parcle
-
పార్శిల్ బిజినెస్‌లోకి జొమాటో.. ఎవరు వినియోగించుకోవచ్చంటే?
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా జొమాటొ ఎక్స్ ట్రీం పేరుతో కొత్త పార్శిల్ సర్వీసుల్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఎక్స్ట్రీమ్ కింద 3 లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నట్లు తెలిపిన జొమాటో.. ఈ పార్శిల్ సర్వీసుల్ని చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద రీటైల్ షాపుల వరకు ఈ సేవల్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇది ఫుడ్ డెలివరీ తరహాలో వ్యాపారులు తమ సరుకులను ప్రత్యక్షంగా ట్రాక్ చేసుకోవచ్చు. 35 రూపాయలతో ప్రారంభమయ్యే 10 కిలోగ్రాముల బరువున్న ఇంట్రా-సిటీ ప్యాకేజీలను మాత్రమే పంపగలరని జొమాటో వెల్లడించింది. ఇక ఈ ఎక్స్ట్రీమ్ యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయి వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులోకి రాలేదు. దీనిపై జొమాటో మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
72 గంటలపాటు పార్శిల్స్ తాకొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ల బారిన పడకుండా ఉండాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెప్పించుకునే అన్లైన్ ప్యాకేజీలను 72 గంటలపాటు తెరవకుండా ఉండాలని బాత్, బిస్టల్, సౌతాంప్టన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూ విజంభించిన రోజుల్లో ఈ సూచనలను పాటించడం సత్ఫలితాలను ఇచ్చిందని వారు చెబుతున్నారు. (మూడు విడతలుగా లాక్డౌన్ ఎత్తివేత) ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్‌పైన కరోన వైరస్ 72 గంటలు, రాగిపై ఎనిమిది గంటలు, కార్డ్‌బోర్డ్‌పై నాలుగు గంటలపాటు బతికి ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుక్కోవడం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఎక్కువగా ప్యాకేజీల కోసం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తుండడంతో పరిశోధకులు ఈ 72 గంటల సూచనను తీసుకొచ్చినట్లున్నారు. ఈ సూచనను తప్పకుండా పాటించాల్సిందిగా ప్రజలకు బ్రిటీష్ ప్రభుత్వ వెబ్సైట్ పిలుపునిచ్చింది. వాస్తవానికి ఇది అన్ని దేశాల ప్రజలకు వర్తిస్తుంది. (ప్లాస్టిక్ కవర్లలో శవాలు.. పక్కనే పేషెంట్లు) -
నకిలీ పార్శిల్‌తో టోకరా
అచ్చంపేట: ఖరీదైన సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్ లాటరీలో తగిలిందన్న అపరిచితుల కాల్‌ను నమ్మి రూ.3 వేలు మోసపోయాడు ఓ బాధితుడు. అచ్చంపేటకు చెంది కత్తి చంద్రం సెల్‌ఫోన్‌కు నాలుగురోజుల కిందట ఢిల్లీ నుంచి ఓ కాల్ వచ్చింది. ఆయుర్వేదిక్ హెర్బల్ కంపెనీ తరపున నీ ఫోన్ నెంబరుకు బంపర్ ఆఫర్ తగిలిందని, అందులో రూ.30 వేల చెక్కు, రూ.15 వేల ఖరీదు చేసే శ్యాంసంగ్ గెలాక్సీ ఫోను, రూ.5 వేల విలువచేసే రిస్ట్‌వాచ్ వచ్చాయని చెప్పారు. అడ్రస్ చెప్తే పార్శిల్ పంపుతామని నమ్మించారు. నిజమేనని నమ్మిన చంద్రం వారికి తన చిరునామా ఇచ్చాడు. వారు చెప్పినట్టుగానే శుక్రవారం అతని పేరిట పోస్టాఫీసుకు ఒక పార్శిల్ వచ్చింది. రూ.3వేలు చెల్లించి తీసుకోవాలని పోస్టుమ్యాన్ చెప్పడంతో అలాగే తీసుకున్నాడు. విప్పిచూడగా అందులో మూడు ప్యాకెట్ల భస్మం, కొన్ని చిత్తు కాగితాలు, ఒక చెక్కపెట్టె ఉన్నాయి. తాను మోసపోయానని గ్రహించిన చంద్రం శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.