సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
బ్రహ్మంగారిమఠం(వైఎస్సార్ కడప): సర్పంచ్‌ల పదవీకాలం రేపటితో ముగియనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ముందుకు పోలేక టీడీపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మంగళవారం బి. మఠం మండలంలోని 11 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లు ఐదేళ్లపాటు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి నిధులు అందుతాయన్నారు. ఓటమి భయంతో సీఎం ఎన్నికలకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. అలాంటప్పుడు ప్రస్తుత సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించాలన్నారు.
దీనిపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ ప్రస్తుత సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని లేఖ కూడా రాసినట్లు చెప్పారు. సర్పంచ్‌ల విధానాలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సోమిరెడ్డిపల్లె సర్పంచ్ శ్రీదేవమ్మ, ముడమాల సర్పంచ్ పెంచలమ్మ, పలుగురాళ్లపల్లె సర్పంచ్ పుట్టా పోలమ్మ, చౌదరివారిపల్లె సర్పంచ్ చెవుల వెంకటమ్మ, తోట్లపల్లె సర్పంచ్ వాణి, రేకలకుంట సర్పంచి జోత్స్న, మల్లేపల్లె సర్పంచ్ నాగిపోగు పెంచలయ్య, నాగిశెట్టిపల్లె సర్పంచ్ నాగిపోగు ఏసురత్నం, దిరశవంచ సర్పంచ్ సుబ్బారెడ్డి, గోడ్లవీడు సర్పంచ్ జయరామిరెడ్డిల ఘనంగా ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి, ఎంపీపీ డి.చక్రవర్తి, బి.మఠం సింగిల్ విండో అధ్యక్షులు సి.వీరనారా యణరెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఈఓపీఆర్డీ రామచంద్రారెడ్డి, పీఆర్‌ఏఈ సుబ్రమణ్యం, ఎంపీటీసీలు పసుపులేటి రామయ్య, బాలయ్య, గురువయ్య, బిజివేముల సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment