చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు అవార్డు అందజేస్తున్న దృశ్యం
మసాచుసెట్స్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం అమెరికాలో హార్వర్డ్ లా స్కూల్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు అందుకున్నారు. ఆయన హార్వర్డ్ లా స్కూల్‌లోనే 1982–83లో ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ చేశారు. 1983–86 మధ్య జ్యుడీషియల్ సైన్సెస్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు.
గత జనవరిలో ఆయనకు ఈ అవార్డును ప్రకటించడం తెలిసిందే. సుప్రీంకోర్టులో టెక్నాలజీ వినియోగం మరింత పెంచడంసహా సీజేఐగా తొలి ఏడాది తాను చేపట్టిన పలు చర్యలను అవార్డ్ అందుకున్న సందర్భంగా ఆయన వివరించారు. లాయర్ల మానసిక ఆరోగ్యం తదితర అంశాలను స్పృశిస్తూ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment