హైదరాబాద్: ప్రెస్టీజీ బ్రాండు పేరుతో నకిలీ ఉపకరణాలు అమ్ముతున్న విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ చట్టపరమైన చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్‌ను దురి్వనియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న కొందరు విక్రేతలపై ఫిర్యాదు దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో శివసాయి కేంద్రం, తెలంగాణలో బెథల్ ఇండస్ట్రీస్‌పై ఫిర్యాదు చేసింది.
ఈ రెండు కేసుల్లోనూ తక్షణం స్పందించిన పోలీసులు నకిలీ వస్తువులను స్వా«దీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ‘టీటీకే బ్రాండ్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీలపై ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి’ అని సంస్థ ఒక ప్రకటనలో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment