ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్టను దెబ్బతీసి.. మనదేశం పెట్టుబడులకు సురక్షితం కాదనే సందేశాన్ని విదేశీ ఇన్వెస్టర్లకు పంపే కుట్ర జరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2024–25 బడ్జెట్‌పై చర్చకు లోక్‌సభలో ఆమె సమాధానమిస్తూ విపక్షాలపై మండిపడ్డారు. ‘భారత సామాజిక విలువలపై, పార్లమెంటరీ సాంప్రదాయాలపై, సాయుధ బలగాలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్రదాడి జరిగింది.
దేశంలో అస్థిరత, అరాచకత్వం ఉంటే.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. ఇదో పెద్ద సవాల్’ అని నిర్మల అన్నారు. భిన్నత్వం కలిగిన సమాజాన్ని తరతరాల కృషితో భారత్ ఏకతాటి పైకి తెచి్చందని, కానీ ఈ రోజు కుట్రపూరితంగా ఒకరికిపై మరొకరికి అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు, కుయుక్తులతో ప్రజల మధ్యన విభజన తెస్తున్నారని ఆరోపించారు.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను కలి్పంచే ప్రయత్నం జరుగుతోందని, చిన్నపాటి నిప్పురవ్వ (గొడవ) కూడా తీవ్ర సంఘర్షణలకు దారితీయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఏదో ఒక వంకతో సాయుధ బలగాలపై దాడులను ముమ్మరం చేస్తున్నారని ఆక్షేపించారు. అగి్నవీర్‌లపై వివాదం ఈ కుట్రలో భాగమన్నారు. సమాజమే కాకుండా ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు, సైన్యంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.
పారిశ్రామికవేత్తలను విలన్లుగా చూపుతున్నారని, ఇది సిగ్గుచేటని పేర్కొన్నారు. ‘పారిశ్రామిక సంస్కృతిని ముగించాలనే కుట్ర జరుగుతోంది. భారత్ వెన్నుముకపై దాడి జరుగుతోంది. వ్యాపారులపై ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నారు. సంపదను సృష్టించే వారిపై, వ్యాపారాలపై ద్వేషం ప్రబలుతోంది. పెట్టుబడులకు భారత్ సురక్షితం కాదనే సందేశాన్ని ప్రపంచానికి పంపే కుట్ర జరుగుతోంది. ఇది మంచిది కాదు’ అని నిర్మల అన్నారు.
2009 బడ్జెట్‌లో ఏకంగా 26 రాష్ట్రాల ప్రస్తావన లేదు
బడ్జెల్‌లో ఏదేని రాష్ట్రం ప్రస్తావన రాకపోతే సదరు రాష్ట్రానికి అసలే నిధుల కేటాయింపు జరగనట్లు కాదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను సంతృప్తిపర్చడానికే బడ్జెలో ప్రాధాన్యమిచ్చారనే విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు.
యూపీఏ హయాంలో 2009–10 బడ్జెట్‌లో ఏకంగా 26 రాష్ట్రాల ఊసు లేదని, 2004–05 బడ్జెట్‌లో 17 రాష్ట్రాల ప్రస్తావనే లేదని.. అంటే ఆ రాష్ట్రాలకు నిధులు వెళ్లలేదా? అప్పుడు ప్రస్తావన లేని రాష్ట్రాలకు నిధులు ఆపి ఉంటే.. ఇప్పుడిలా కనీస ప్రస్తావన లేదనే అంశాన్ని లేవనెత్తవచ్చు’ అని నిర్మల అన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రానికి నిధులను నిరాకరించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment