వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి | do for ysrcp devoloment | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి

Published Mon, Jul 25 2016 12:02 AM | Last Updated on Fri, Sep 28 2018 7:57 PM

వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి - Sakshi

వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి

  • త్వరలోనే మండల కమిటీల ఏర్పాటు  చేస్తాం
  • పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌కుమార్‌
  • మందమర్రి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజోపయోగ పథకాలు, ఆశయాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆదివారం మందమర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే జిల్లా అంతటా పర్యటించి అన్ని మండలాలకు కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా గ్రామస్థాయిలో అన్ని వర్గాల వారితో సమావేశం అవుతామని తెలిపారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందారని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది పేదవారు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం పొందారని వివరించారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్ప కొలువులు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని అన్నారు. ప్రజలు రాజశేఖరరెడ్డి పాలనను కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా యూత్‌ అధ్యక్షుడు ఓడ్నాల సతీశ్, కార్యదర్శి జాడి శ్రావణ్, మందమర్రి మండల అధ్యక్షుడు ఓడ్నాల అజయ్‌కుమార్, నాయకులు రాము, సాయి, రాజేశ్, రంజిత్, శ్రీనివాస్, వినోద్‌ వెంకట్, శ్రీకాంత్, సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement