేసిందంతా అధికార పార్టీ నాయకులు, కొంత మంది వార్డు కౌన్సిలర్లే అన్నారు. పుట్టా అభివృద్ధి పనులంటే ఇవేనా...? నియోజకవర్గంలో అదిచేశాం.. ఇదేచేశాం అని చెప్పుకునే టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పని ఏదైనా చేశారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైదుకూరుకు అగ్నిమాపక కేం ద్రం, 30 పడకల ఆసుపత్రి తీసుకొచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూ రు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి జ్వాలానరసింహాశర్మ, శ్రీమన్నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మదీనా దస్తగిరి, పట్టణ అధ్యక్షుడు లింగన్న, గోశెట్టి లక్షుమయ్య, బి.సుబ్బ రాయుడు, సర్పంచ్‌లు సుధాకర్ రెడ్డి. కొండా భాస్కర్‌రెడ్డి, నరసింహారెడ్డి, లెక్కల శివప్రసాద్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, కొండారెడ్డి, చొక్కం శివ, షేక్‌మున్నా, జెడ్పీటీసీ భర్త అవి లి రామకృష్ణారెడ్డి, యూత్ సెక్రటరీ అమర్నా«థ్‌రెడ్డి, చాపల షరీఫ్, చాపాడు నాయకులు ఎంపీపీ భర్త లక్షుమయ్య, ఉపమండలాధ్యక్షుడు సానా నరసింహారెడ్డి, ఎంపీటీసీలు యల్లారెడ్డి, మహేష్‌యాదవ్, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, సోషల్ æమీడియా ప్రతినిధి దస్తగిరి, రామాంజనేయరెడ్డి, నారాయణరెడ్డి, జయరాజు, బొలెరోబాషా, ఖాజీపేట మండల అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, బీసీ నాయకుడు వెంకటయ్య, చెన్నారెడ్డి, ఓబుల్‌రెడ్డి, మనోహర్, అంకయ్య, వెంకటసుబ్బారెడ్డి, కానాల జయచంద్రారెడ్డి, చింతకుంట వీరారెడ్డి, తువ్వపల్లె రఘు. వెన్నపూస ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు. -
మైదుకూరు ఎమ్మెల్యే రాజీనామా
- స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా లేఖ - పదే పదే ప్రొటోకాల్ ఉల్లంఘనతో మనస్తాపం - పలుమార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం సాక్షి ప్రతినిధి, కడప: అధికారులు పదే పదే ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి అవమానిస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో ఆయన శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరుతూ లేఖను స్పీకర్‌కు ఫ్యాక్స్ చేశారు. కొరియర్ ద్వారా కూడా పంపారు. శుక్రవారం మైదుకూరులో చోటుచేసుకున్న ప్రొటోకాల్ ఉల్లంఘనతోపాటు గతంలో జరిగిన సంఘటనలను ఆయన తన రాజీనామా లేఖలో వివరించారు. ఆ వివరాలు.. శుక్రవారం నిర్వహిస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డిని జమ్మలమడుగు ఆర్డీఓ ఆహ్వానించారు. మైదుకూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను తొలుత వేదికపైకి పిలవాల్సింది పోయి ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఆహ్వానించారు. ఇలా ఆహ్వానించడం ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. జిల్లాలో అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం ఇది తొలిసారి కాదు. పలుమార్లు జరిగింది.దీన్ని స్పీకర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తీవ్రంగా మనస్తాపం చెందిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.