- జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ
- ఘనంగా మోక్షగండం విశ్వేశ్వరయ్య జయంతి
అభివృద్ధిలో ఇంజనీర్లు కీలకం
Published Fri, Sep 16 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
హన్మకొండ : దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ అన్నారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్లు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఇంజనీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పద్మ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఇంజనీర్ అని అని కొనియాడారు. విశ్వేశ్వరయ్య నుంచి నేటి ఇంజనీర్లు స్ఫూర్తిని పొందాలని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అదేక్రమంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతగా ఉండేల చూడాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సంయుక్తంగా జెడ్పీ ఆవరణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమని గద్దల పద్మ కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈలు శ్రీనివాస్‌రావు, రాజేంద్రప్రసాద్, డీఈలు సురేష్, కృష్ణారెడ్డి, ఇంజనీర్ అసోషియేషన్ల నాయకులు పులి ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హన్మకొండలోని జెడ్పీ ఆవరణలో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకుడు ఈవీ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Advertisement
Advertisement