పార్శిల్‌ బిజినెస్‌లోకి జొమాటో.. ఎవరు వినియోగించుకోవచ్చంటే? | Zomato Launches Logistics Xtreme For Merchants | Sakshi
Sakshi News home page

పార్శిల్‌ బిజినెస్‌లోకి జొమాటో.. ఎవరు వినియోగించుకోవచ్చంటే?

Published Fri, Oct 13 2023 6:53 PM | Last Updated on Fri, Oct 13 2023 7:08 PM

Zomato Launches Logistics Xtreme For Merchants - Sakshi

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా జొమాటొ ఎక్స్‌ ట్రీం పేరుతో కొత్త పార్శిల్‌ సర్వీసుల్ని ప్రారంభించింది.  

ఇప్పటికే ఈ ఎక్స్‌ట్రీమ్‌ కింద 3 లక్షల మంది డెలివరీ పార్టనర్‌లు ఉన్నట్లు తెలిపిన జొమాటో.. ఈ పార్శిల్‌ సర్వీసుల్ని చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద రీటైల్‌ షాపుల వరకు ఈ సేవల్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. 

ఇది ఫుడ్‌ డెలివరీ తరహాలో వ్యాపారులు తమ సరుకులను ప్రత్యక్షంగా ట్రాక్ చేసుకోవచ్చు. 35 రూపాయలతో ప్రారంభమయ్యే 10 కిలోగ్రాముల బరువున్న ఇంట్రా-సిటీ ప్యాకేజీలను మాత్రమే పంపగలరని జొమాటో వెల్లడించింది. ఇక ఈ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ప్రస్తుతానికి ఆండ్రాయి వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్‌ స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులోకి రాలేదు. దీనిపై జొమాటో మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement