Prestige
-
Nirmala Sitharaman: భారత్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర
న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్టను దెబ్బతీసి.. మనదేశం పెట్టుబడులకు సురక్షితం కాదనే సందేశాన్ని విదేశీ ఇన్వెస్టర్లకు పంపే కుట్ర జరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2024–25 బడ్జెట్‌పై చర్చకు లోక్‌సభలో ఆమె సమాధానమిస్తూ విపక్షాలపై మండిపడ్డారు. ‘భారత సామాజిక విలువలపై, పార్లమెంటరీ సాంప్రదాయాలపై, సాయుధ బలగాలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్రదాడి జరిగింది. దేశంలో అస్థిరత, అరాచకత్వం ఉంటే.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. ఇదో పెద్ద సవాల్’ అని నిర్మల అన్నారు. భిన్నత్వం కలిగిన సమాజాన్ని తరతరాల కృషితో భారత్ ఏకతాటి పైకి తెచి్చందని, కానీ ఈ రోజు కుట్రపూరితంగా ఒకరికిపై మరొకరికి అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు, కుయుక్తులతో ప్రజల మధ్యన విభజన తెస్తున్నారని ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను కలి్పంచే ప్రయత్నం జరుగుతోందని, చిన్నపాటి నిప్పురవ్వ (గొడవ) కూడా తీవ్ర సంఘర్షణలకు దారితీయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఏదో ఒక వంకతో సాయుధ బలగాలపై దాడులను ముమ్మరం చేస్తున్నారని ఆక్షేపించారు. అగి్నవీర్లపై వివాదం ఈ కుట్రలో భాగమన్నారు. సమాజమే కాకుండా ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు, సైన్యంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను విలన్లుగా చూపుతున్నారని, ఇది సిగ్గుచేటని పేర్కొన్నారు. ‘పారిశ్రామిక సంస్కృతిని ముగించాలనే కుట్ర జరుగుతోంది. భారత్ వెన్నుముకపై దాడి జరుగుతోంది. వ్యాపారులపై ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నారు. సంపదను సృష్టించే వారిపై, వ్యాపారాలపై ద్వేషం ప్రబలుతోంది. పెట్టుబడులకు భారత్ సురక్షితం కాదనే సందేశాన్ని ప్రపంచానికి పంపే కుట్ర జరుగుతోంది. ఇది మంచిది కాదు’ అని నిర్మల అన్నారు.2009 బడ్జెట్లో ఏకంగా 26 రాష్ట్రాల ప్రస్తావన లేదు బడ్జెల్లో ఏదేని రాష్ట్రం ప్రస్తావన రాకపోతే సదరు రాష్ట్రానికి అసలే నిధుల కేటాయింపు జరగనట్లు కాదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను సంతృప్తిపర్చడానికే బడ్జెలో ప్రాధాన్యమిచ్చారనే విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. యూపీఏ హయాంలో 2009–10 బడ్జెట్లో ఏకంగా 26 రాష్ట్రాల ఊసు లేదని, 2004–05 బడ్జెట్లో 17 రాష్ట్రాల ప్రస్తావనే లేదని.. అంటే ఆ రాష్ట్రాలకు నిధులు వెళ్లలేదా? అప్పుడు ప్రస్తావన లేని రాష్ట్రాలకు నిధులు ఆపి ఉంటే.. ఇప్పుడిలా కనీస ప్రస్తావన లేదనే అంశాన్ని లేవనెత్తవచ్చు’ అని నిర్మల అన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రానికి నిధులను నిరాకరించలేదన్నారు. -
రియల్టీ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజాలు ప్రాపరీ్టల అమ్మకాలలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్పీడందుకున్నాయి. 18 లిస్టెడ్ కంపెనీలు మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాయి. ఈ జాబితాలో గోద్రెజ్ ప్రాపరీ్టస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీఎల్ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్, సిగ్నేచర్ గ్లోబల్ తదితరాలు అగ్రపథంలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 25,527 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్ సాధించి తొలి స్థానాన్ని పొందింది. అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే కొద్దిపాటి కంపెనీలను మినహాయిస్తే ప్రధాన సంస్థలన్నీ అమ్మకాల బుకింగ్స్‌లో జోరు చూపాయి. ఇందుకు ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పుట్టిన పటిష్ట డిమాండ్ కారణమైంది. ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా విలాసవంత గృహాలకు భారీ డిమాండ్ కనిపించడం తోడ్పాటునిచి్చంది! శోభా, బ్రిగేడ్, పుర్వంకారా.. రియల్టీ రంగ లిస్టెడ్ దిగ్గజాలలో గతేడాది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 21,040 కోట్ల అమ్మకాల బుకింగ్స్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. ఇక డీఎల్ఎఫ్ రూ. 14,778 కోట్లు, లోధా బ్రాండ్ మాక్రోటెక్ రూ. 14,520 కోట్లు, గురుగ్రామ్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ రూ. 7,270 కోట్లు చొప్పున ప్రీసేల్స్ సాధించి తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ బాటలో బెంగళూరు సంస్థ శోభా లిమిటెడ్ రూ. 6,644 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 6,013 కోట్లు, పుర్వంకారా రూ. 5,914 కోట్లు, ముంబై కంపెనీ ఒబెరాయ్ రియల్టీ రూ. 4,007 కోట్లు, కోల్టే పాటిల్ రూ. 2,822 కోట్లు, మహీంద్రా లైఫ్సై్పస్ రూ. 2,328 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ. 2,266 కోట్లు, సన్‌టెక్ రియల్టీ రూ. 1,915 కోట్లు చొప్పున అమ్మకాల బుకింగ్స్ నమోదు చేశాయి. ఇదేవిధంగా ఏషియానా హౌసింగ్ రూ. 1,798 కోట్లు, అరవింద్ స్మార్ట్‌స్పేసెస్ రూ. 1,107 కోట్లు, అజ్మీరా రియల్టీ అండ్ ఇన్ఫ్రా రూ. 1,017 కోట్లు, ఎల్డెకో హౌసింగ్ రూ. 388 కోట్లు, ఇండియాబుల్స్ రియల్టీ రూ. 280 కోట్లు చొప్పున బుకింగ్స్ అందుకున్నాయి. అయితే ఒమాక్సే తదితర కొన్ని కంపెనీల వివరాలు వెల్లడికావలసి ఉంది. ఇతర దిగ్గజాలు.. ఇతర దిగ్గజాలలో టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రా, అదానీ రియలీ్ట, పిరమల్ రియల్టీ, హీరానందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ తదితరాలు నాన్‌లిస్టెడ్ కంపెనీలుకావడంతో త్రైమాసిక, వార్షిక బుకింగ్స్ వివరాలు వెల్లడించని సంగతి తెలిసిందే. కాగా.. కోవిడ్–19 తదుపరి సొంత ఇంటికి ప్రాధాన్యత పెరగడంతో హౌసింగ్ రంగం ఊపందుకున్నట్లు రియల్టీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పటిష్టస్థాయిలో ప్రాజెక్టులను పూర్తిచేసే కంపెనీల ప్రాపరీ్టలకు డిమాండు పెరిగినట్లు తెలియజేశారు. వెరసి బ్రాండెడ్ గృహాలవైపు కన్జూమర్ చూపుసారించడం లిస్టెడ్ కంపెనీలకు కలసి వస్తున్నట్లు తెలియజేశారు. గతంలో యూనిటెక్, జేపీ ఇన్ఫ్రాటెక్ తదితరాల హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తికాకపోగా.. విఫలంకావడంతో గృహ కొనుగోలుదారులు ధర అధికమైనా రిస్‌్కలేని వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.33 శాతం వృద్ధిబలమైన కన్జూమర్ డిమాండ్ నేపథ్యంలో గతేడాది దేశీ రియల్టీ రంగంలో రికార్డ్ ప్రీసేల్స్ నమోదయ్యాయి. ఆయా కంపెనీల సమాచారం ప్రకారం లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,16,635 కోట్ల సేల్స్ బుకింగ్స్‌ను సాధించాయి. 2022–23లో నమోదైన రూ. 88,000 కోట్ల బుకింగ్స్‌తో పోలిస్తే ఇది 33 శాతం అధికం. జాబితాలో శోభా, బ్రిగేడ్, పుర్వంకారా, ఒబెరాయ్ రియలీ్ట, మహీంద్రా లైఫ్‌స్పేస్, కోల్టేపాటిల్, సన్‌టెక్, కీస్టోన్ రియల్టర్స్ తదితరాలు చేరాయి. పటిష్ట బ్రాండ్ గుర్తింపు, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల సులభ సమీకరణ కారణంగా లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఆకర్షణీయ పనితీరు చూపగలుగుతున్నట్లు హౌసింగ్.కామ్, ప్రాప్‌టైగర్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికితోడు ఆధునిక టెక్నాలజీలతో మార్కెటింగ్, అమ్మకాలు చేపట్టడం, మెరుగైన కస్టమర్ సరీ్వసులు తదితరాల ద్వారా మార్కెట్ వాటాను కైవసం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి నాన్‌లిస్టెడ్ లేదా చిన్న కంపెనీలకంటే పైచేయి సాధించగలుగుతున్నట్లు వివరించారు. -
నకిలీ విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ కఠిన చర్యలు
హైదరాబాద్: ప్రెస్టీజీ బ్రాండు పేరుతో నకిలీ ఉపకరణాలు అమ్ముతున్న విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ చట్టపరమైన చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్‌ను దురి్వనియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న కొందరు విక్రేతలపై ఫిర్యాదు దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో శివసాయి కేంద్రం, తెలంగాణలో బెథల్ ఇండస్ట్రీస్‌పై ఫిర్యాదు చేసింది. ఈ రెండు కేసుల్లోనూ తక్షణం స్పందించిన పోలీసులు నకిలీ వస్తువులను స్వా«దీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ‘టీటీకే బ్రాండ్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీలపై ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి’ అని సంస్థ ఒక ప్రకటనలో కోరింది. -
50% రిజర్వేషన్లతో 4వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది
-
టీటీకే ప్రెస్టీజ్ సూపర్ సేవర్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ కిచెన్ ఉపకరణాల బ్రాండ్ టీటీకే ప్రెస్టీజ్ ‘సూపర్ సేవర్ ఆఫర్ 2022–2023’ ను పరిచయం చేసింది. స్టవ్‌లు, బర్నర్లు, కుక్‌టాప్, గ్రైండర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ వంటి గది ఉపకరణాలు, వంట సామగ్రిలను నమ్మశక్యం కాని గొప్ప తగ్గింపుతో అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఏడాది, సంక్రాంతి సంబరాలను మరింత రెట్టింపు చేసుకునేందుకు అద్భుతమైన డీల్స్, భారీ తగ్గింపు, ఉచిత బహుమతులెన్నో ప్రకటించింది. వంటను సులభంగా, తర్వితగతిన చేసే విన్నూత ఉత్పత్తులను అందించే లక్ష్యంగా ప్రతి ఏడాదిలాగే ఈసారి సూపర్ సేవర్ ఆఫర్లు ప్రకటించామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ గార్గ్ తెలిపారు. -
టీటీకే ప్రెస్టీజ్ చేతికి అల్ట్రాఫ్రెష్, ఇక ఆ సేవలు కూడా
న్యూఢిల్లీ: అల్ట్రాఫ్రెష్ మాడ్యులర్ సొల్యూషన్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు కిచెన్ అప్లయెన్సెస్ దిగ్గజం టీటీకే ప్రెస్టీజ్ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం 40 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు వీలుగా రూ. 20 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. తదుపరి మరో రూ. 10 కోట్లు వెచ్చించడం ద్వారా 51 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు టీటీకే ప్రెస్టీజ్ ఎండీ చంద్రు కల్రో తెలియజేశారు. దీంతో వేగవంత వృద్ధిలో ఉన్న మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ విభాగంలో ప్రవేశించేందుకు కంపెనీకి వీలు చిక్కనుంది. మొత్తం కిచెన్ సొల్యూషన్స్ అందించే కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా తాజా కొనుగోలుని చేపట్టినట్లు కంపెనీ చైర్మన్ టీటీ జగన్నాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాడ్యులర్ కిచెన్ మార్కెట్ విలువ రూ. 9,500 కోట్లుగా ఉన్నట్లు తెలియజేశారు. దీనిలో 25 శాతమే బ్రాండెడ్ విభాగం ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. మాడ్యులర్ కిచెన్‌లోకి అల్ట్రాఫ్రెష్ కొనుగోలు ద్వారా మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ విభాగంలో అడుగు పెట్టనున్నట్లు చంద్రు తెలియజేశారు. కంపెనీ బిజినెస్‌కు ఇది అదనపు ప్రయోజనాలను కల్పిస్తుందని చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరానికల్లా రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్షిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో రూ. 1,000 కోట్లు ఇతర కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా ఆశిస్తున్నట్లు తెలియజేశారు. తాజా కొనుగోలు దీనిలో భాగమేనని వివరించారు. ప్రస్తుత నాయకత్వంలోనే స్వతంత్ర కంపెనీగా అల్ట్రాఫ్రెష్ మాడ్యులర్ కొనసాగనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ప్రెస్టీజ్ బ్రాండును వినియోగించుకుంటుందని తెలియజేశారు. రానున్న ఐదేళ్లలో రూ. 23,000 కోట్ల టర్నోవర్‌ను సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం అల్ట్రాఫ్రెష్ 120 స్టూడియోలతో దేశవ్యాప్తంగా 5,000 కిచెన్లను తయారు చేసినట్లు తెలియజేశారు. -
కొనుగోళ్లపై టాటా కన్జూమర్ కన్ను
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై కన్నేసింది. విభిన్న కేటగిరీలలో సరైన అవకాశాలను అందిపుచ్చుకునే యోచనలో ఉన్నట్లు కంపెనీ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వివిధ విభాగాలలో అనువైన కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా వృద్ధికి ఊతమివ్వాలని చూస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ వార్షిక సమావేశంలో భాగంగా వాటాదారుల ప్రశ్నలకు స్పందిస్తూ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడం, పంపిణీని విస్తరించడం, నూతన ఆవిష్కరణలు, కొత్త విభాగాలలోకి ప్రవేశించడం వంటి పలు ప్రణాళికలను వెల్లడించారు. భవిష్యత్ వృద్ధికి మద్దతుగా ఇతర కంపెనీల కొనుగోళ్లతోపాటు.. సొంత కార్యకలాపాల విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 361 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. వెలుపలి అవకాశాల ద్వారా విస్తరించడం కంపెనీ కీలక వ్యూహాలలో భాగమని ప్రస్తావించారు. గతేడాది కొనుగోళ్లు గతేడాది గ్రూప్ సంస్థ టాటా స్మార్ట్‌ఫుడ్(టీఎస్‌ఎఫ్‌ఎల్)ను రూ. 395 కోట్లకు టాటా కన్జూమర్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలతో ఆరోగ్యకర అల్పాహారం, స్నాక్స్ తయారు చేసే కొట్టారం ఆగ్రో ఫుడ్స్‌ను టాటా కన్జూమర్ చేజిక్కించుకుంది. కాగా.. ఇటీవల భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, సరఫరా సవాళ్లు, చమురుసహా పలు కమోడిటీల ధరలతో ద్రవ్యోల్బణం అదుపు తప్పినట్లు చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇలాంటి అనిశ్చితుల్లో తాము పటిష్ట కార్యాచరణ చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ కాలంలో పుట్టుకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గతేడాది నౌరిష్కో, టాటా సంపన్న్, టాటా సోల్‌ఫుల్, టాటా క్యూ బ్రాండ్లు 52 శాతం పురోభివృద్ధిని సాధించినట్లు వెల్లడించారు. టాటా స్టార్‌బక్స్ భాగస్వామ్య సంస్థ కరోనా మహమ్మారి సవాళ్లలోనూ 50 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. దీంతో 26 పట్టణాలలో 268కు స్టోర్స్ సంఖ్య చేరినట్లు వెల్లడించారు. టాటా కన్జూమర్ షేరు నామమాత్ర లాభంతో రూ. 730 వద్ద ముగిసింది. -
పోలీసు శాఖ పరువు తీయొద్దు
– ఆరోపణలు ఎక్కువయ్యాయి - విచారణలో బయట పడితే వీఆర్‌కు – నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ హెచ్చరిక కర్నూలు : పోలీసు శాఖలో అవినీతి పెరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సంపాదన లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి... పోలీసు శాఖ పరువు తీయొద్దు... పోలీస్స్టేషన్లకు ఆకస్మికంగా తనిఖీకి వస్తాను.. విచారణలో అవినీతి ఆరోపణలు బయటపడితే వేటు తప్పదని ఎస్పీ ఆకె రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సబ్ డివిజన్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రవర్తన మార్చుకోకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా వచ్చే ఏడాది పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలని సూచించారు. శాంతి భద్రతల దృష్ట్యా నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణమవుతున్న రౌడీయిజం, ఫ్యాక్షనిజం, ట్రబుల్ మాంగర్స్‌పై ఉక్కుపాదం మోపాలన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా వ్యవహరించాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ ఉద్ధృతం చేయడం ద్వారా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐలు, సీఐలు దత్తత తీసుకున్న 78 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. గస్తీలు నిర్వహించేందుకు ఈ–బీట్ విధానం విధిగా అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా పుష్కరాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి జనవరి మొదటి వారంలో ప్రశంసాపత్రాలు అందజేయాలన్నారు. పెద్దకడుబూరులో జరిగిన చిట్టెమ్మ హత్యకేసుకు సంబంధించి నేర దర్యాప్తులో రాష్ట్రస్థాయిలోనే రెండో స్థానం కర్నూలు జిల్లాకు వచ్చినందుకు సంబంధిత అధికారులను సన్మానించారు. ఎలాంటి ఆధారాలు లేని చిట్టెమ్మ కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసేందుకు కృషి చేసిన ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, కోసిగి సీఐ కంబగిరి రాముడు, ఎస్ఐ ఇంతియాజ్, వారికి సహకరించిన ఫింగర్‌ప్రింట్స్ సిబ్బంది, వీఆర్వో తలారి తదితరులను ఎస్పీ అభినందించి సన్మానించారు. ఫింగర్ ప్రింట్స్ సీఐ, ఏఎస్ఐలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. హోంమంత్రి, డీజీపీ నుంచి నేర పరిశోధన అవార్డు జిల్లాకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబు ప్రసాద్, ఎ.జి.కృష్ణమూర్తి, వెంకటాద్రి, ఈశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డి, కొల్లి శ్రీనివాసులు, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, సుప్రజ, రామచంద్ర, హుసేన్పీరాతో పాటు సీఐలు పాల్గొన్నారు. -
అమరావతి ప్రతిష్టను రెట్టింపు చేయాలి
ఆటోడ్రైవర్లతో డీటీసీ ఎం.పురేంద్ర విజయవాడ (మొగల్రాజపురం) : రాజధాని అమరావతి ప్రతిష్ట రెట్టింపు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎం.పురేంద్ర ఆటో డ్రైవర్లను కోరారు. చుట్టుగుంటలోని రాంకోర్ కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్, వాలంటరీ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ యూనిట్ (వీడు) ఆధ్వర్యంలో ‘ఐ యామ్ ఎ సేఫ్ డ్రైవర్’ పేరుతో ఎంపికచేసిన ఆటోడ్రైవర్లకు డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన పురేంద్ర మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చినవారు మొట్టమొదట సంప్రదించేది ఆటో డ్రైవర్లనేనన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించేలా ప్రవర్తించాలని కోరారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 250 మంది ఆటోడ్రైవర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ‘సేవ్ డ్రైవర్’ అనే సర్టిఫికెట్తో పాటు యూనిఫాం, ఒక సంవత్సరానికి లక్ష రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అందజేస్తామని వివరించారు. ప్రమాదరహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంకోర్ మేనేజింగ్ డెరైక్టర్ కేవీఎస్ ప్రకాశరావు, ‘వీడు’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.వాసు పాల్గొన్నారు. -
మెట్రోలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి..!
హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ సంస్థలకు లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మెట్రో ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ సంస్థలకు తాజాగా లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఏడాది మార్చి 21న ప్రారంభంకానున్న నాగోల్-మెట్టుగూడ మార్గంతోపాటు మరో మూడు రూట్లలో మెట్రో పనులు జరుగుతున్న విషయం విదితమే. సాధారణ ఉద్యోగాలైన టికెట్ విక్రయదారులు, సూపర్వైజర్స్, అనౌన్స్మెంట్, కార్యాలయాలు, స్టేషన్ల నిర్వహణ వంటి సాధారణ ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. మెట్రో ప్రాజెక్టు పూర్తై ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీటితో పాటు 65 కారిడార్లలలో ఉండే మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసే దుకాణ సముదాయాలు, మెట్రో డిపోలు, పార్కింగ్, సర్క్యులేషన్ ఏరియాలు, మెట్రో మాల్స్‌లలో మరో 50 నుంచి 75 వేల మందికి అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ తమకు లేఖ రాసిన విషయాన్ని ఇటు హెచ్ఎంఆర్, అటు ఎల్అండ్టీ సంస్థల ఉన్నతాధికారులు ధ్రువీకరించ లేదు. -
లయ తప్పుతోంది!
మసకబారుతున్న జీవీఆర్ సంగీత కళాశాల ప్రతిష్ట పాఠాలపై శ్రద్ధ పెట్టని అధ్యాపకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కార్యక్రమాలు విజయవాడ కల్చరల్ : రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రతిష్ట మసకబారుతోంది. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, సంగీత విద్వాంసులు కేవీ రెడ్డి, అన్నవరపు రామస్వామి వంటి మహానుభావుల ప్రోత్సాహంతో ఉన్నతమైన ఆశయంతో ఏర్పడిన ఈ కళాశాల నేడు కొందరి ఇష్టానుసారంగా నడుస్తోంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి వంటి దిగ్గజాలు ప్రిన్సిపాళ్లుగా పనిచేసి తమకు వచ్చిన విద్యనంతా విద్యార్థులకు నేర్పించాలని పరితపించారు. ప్రస్తుతం కొందరు అధ్యాపకులు ఇంటి వద్ద ప్రయివేటుగా పాఠాలు బోధిస్తూ కళాశాలలో తరగతులపై పెద్దగా శ్రద్ధచూపడం లేదు. ప్రయివేటుగా పాఠాలు.. సంగీత కళాశాలలో రోజూ రెండు షిఫ్ట్‌లు ఉంటాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులతోపాటు ఆసక్తిగల గృహిణులు తమకు అనుకూలమైన షిఫ్టులో సంగీతం, నాట్యం, వీణ, గాత్రం, మృదంగం తదితర అంశాలు నేర్చుకుంటున్నారు. సంగీతం, వీణ, నాట్యానికి సంబంధించిన కొందరు అధ్యాపకులు ఇంటి వద్ద ప్రయివేటుగా పాఠాలుబోధిస్తూ కళాశాలలోని తరగతి గదుల్లో పాఠాలు సరిగా బోధించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సంగీత కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత కళాశాల సంయుక్తంగా నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా హాజరుకావడం లేదు. దీంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించే కార్యక్రమాలు సైతం వెలవెలబోతున్నాయి. భాషా సాంస్కృతికశాఖ పేరుతో అద్దె ఎగవేసే యత్నం కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించే వారి నుంచి నామినల్ ఫీజులు వసూలు చేస్తారు. ఈ ఫీజులు చెల్లించకుండా ఉండేందుకు సంగీత, నాట్య కార్యక్రమాలు నిర్వహించే కొంతమంది ‘భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సహకారం..’ పేరుతో బోర్డులు పెట్టి కళాశాలకు అద్దెను చెల్లించడం లేదు. గత దసరా మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు ఇదే చిట్కాను ఉపయోగించారు. సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పరిసర ప్రాంతాల కార్పొరేటర్లు వివిధ కారణాల చూపుతూ నిర్వాహకులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. కళాశాల ఆశయాలకు విరుద్ధంగా కార్యక్రమాలు సంగీత కళాశాలలో లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదు. కానీ, ప్రతి నెలా సినీ సంగీత విభావరి నిర్వహించే కొంతమంది లౌడ్ స్పీకర్లను వాడుతున్నారు. ఇటీవల కళాశాలలో జరిగిన సినీ సంగీత విభావరి సందర్భంగా స్థానికులు గొడవకు దిగారు. కేవలం సంగీతం, నాట్యం, జానపద కళా రూపాలు మాత్రమే ప్రదర్శించాలన్న నియమం ఉన్నా... కొంతకాలంగా బ్రేక్ డాన్స్‌లు ప్రదర్శిస్తూ సంగీత కళాశాల స్ఫూర్తికి కొందరు పెద్దలు గండికొడుతున్నారు. శాశ్వత అధ్యాపకుల కొరత : కళాశాలలకు అధ్యాపకుల కొరత ఉంది. కాంట్రాక్టు అధ్యాపకులతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి నామమాత్రపు వేతనంతో ప్రభుత్వం సరిపెడుతోంది. ప్రభుత్వం శాశ్వత అధ్యాపకులను నియమించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కళాశాలలో గతంలో తరగతులు నిర్వహించిన ఓ గదిలో ఏసీ ఏర్పాటుచేశారు. కళాశాల నిధులతోనే అన్ని సదుపాయాలు సమకూర్చారు. భాషా సాంస్కృతిక శాఖాధికారులకు విడిదిగా ఈ గదిని ఉపయోగించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అదే ఖర్చుతో కళాశాల పరిసరాలను శుభ్రం చేస్తే బాగుండేదని విద్యార్థులు చెబుతున్నారు. -
ప్రతిష్టాత్మకంగా జలరవాణా పనులు
ప్రతిష్టాత్మకంగా జలరవాణా పనులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో చేపట్టే అంతర్గత జలరవాణా పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సకాలంలో పూర్తిచేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. జాతీయ జలరవాణా సంస్థ చేపట్టే కాల్వల ఆధునీకరణ పనులు వేగంగా జరిగేందుకు ఎంపీలు, అధికారులు సహకరించాలని కోరారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు చేపట్టే జలరవాణా పనులపై కేంద్ర అంతర్గత జలరవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాకినాడ-పుదుచ్చేరి మధ్య బకింగ్‌హాం కాలువ ద్వారా జలరవాణాను అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయమంత్రి పొన్ను రాధాకృష్ణ మాట్లాడుతూ గడువులోగా ఈ జలమార్గం పనులను పూర్తి చేస్తామన్నారు. తోటలు తగులబెట్టిన వారిని ఉరితీయాలి: కొత్త రాజధాని ప్రాంతంలో తోటలను తగులబెట్టడం దారుణమని, అలాంటి వారిని ఉరి తీయాలని కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యానించారు.ఆదివారం నగరంలో హడ్కో ప్రాం తీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. విభజన హామీల గురించి కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తనను రాజీనామా చేయమంటున్నారని మండిపడ్డారు. అలాంటి చిల్లర వ్యక్తుల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. -
అమెరికాలో అమ్మ ఆలయం
విజయవాడ : కనకదుర్గమ్మ దేవాలయ ప్రతిష్టను అంతర్జాతీయస్థాయికి పెంచేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికి ప్రవాస భారతీయుల నుంచి పూర్తి సహకారం అందుతోందని తెలిసింది. ఇటీవల నగరానికి వచ్చిన తానా ప్రతినిధులు దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావును కలిశారు. ఇప్పటికే అమెరికాలో వెంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాలు ఉన్నాయని, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మ ఆలయాన్ని నిర్మించాలని కోరారు. దీనిపై ఈవో స్పందిస్తూ దేవస్థానానికి అంతర్జాతీయస్థాయిలో ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వ అనుమతి తీసుకుని అమెరికాలో అమ్మవారి దేవాలయం నిర్మించడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. తాము కూడా ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తామని, ఇందుకు కావాల్సిన స్థలాన్ని ఇప్పిస్తామని, ఇక్కడి దేవాలయం నమూనాలోనే అక్కడా అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలని తానా ప్రతినిధులు కోరినట్లు తెలిసింది. -
ప్రతిష్టాత్మకంగా జన్మభూమి
జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దీని నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా బుధవారం అన్ని మండలకేంద్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక అధికారుల సమీక్షించారు. విశాఖ రూరల్ : జన్మభూమి కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రారంభించడానికి జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో గురువారం ఉదయం 6.30కు ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు భారీ ర్యాలీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధికారులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. శుక్రవారం దసరా సెలవు కావడంతో మళ్లీ గ్రామాల్లో 4వ తేదీ నుంచి జన్మభూమిని చేపడతారు. ఇందుకోసంప్రతీ మండలానికి రెండు బందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బందం రోజుకు ఒక పంచాయతీలో గ్రామ సభ నిర్వహిస్తుంది. స్థానిక సమస్యలతో పాటు పొలంబడి, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. ఇటీవల రద్దు చేసిన పెన్షన్లపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిశీలిస్తారు. రేషన్‌కార్డు, పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే అన్ని గ్రామాల్లో ఈ బందాలు పర్యటించే పరిస్థితి కనిపించడం లేదు. ఒక ప్రాంతంలో సమావేశం నిర్వహించి ప్రజలను అక్కడికి తరలించాలని ప్రజాప్రతినిధులు ఆలోచన చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళితే హామీలపై ప్రజలు నిలదీస్తారన్న భయం సర్వత్రా నెలకొంది. దీంతో అన్ని గ్రామాల్లో సమావేశాలు జరిగే అవకాశం లేదు. -
దోపిడీ కేసు దర్యాప్తులో పురోగతి
రాయనపాడు ఘటనలో నిందితుల ఫొటోలు గుర్తించిన బాధితులు మరో దోపిడీకి పాల్పడే అవకాశం పొరుగు జిల్లాల్లో అప్రమత్తం విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్‌లో సంచలనం కలిగించిన రాయనపాడులో దోపిడీ ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులుగా భావిస్తున్న వారి ఫొటోలను బాధిత కుటుంబం గుర్తించడంతో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పం పారు. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని రాయనపాడు గ్రామానికి చెందిన కొలిపర్తి సురేష్‌బాబు ఇంట్లో దొంగలు పడి పెద్ద మొత్తంలో నగలు, నగదును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తును కమిషనరేట్ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నేరం జరిగిన విధానాన్ని బట్టి దుండగులు మహారాష్ట్ర ముఠాలుగా గుర్తించారు. రైల్వేట్రాక్‌ల సమీపంలో ఆవాసం మహారాష్ట్ర ముఠాలు రైల్వే ట్రాక్‌లకు సమీపంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని దోపిడీలు చేస్తుంటాయి. వీరిలో కంజరబట్, పార్థీ, ముంగా జాతి ముఠాలు ఉన్నాయి. రైల్వే ట్రాక్‌లకు చేరువలో గుడారాలు వేసుకొని నివాసం ఉంటూ దోపిడీలకు పాల్పడటం వీరి నైజమని పోలీసు అధికారులు చెబుతున్నారు. పగటి వేళల్లో ప్లాస్టిక్ సామాన్లు, పూసలు, కుంకుమ విక్రయించే నెపంతో పరిసర ప్రాంతాల్లో మహిళలు తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు. గోచీకట్టు చీరకట్టుతో మహిళలు తిరుగుతుం టారని పోలీసులు పేర్కొంటున్నారు. రాత్రివేళల్లో మగవాళ్లు సామూహికంగా వెళ్లి దోపిడీలు చేస్తుంటారని చెబుతున్నారు. నేరం చేసే సమయంలో ప్రతిఘటన ఎదురైతే హత్యలు చేసేందుకు సైతం వీరు వెనుకాడరు. దోపిడీ చేసిన వెంటనే అక్కడి గుడారాలు ఎత్తేసి మరో చోటికి మకాం మార్చుతారు. మహారాష్ట్రకు చెందిన మూడు ముఠాలు నేరాలకు పాల్పడే తీరు ఒకే విధంగా ఉంటుంది. పార్థీ ముఠాగా నిర్థారణ రాయనపాడులో దోపిడీ ఘటనలో పార్థీ ముఠా పాల్గొందని పోలీసులు ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. మిగిలిన ముఠాల సభ్యులు మహారాష్ట్రలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో పార్థీ ముఠాలకు చెందిన సభ్యులు మాత్రమే స్వస్థలాలు వదిలేసి బయ ట తిరుగుతున్నట్టు పోలీసు అధికారులకు సమాచారం ఉంది. ఈ ముఠా సభ్యులను 2010లో హైదరాబాదు పోలీసులు అరెస్టు చేయగా, 2011లో బెయిల్‌పై బయటకు వచ్చి పరారీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచరిస్తున్న పార్థీ ముఠాల సభ్యులు.. రాయనపాడులో దోపిడీ ఘటనకు పాల్పడినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. శ్రీకాకుళం వరకు నిఘా వివిధ ప్రాంతాల్లో గత కొద్ది రోజు లుగా జరిగిన దోపిడీ ఘటనలను పోలీ సులు గుర్తించి, దొంగలను పట్టుకునేందుకు శ్రీకాకుళం జిల్లా వరకు నిఘా ముమ్మరం చేశారు. ఇందుకోసం ఎంపిక చేసిన ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసులను అప్రమత్తం చేశా రు. గత కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా బీబీ గూడెం, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, వ రంగల్ జిల్లా రఘునాధపల్లిలో దోపిడీలు జరిగాయి. ఆ తర్వాత ఈ ముఠా రాయనపా డు వచ్చి దోపిడీకి పాల్పడి ఉంటుందని భా విస్తున్నారు. శ్రీకాకుళం వైపు వెళ్లే క్రమంలో వీరు మరికొన్ని దోపిడీలు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా వీరు మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉందని, ఆ మార్గంలో నిఘా ఉంచామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వీరు మరో దోపిడీ చేయకుండా నిలువరించడంతో పాటు పట్టివేత లక్ష్యంగా ప్రత్యేక బృందాలు పని చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. -
ఆర్థిక సంఘం సమావేశానికి విస్తృత ఏర్పాట్లు
తిరుపతి/చిత్తూరు సెంట్రల్/రేణిగుంట: తిరుపతిలో శుక్రవారం నిర్వహించనున్న 14వ ఆర్థిక సంఘ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి సారిగా తిరుపతిలో జరుగుతున్న ఈ సమావేశాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా భావించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి స్వాగతోపన్యాసంతో సమావేశం ప్రారంభమవుతుంది. 10.35 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం 11 గంటల నుంచి రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆధ్వర్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. తిరుపతిలో శుక్రవారం జరగనున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయలుదేరి వస్తారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని 9.30 గంటలకు అక్కడినుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్ రిడ్జ్ హోటల్‌కు చేరుకుంటారు. 10.00 నుంచి 10.30 గంటల వరకు ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాంకేతిక అంశాలపై జరగనున్న కార్యక్రమంలో ఆర్థిక సంఘం సభ్యులతో పాటు పాల్గొంటారు. ఆర్థిక సంఘానికి స్వాగతం డాక్టర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన 14 వ ఆర్థిక సంఘం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి, ఆర్డీవో రంగయ్య, ఇతర శాఖల అధికారులు స్వాగతం పలికారు. వైవీరెడ్డితో పాటు 12 మంది సభ్యులు విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనాల్లో తిరుపతికి వెళ్లారు. కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం ఆర్థిక సంఘ సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు తిరుపతికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిలో పనిగా టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆర్థిక సంఘ సమావేశంలో ప్రసంగించిన అనంతరం ఒంటి గంటకు సమీపంలోనే ఉన్న ఎస్ఎస్బి కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రుణమాఫీ కోసం పక్కా సమాచారం ఇవ్వండి
చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రుణమాఫీ కోసం వందశాతం తప్పులులేని సమాచారమివ్వాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి ఆయన మండల స్థాయి అధికారులతో రుణమాఫీ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారులు ఈ పథకానికి త్రిమూర్తులాంటివారని, ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ వ్యవస్థ కలిగిన బ్యాంకులన్నీ శనివారం లోపు వివరాలను 31 కాలమ్స్‌లో పూర్తిచేసి పంపాలన్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ల వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. ప్రొఫార్మా,ఆధార్, రేషన్‌కార్డుల నంబర్లు వారికి అందనట్లయితే వెంటనే ఎల్డీఎంను, డీఎస్వోను సంప్రదించాలన్నారు. వ్యవసాయ పంట రుణాలు, బంగారుపై వ్యవసాయ రుణాలు పొందిన వారిలో కుటుంబం యూనిట్‌గా రూ.1.5లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు జీవోలోని అంశాలను ఎలా అమలు చేస్తారన్న విషయాలను గ్రామకార్యదర్శులు, వీఆర్వోలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. జిల్లాలో 4లక్షల మంది రైతులున్నట్లు అంచనా అని, రుణమాఫీలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలన్నారు. ప్రజలు అడిగినప్పుడు రుణమాఫీపై అధికారులు సమాచారాన్ని వివరించాలన్నారు. దళారులు ఇందులో ప్రవేశించకుండా రైతులను మోసగించకుండా పథకంపై స్పష్టమైన అవగాహన పెంపొందించాలన్నారు. తెలుగులో ముద్రించిన రుణమాఫీ జీవో ప్రతులను కరపత్రాల రూపంలో అన్ని గ్రామాల్లో పంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఇన్చార్జ్ జేడీఏ నిర్మల్ నిత్యానంద్, ఎన్ఐసీ అధికారి అనిల్, డివిజన్లోని ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
అంచనా వ్యయం రూ. 3,212 కోట్లు
మన జిల్లా - మన ప్రణాళిక ఖరారు తొలుత రూ.81.13 కోట్లతో పనుల ప్రతిపాదనలు ఇతర జిల్లాలను అనుసరిస్తూ తుది జాబితా తయూరు భారీగా పెరిగిన అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేత సాక్షి, హన్మకొండ : జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ పాలకమండలి, అధికారులు తుది ప్రతిపాదనలు రూపొందించారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత అంశాలుగా 50 పనులను ఎంపిక చేశారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.3,212 కోట్ల వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు మన జిల్లా- మన ప్రణాళిక తుది జాబితాను జిల్లా అధికారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. బడ్జెట్ రూపకల్పనలో ఈ జాబితాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిధులు కేటాయించనుంది. రూ.81.13 కోట్ల నుంచి రూ.3,212 కోట్లు... ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా-మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జూలై 27న తొలి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని 50 మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యులు అందరూ కలిపి 1,557 పనులను సూచించారు. అయితే... రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక్క పనిని మాత్రమే మన జిల్లా-మన ప్రణాళికలో చేర్చాలని సూచించింది. దీంతో తొలి విడతలో రూ.81.13 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి మండలం నుంచి ఒక పని వంతున 50 పనులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిన జిల్లాలు సమర్పించిన జాబితాలో ఒకే రకమైన పనులన్నింటీని ఒకదానిగానే పరిగణించారు. ఉదాహరణకు ఆరోగ్య విభాగానికి సంబంధించి అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఒకే పనిగా పేర్కొంటూ మన జిల్లా-మన ప్రణాళిక జాబితాను సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రణాళికలు రూ. 2,500 కోట్లను దాటాయి. దీంతో వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, జిల్లాపరిషత్ అధికారులు రూ.81.13 కోట్లతో తొలుత సమర్పించిన ప్రణాళికను రద్దు చేశారు. ఒకే విధమైన పనులను ఒకేదానిగా పేర్కొంటూ రూ 3,212 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్రణాళికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వానికి సమర్పించిన జాబితా ప్రకారం... ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల అభివృద్ధితోపాటు కొత్త రోడ్ల నిర్మాణానికి జిల్లా ప్రణాళికలో ప్రాధాన్యం లభించింది. జిల్లాలోని 50 మండలాల్లో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పాత బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.384 కోట్లు... 47 మండలాల్లో కొత్త బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.78.68 కోట్లు అవసరమవుతాయని ప్రణాళికలో పేర్కొన్నారు. వీటితోపాటు కేసముద్రం, ఖానాపూర్ మండలాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.80 కోట్లు.. మద్దూరు, మహబూబాబాద్, మరిపెడకు రూ.79.76 కోట్లు... నర్మెట, నర్సంపేటకు రూ.62.22 కోట్లు... నెక్కొండకు రూ.66.06 కోట్లు... నెల్లికుదురు, పాలకుర్తి, పరకాలకు రూ.94.57 కోట్లు... రాయపర్తి, రేగొండ, సంగెం మండలాల్లో రూ.51.61 కోట్లతో వివిధ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో తాగునీటి పనులకు రూ.709 కోట్లు అవసరమవుతాయని ప్రణాళికలో పొందుపరిచారు. జిల్లాలో 25 మండలాల పరిధిలోని చెరువులు, తూముల మరమ్మతులకు రూ.99.35 కోట్లు, మరో 25 మండలాల్లో చెరువుల అభివృద్ధికి రూ.97 కోట్లు కేటాయించారు. జిల్లాలోని ప్రతి మండలంలో భూసార పరీక్ష కేంద్రాలను నెలకొల్పేందుకు రూ.320 కోట్లు... పది మండలాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయూల కోసం రూ.410 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. 32 మండలాల్లో గ్రామపంచాయతీల భవనాల నిర్మాణానికి రూ 99 కోట్లు... 50 మండలాల్లో డివిజన్ పంచాయతీ ఆఫీస్ భవనాలకు రూ 23.30 కోట్లు... 18 మండలాల్లో మండల సమాఖ్య భవనాలు, మార్కెటింగ్ గోదాంలకు రూ 44.81 కోట్లు అవసరమని జిల్లా ప్రణాళికలో ప్రతిపాదించారు. వైద్యరంగంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.173.39 కోట్లు... విద్యారంగానికి రూ.69.32 కోట్లు... రీజనల్ సైన్స్ సెంటర్ అభివృద్ధికి రూ 5.50 కోట్లు... జిల్లాలో పర్యాటక ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు రూ.38.25 కోట్లు జిల్లా ప్రణాళికలో పేర్కొన్నారు. వీటితోపాటు ఒక్కో చోట రూ.25 కోట్ల వ్యయంతో స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్, ములుగు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బస్‌డిపోలు నిర్మించాలని పేర్కొన్నారు. క్రీడలకు సంబంధించి 50 మండలాల్లో యూత్ వెల్ఫేర్ హాస్టళ్లను నెలకొల్పేందుకు రూ.149 కోట్లు కావాలని మన జిల్లా-మన ప్రణాళికలో పేర్కొన్నారు. -
రామ..రామ ఏం కష్టాలో..!!
గిరి మహిళలకు కు.ని అవస్థలు ఆరుబయటే ఆశ్రయం వెళ్లేందుకు అంబులెన్సూ లేదు పెదబయలు, న్యూస్‌లైన్: మన్యంలో బతకడమంటే మాటలు కాదు..అడుగడుక్కీ అవస్థలు పలకరిస్తుంటాయి... గిరిజనులం టే సర్కారుకు చిన్నచూపో అధికారులకు నిర్లక్ష్యమో తెలియదుగానీ వారి విషయంలో ఏ సాయం చేయాలన్నా పాలకులకు చేతులు రావడంలేదు. చివరకు సర్కారు ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలోనూ ఇదే జరిగింది. వచ్చిన గిరిజన మహిళలకు ఎడాపెడా ఆపరేషన్లు చేసేసి వారిమానాన వారిని వదిలేశారు. దీంతోవారు తమ మీద తామే జాలిపడుతూ కాలం వెళ్లబుచ్చారు. పెద బయలు, రూడకోట పీహెచ్సీ పరిధిలో గురువారం 52 మం దికి డీపిఎల్ ఆపరేషన్లు చేశారు. ఆ తరువాత వెం టనే వారిని ఆస్పత్రి లోపల వరండాలో కాకుండా ఆరుబయట పడుకోబెట్టారు. దీంతో వారు చీకట్లో ఆవస్థలు పడ్డారు. కుటుంబ నియంత్రణ ఆపరేష న్లు చేయాలంటే ఆస్పత్రిలో ముందస్తుగా జనరేటర్ ఏర్పాటు చేయాలి. ఆపరేషన్లు చేయించుకున్నవారిని బెడ్స్‌పై పడుకోబెట్టాలి, వేడినీరు, మంచినీరు అందుబాటులో ఉంచాలి. అలాగే నడిచి వెళ్లడం కష్టమవుతుంది కాబట్టి సర్కారీ అంబులెన్సులో వారి వారి ఇళ్లకు తీసుకెళ్లాలి. అయితే పెదబయలు పీహెచ్సీలో గురువారం ఈ సదుపాయాలు ఏమీ లేకుండానే ఆపరేషన్లు చేశారు. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆపరేషన్లు ప్రారంభించాల్సి ఉన్నా సాయంత్రం 5 గంటలకు ఈ ప్రక్రియ మొదలెట్టారు. దీంతో మహిళలు చీకట్లో ఆరుబయట దోమలతో నానా అవస్థలు పడ్డారు. దీంతో ఈ బాధలు భరించలేక ప్రైవేటు వాహనాలకు అద్దె చెల్లించి గ్రామాలకు చేరుకున్నారు. స్థానిక పీహెచ్సీ అంబులెన్స్ కదలదని తెలిసినా ప్రైవేటు వాహనాలు వాహనాలు సమకూర్చకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రతిసారీ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నా వైద్యాధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం గమనార్హం. అయితే శిబిరానికి పాడేరు ఎస్పీహెవో లీలాప్రసాద్ హాజరవగా మహిళలు తమ అవస్థలను ఏకరువు పెట్టారు. -
రెండో దశ మరిచిన మంత్రివర్యులు
రాష్ట్రంలోనే తొలిసారిగా రాజధాని నగరం హైదరాబాద్ నుంచి రెండు ప్రధాన మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు రానున్నాయి. రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం సమర్పించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నగరానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రాజెక్టులు, నిధులు కేటాయించకపోయినా.. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు రెండు డబుల్ డెక్కర్ రైళ్లను మాత్రం ప్రసాదించారు. ఆకాశయానాన్ని తలపించే అందమైన ఈ డబుల్ డెక్కర్ రైళ్లలో ఒకటి హైదరాబాద్ నుంచి కలియుగ దైవం కొలువుదీరిన తిరుపతి పుణ్యక్షేత్రానికి.. మరొకటి నగరం నుంచి గుంటూరుకు పరుగులు తీయనుంది. ఇవి వారానికి రెండు రోజులే నడుస్తాయి. సాక్షి,సిటీబ్యూరో : ప్రతి ఏటా ఇదే తంతు. ఆశలు రేపి ఆఖరికి నిరాశలు మిగల్చడమే రైల్వే బడ్జెట్ ప్రత్యేకత. సగటు ప్రయాణికుల అవసరాలను పక్కనపెట్టి సాదాసీదాగా ముందుకొచ్చిన ఈ బడ్జెట్‌పై నగరవాసులు పెదవి విరుస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.30 కోట్లు తప్ప ఈసారి ఒక్క పైసా కూడా విదల్చలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరల్డ్‌క్లాస్ ప్రతిపాదన పత్తా లేకుండా పోయింది. ప్రతి రోజు సుమారు 200 రైళ్లకు హాల్టింగ్ సదుపాయాన్ని అందజేస్తోన్న ఈ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఏళ్లనాటి ప్రతిపాదనకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. లాలాగూడ కేంద్రీయ ఆసుపత్రికి సూపర్‌స్పెషాలిటీ హోదా కల్పించే అంశంపైన, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల నిర్మాణాల పైన బడ్జెట్లో ఊసు లేదు. పాతప్రాజెక్టుల సంగతి ఇలా ఉంటే కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా నగరానికి రాలేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే శబరి, షిర్డీ, బెంగళూరు రూట్లకు కొత్తగా రైళ్లను ప్రకటించలేదు. లక్షలాది మంది భక్తులు వెళ్లే శబరికి ప్రస్తుతం ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది. షిర్డీకి కూడా రెండు రైళ్లే ఉన్నాయి. రద్దీ అధికంగా ఉండే బెంగళూరుకు కూడా ఈ బడ్జెట్లో కొత్త రైళ్లను ప్రకటించకపోవడం దారుణం. రైల్వే కార్మికులను సైతం ఈ బడ్జెట్ నిరాశకు గురి చేసింది. గతంలో ఉద్యోగుల కోసం ప్రకటించిన హౌసింగ్ స్కీమ్‌పై ఎలాంటి ప్రస్తావన లేక పోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డబుల్‌డెక్కర్ కథాక మామీషు.. దేశంలోని పలు మార్గాల్లో ఇప్పటికే పరుగులు తీస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లు దక్షిణమధ్య రైల్వేకు ఆలస్యంగానే ప్రకటించారు. గత రెండు మూడేళ్లుగా ఊరిస్తోన్న ఈ రైళ్లకు ఎట్టకేలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మోక్షం లభించింది. ప్రస్తుతం చెన్నై-బెంగళూరు, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-జై పూర్, హౌరా-ధన్‌బాద్, ముంబై- సూరత్, ఇండోర్- హబీబ్‌గంజ్ తదితర మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ వరుసలో తాజాగా కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-గుంటూరు డబుల్ డెక్కర్ రైళ్లు రానున్నాయి. ప్రత్యేకత లివీ... డబుల్ డెక్కర్‌లో బోగీకి 128 మంది పడతారు. ఈ ట్రైన్లో 2700 మంది వరకు ప్రయాణించవచ్చు. సాధారణ ఎక్స్‌ప్రెస్‌లో బోగీకి 78 మంది చొప్పున 1500 మందికే అవకాశం. డబుల్ డెక్కర్ రైళ్లలో బెర్తులుండవు. {పయాణికులు కూర్చునే ప్రయాణించాలి. అందుకే ఇవి పగలే నడుస్తాయి. గంటకు 62-110 కి.మీ. వేగంతో వెళ్తాయి. వీటి ఎత్తు 4.366 మీటర్లు (సాధారణ రైళ్ల ఎత్తు 4.025 మీ.). బోగీలో కింది నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన మెట్లు పూర్తి ఎయిర్ కండీషనింగ్తో కూడిన బోగీ హాయిగా అనిపించే ఎయిర్ స్ప్రింగ్ సీట్లు కుదుపులు లేని సౌకర్యవంతమైన ప్రయాణం స్టెయిన్లెస్ స్టీల్ బోగీలతో మరింత భద్రత తిరుపతి ప్రయాణికులకు ఊరట హైదరాబాద్ నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం తిరుపతికి వెళ్లేందుకు వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, కృష్ణా, సెవెన్‌హిల్స్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఈ రైళ్లు ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. దీంతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో వెయిటింగ్ జాబితా 250 నుంచి 350 వరకు నమోదవుతుంది. ఫలితంగా తిరుపతికి డబుల్ డెక్కర్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. -
వుడాకు శి‘రో’భారం
సాక్షి, విశాఖపట్నం : రో హౌసింగ్ ప్రాజెక్టు విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు భారంగా మారింది. ఐదేళ్ల క్రితం నిర్మించిన రోహౌసింగ్ యూనిట్లు ఇప్పటికీ విక్రయానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టు కోసం చేసిన రూ.18.5 కోట్ల ఖర్చు ప్రశ్నార్థంగా ఉంది. లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు తలపెడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఎదురైంది. వుడా అధికారులు రో హౌసింగ్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డుకు దగ్గరగా రుషికొండ వద్ద యూరోపియన్ నిర్మాణ నమూనాలో 2008లో నిర్మాణం చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా డూప్లెక్స్ పద్ధతిలో 65 యూనిట్లు నిర్మించారు. సుమారు రూ.18.5 కోట్లు ఖర్చు పెట్టారు. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించి అమ్మకానికి పెట్టా రు. కనీస ధరగా కేటగిరీ ఏలో ఉన్న యూనిట్లకు రూ.71 లక్షలు, కేటగిరీ బి యూనిట్లకు రూ.72లక్షలు, కేటగిరీ సీ యూనిట్లకు రూ.77 లక్షలు, కేటగిరీ డీ యూనిట్లకు రూ.82.50 లక్షలు ధర నిర్ణయించారు. యూనిట్లు సుందరంగా కనిపించడంతో కొనుగోలుదారులు పోటీ పడి వస్తారని బహిరంగ వేలం కోసం ఇప్పటికే పలు పర్యాయాలు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రజల నుంచి స్పందన రాలేదు. నగరానికి దూరంగా ఉండడం, అదే ధరకు సిటీలోనే ఫ్లాట్లు దొరకడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపలేదు. దీంతో ఏళ్ల తరబడి రో హౌసింగ్ యూనిట్లు వేలానికి నోచుకోకుండా మిగిలిపోయాయి. జూలై 10 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరగా ఇప్పటివరకు 65 యూనిట్లకు కేవలం 45 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన బహిరంగ వేలంలో పోటీ పడే అవకాశం ఉండదు. దీంతో ఆశించిన ధర రాదు సరికదా కనీస రేటులో కూడా యూనిట్లు అన్నీ విక్రయానికి నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రూ.18.5 కోట్ల పెట్టుబడి వుడాకు భారంగా పరిణమించింది. మరోవైపు నిర్మించిన హౌసింగ్ యూనిట్లు ఏళ్ల తరబడి విక్రయం కాకపోవడంతో నిర్వహణ లేక దయనీయంగా తయారయ్యాయి. నిర్మాణ నాణ్యతపై అనుమానాలు కూడా కమ్ముకుంటున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయం, వుడా లాభాపేక్ష ధర ఫలితంగా రో హౌసింగ్ ప్రాజెక్టు ఆ సంస్థకు గుదిబండగా మారిందన్న విమర్శలున్నాయి. -
నో సౌండ్...
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడింది. బుధవారం పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ 24న నిర్వహిస్తారు. పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష జేడీఎస్‌లకు ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. దరిమిలా ఇరు పార్టీల ముఖ్య నాయకులు తుది క్షణం వరకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. బెంగళూరు గ్రామీణలో కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే. శివకుమార్, జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి, మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థిగా నటి రమ్య, జేడీఎస్ అభ్యర్థిగా సీఎస్. పుట్టరాజులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణ, మంత్రులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కుమారస్వామిలు పార్టీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం సాగించారు. బహిరంగంగానే బీజేపీ మద్దతు ఈ ఉప ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రచారం పట్ల బీజేపీ తొలుత సుముఖత వ్యక్తం చేసినా, చివరి రెండు రోజులు నేరుగా రంగంలోకి దిగింది. జేడీఎస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి ఆర్. అశోక్ ప్రచారం చేయడం విశేషం. అతి సమస్యాత్మక కేంద్రాలు బెంగళూరు గ్రామీణలో 446, మండ్యలో 236 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. బెంగళూరు గ్రామీణలో 9,92,878 మంది పురుష, 9,23,456 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండ్యలో 8,15,363 మంది పురుష, 8,02,226 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బెంగళూరు గ్రామీణ పరిధిలో ఆనేకల్, బెంగళూరు దక్షిణ, రాజరాజేశ్వరి నగర, కుణిగల్, రామనగర, మాగడి, చన్నపట్టణ, కనకపుర అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మండ్య పరిధిలో మళవళ్లి, మద్దూరు, మండ్య, శ్రీరంగపట్టణ, నాగమంగల, మేలుకోటె, కృష్ణరాజ పేటె, కృష్ణరాజ నగర అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. -
యువ వికాసం.. ధర్మపరిరక్షణకు మనగుడి
నవతరానికి ఆలయాలు, సంస్కృతి మూలాలు, సంప్రదాయాలు, వాటి విశిష్టత తెలిసింది అంతంత మాత్రమే. ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల పవిత్రత, ప్రాధాన్యత, ఆవశ్యకతలను తెలియజేస్తూ యువతను గుడిమార్గం పట్టించే బృహత్తర కార్యక్రమంగా ‘మనగుడి’ని రూపకల్పన చేసింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖతో కలసి టీటీడీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తోంది. మూడోవిడతకు సన్నద్ధం: రాష్ట్రంలో చాలా ఆలయాలు ఆదరణకు నోచుకోవటం లేదు. శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన ఆలయాలమనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జాతికి ఆధారంగా నిలిచే గుడిసంస్కృతిని భావితరాలకు అందించే లక్ష్యంగా ‘మనగుడి’ని టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2012వ ఆగస్టు 2న వేంకటేశ్వరస్వామి వారి జన్మనక్షత్రమైన శ్రవణంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించింది. అదే సంవత్సరం నవంబరు 28న కార్తీకమాసంలో రెండోవిడత నిర్వహించి ఆలయాల అభివృద్ధితోపాటు జనంలో భక్తిచైతన్యాన్ని పెంపొందించింది. అదే స్ఫూర్తితో ఈ నెల 21న శ్రావణమాసంలోని శ్రవణా నక్షత్రంలో మూడోవిడతగా ‘మనగుడి’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. 20 వేల ఆలయాల్లో... హిందూ దేవాలయాల వైభవ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేందుకు వైష్ణవ, శైవ భేదం లేకుండా హిందూ ఆలయాల కేంద్రంగా టీటీడీ ఈ ‘మనగుడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని పల్లె స్థాయి నుంచి నగర స్థాయి వరకు మొత్తం 20 వేల ఆలయాలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో పురప్రజలు, భక్తులకు భాగస్వామ్యం కల్పించేందుకు వివిధ రూపాల్లో టీటీడీ భారీగా ప్రచారం కల్పిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఇప్పటికే కుంకుమార్చన, ఆలయాల ప్రాశస్త్యంపై పండితుల చేత ప్రవచనాలు, గోపూజ, సామూహిక వరలక్ష్మీవ్రతాలు చేశారు. ఇక 17న సత్యనారాయణ వ్రతాలు, 18,19 తేదీల్లో గిరిజన తాండాలు, దళితవాడలు, మత్స్యకారుల వీధుల్లో రథయాత్రలు, శోభాయాత్రలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. 20న ఆయా ఆలయాల్లో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తారు. వెంకన్న పాదాల వద్ద కంకణాలకు పూజలు మనగుడిలో పాల్గొనే భక్తులకు ప్రసాదంగా వితరణ చేసేందుకు ప్రత్యేకంగా టీటీడీ సారె ఏర్పాటు చేసింది. ప్రతి ఆలయానికి 250 గ్రాముల పసుపు, 250 గ్రాముల కుంకుమ, 100 గ్రాముల అక్షింతలు, కిలో కలకండ, 1000 కంకణాలు పంపిణీ చేస్తారు. ఈ పూజాసామగ్రిని గర్భాలయంలోని మూలమూర్తి పాదాల వద్ద ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తర్వాత ఈ సారెను రాష్ట్రవ్యాప్తంగా మనగుడి కార్యక్రమం నిర్వహించే ఆలయాలకు తరలిస్తారు. ఇందులోనే హనుమాన్ చాలీసా, సకల దేవతా పూజావిధానం, రామాయణం, వేటూరి ప్రభాకర శాస్త్రి, ఇతర సాహితీ వేత్తల కృతులు, సంకీర్తనలతో కూడిన 10 రకాల పుస్తక ్రపసాదం, శ్రీవారి సంకీర్తనా సీడీలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఆలయాలకు అలంకరించే తెర కూడా అందజేస్తారు. శ్రీవారి జన్మనక్షత్రంలో మనగుడిలా... శ్రావణ పౌర్ణమి 21వ తేది బుధవారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు అభిషేకం, అర్చనలు, ఇతర అనుబంధ పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో సామూహిక పారాయణం నిర్వహిస్తారు. 11 గంటలకు ప్రసాద వితరణ చేస్తారు. సాయకాలం 4 గంటలకు పురాణ ప్రవచనం, 6 గంటలకు హరికథా కార్యక్రమం నిర్వహించి చివరగా మనగుడి ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆయా ఆలయాల వద్ద స్థానిక దాతల సహకారంతో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. - సహదేవ కేతారి, సాక్షి,తిరుమల ఫొటో: కె.మోహన్‌కృష్ణ -
కుటుంబ రాజకీయాలకు తెర లేపిన జగదీష్ శెట్టర్
హుబ్లీ, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ కుటుంబ రాజకీయాలకు తెర తీశారు. అందుకే సోదరుడు ప్రదీప్ శెట్టర్‌ను విధాన పరిషత్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దించారు. దీని వెనుక కుంటుంబ రాజకీయాల విత్తనం నాటే రాజకీయ ఎత్తుగడ ఉందని ఆ పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారు. విధాన పరిషత్ ఉప ఎన్నికలలో అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు మొదటిగా వినిపించిన పేరు మాజీ ఎమ్మెల్యే శంకర్ పాటిల్ మునేనకొప్పది. అయితే పోటీకి ఆయన ససేమిరా అన్నారు. అనంతరం మరో అభ్యర్థి కోసం అన్వేషించారు. కళకప్ప బండి, మహేష్ టెంగినకాయల పేర్లు వినిపించినా వీరిని వద్దనే అభిప్రాయాలు పార్టీలు వ్యక్తమయ్యాయి. చివరిగా ఇదే ఎన్నికలలో గతంలో పోటీ చేసిన ఎంఆర్. పాటిల్, వీరేష్లలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారని అనుకోగా ప్రదీప్ శెట్టర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రదీప్ శెట్టర్ మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు సోదరుడైనందున పోటీలో ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎంఆర్. పాటిల్, అంచటగేరిల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ప్రదీప్ శెట్టర్ పేరును ఖరారు చేశారు. శెట్టర్ తమ్ముడైన ప్రదీప్ అభ్యర్థిగా ఉంటే తగిన ప్రభావం చూపవచ్చని పైకి కనిపించే విషయమైనా లోపల మాత్రం కుటుంబ రాజకీయాలకు పునాదులు వేసే ప్రయత్నమేనన్నారు. ఇవి కార్యకర్తలు అర్థం చేసుకుంటారని శెట్టర్ అండ్ ఫ్యామిలీ అనుకున్నా వాస్తవంగా బీజేపీలోనే వేడివాడిగా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, యడ్యూరప్ప కుటుంబ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తునే జగదీశ్ శెట్టర్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం. ముఖ్యమంత్రిగా అధికార వైభవాలు అనుభవించారు. ప్రస్తుతం తమ్ముడిని రంగంలోకి దింపి ఆయనను రాజకీయంగా పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ క్షేత్రంలో ఎన్నికల ఖర్చు కోట్లాది రూపాయలే ఉంటుంది. అందుకు ఎవరినో అభ్యర్థిగా నిలబెట్టి చేతులు కాల్చుకోవడం కంటే తమ్ముడినే నిలబెడితే బాగుంటుందని భావించినట్లు తెలుస్తోంది. ఈ అంచనాతోనే ప్రదీప్ శెట్టర్ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. దీని వెనుక అసలు ఉద్దేశం అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి అన్నది శెట్టర్ వ్యూహంగా కనిపిస్తోంది. తమ్ముడిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ దక్కించుకునేందుకు సానుకూలంగా ఉంటుందని శెట్టర్ ఎత్తుగడ అని సమాచారం. -
సంబరాల పరేడ్
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: అది చరిత్రకు సాక్ష్యం.. చారిత్రక నేపథ్యానికి సజీవ దృశ్యం.. దేశభక్తిని చాటే వేదిక అది.. అదే సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానం. ఏడెకరాల సువిశాల స్థలంలో ఆవరించి ఉన్న ఈ మైదానానికి ఘనచరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పంద్రాగస్టు వేడుకలకు మైదా నం ముస్తాబవుతోంది. విద్యార్థులు, పోలీసు బలగాల కవాతు రిహాల్స్తో ఇప్పటికే సందడిగా మారింది. తొలుత క్రైస్తవ ప్రార్థనలు.. 17వ శతాబ్దం నుంచి ఈ మైదానాన్ని క్రైస్తవులు ప్రార్థనలకు వినియోగించుకునే వారు. అప్పట్లో దీనిని సెయింట్ జోసెఫ్ క్యాథ్రల్ గ్రౌండ్‌గా పిలిచే వారు. కాలక్రమేణా సైనిక శిక్షణ కేంద్రంగా మారింది. నిజాంల హయాం లో ఇక్కడే సైనికులకు శిక్షణా శిబిరాలను నిర్వహించే వారు. తెల్లదొరలు, నిజాం పాలకులు సైనిక వందనం స్వీకరించడం కోసం ఈ మైదానాన్నే వేదికగా చేసుకునే వారు. స్వాతంత్య్రానంతరం.. దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత 1948లో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు దీనికి పరేడ్ మైదానంగా నామకరణం చేశారు. అప్పటి నుంచే ఇక్కడ గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్నాయి. ఏటా జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఈ మైదానంలోనే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. 16 మంది ముఖ్యమంత్రులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన తరువాత 1957 నుంచి 2012 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 55 సార్లు స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన 17 మందిలో 16 మంది ఇక్కడ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఇక్కడ జాతీయ పతాకాలను ఎగురవేయగా.. నెల రోజుల పాటు సీఎంగా కొనసాగిన నాదెండ్ల భాస్కర్‌రావుకు మాత్రం ఆ అవకాశం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు సైతం ఇక్కడే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగేవి. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన బూర్గుల రామకష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 21 మంది గవర్నర్లు 1954 నుంచి 2013 వరకు ఇక్కడ 59 సార్లు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్రానికి 22 మంది గవర్నర్లుగా పని చేయగా, 21 మంది ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వీరిలో రాష్ట్ర తొలి గవర్నర్‌గా పని చేసిన సీఎం త్రివేది నుంచి ప్రస్తుత గవర్నర్ నరసింహన్ వరకు ఉన్నారు. 1997లో గవర్నర్‌గా కొద్ది నెలలు మాత్రమే పని చేసిన రామానుజానికి పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం రాలేదు. ఆదివారం ఆట విడుపు ఆదివారం వచ్చిందంటే చాలు ఈ మైదానం ఆటవిడుపుకు కేంద్రంగా మారుతోంది. నగరంలోని వందలాది మంది యువకులు, విద్యార్థులు సూర్యోదయాన్నే ఇక్కడికి చేరుకుని క్రికెట్ డుతుంటారు. సెలవు దినాల్లో క్రీడల సందడే ఇక్కడ రోజంతా కనిపిస్తుంది. అమర జవాన్ల స్థూపం కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన సుమారు వంద మంది అమర జవాన్ల స్మారకార్థం పరేడ్ మైదానంలో మిలటరీ అధికారులు స్థూపాన్ని నిర్మించారు. కార్గిల్ అమర్ జవాన్ స్థూపంగా నామకరణం చేశారు. 2000 నుంచి రెండేళ్ల పాటు సాగిన నిర్మాణ పనుల అనంతరం దీన్ని జాతికి అంకితమిచ్చారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ స్థూపం వద్ద ముఖ్యమంత్రి, గవర్నర్ ఇతర మిలటరీ అధికారులు పుష్పగుచ్ఛాల నుంచి నివాళులు అర్పించడం ఆనవాయితీ. కార్గిల్ దివాస్ పేరుతో ఏటా జూన్‌లో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.