Legal actions
-
ఇకపై సహించను!
‘‘నాపై ఇప్పటివరకూ చాలా పుకార్లు వచ్చాయి. కానీ, వాటిపై నేను స్పందించ కుండా మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే వాస్తవం ఏంటనేది దేవుడికి తెలుసు. అయితే మౌనంగా ఉంటున్నానని పుకార్లు తెగ రాస్తున్నారు. నా గురించి నిరాధారమైన వార్తలు రాస్తే ఇకపై సహించను’’ అంటున్నారు సాయి పల్లవి. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడి పాత్రలో యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారానికి దూరంగా ఉండాలను కుంటున్నారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఉద్దేశించే సాయి పల్లవి పై విధంగా స్పందించి ఉంటారు. ‘‘నా సినిమాల రిలీజ్, నా ప్రకటనలు.. ఇలా నాకు సంబంధించిన వాటి గురించి నిరాధారమైన వార్తలు రాస్తే యాక్షన్ తీసుకుంటాను. ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ సహించాను. ఇకపై సిద్ధంగా లేను’’ అంటూ ΄ోస్ట్ చేశారామె. -
మిమ్మల్ని ఒత్తిడి చేసే అధికారం వారికి లేదు..!
మేము ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాము. ఓనర్లతో మేం రాసుకున్న అగ్రిమెంటు ప్రకారం ఐదు సంవత్సరాల వరకు ఆ అపార్ట్మెంటు నుంచి మమ్మల్ని ఖాళీ చేయించేందుకు వీలు లేదు. కానీ ఓనర్ మమ్మల్ని తక్షణమే ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారు. అలా ఎలా చేస్తాం అని అగ్రిమెంట్ విషయం గుర్తు చేస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్లి తన పరపతితో మాపై ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు వారు కూడా మమ్ములను సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు. ఈ పరిస్థితులలో మేము ఏం చేయాలి, సలహా ఇవ్వగలరు. – బి.నారాయణ, హైదరాబాద్సాధారణ ΄పౌరులకసలు ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా పోలీసు వారిని సంప్రదించాలి అని అనిపిస్తుంది. అది కుటుంబ సమస్య, భూమి తగాదా, అద్దె ఇల్లు ఖాళీ చేయక΄ోవటం వంటి ఏ సమస్య అయినా ముందుగా పోలీసు వారి దగ్గరికి వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలి అని కోరుతూ ఉంటారు. అందులో తప్పు లేదు. అయితే మీ సమస్య సివిల్ పరిధిలోకి వస్తుందా లేదా ఏదైనా నేరం అంటే క్రిమినల్ చట్టం కింద జరిగిందా అని పోలీసువారు చూడాలి. సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకునే వీలు లేదు. ఈ విషయాన్ని దిగువ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు చాలాసార్లు స్పష్టం చేశాయి కూడా. అయినప్పటికీ సివిల్ కేసులలో కూడా పోలీసుల తరచు జోక్యం చేసుకుంటున్నారు అనేది వాస్తవం. సివిల్ కేసులలో పోలీసుల జోక్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో నెల నెలా నమోదవుతున్న వందలాది కేసులే అందుకు నిదర్శనం. సివిల్ కేసులకు క్రిమినల్ రంగు పులిమి కేసులు పెట్టడం కూడా కొత్తేమీ కాదు. అలాంటి కేసులను కోర్టులు తిరస్కరించాయి! పోలీసు వారు సివిల్ కేసులను ‘సెటిల్మెంట్ చేసుకోండి’ అని ఒత్తిడి చేయడానికి వారికి ఎటువంటి అధికారమూ లేదు. అలాగని మీరు పోలీసు వారితో వాగ్వాదానికి దిగవలసిన అవసరం లేదు. మీ హక్కులను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి. మీకు పోలీసుల నుంచి అటువంటి ఒత్తిడి వస్తోందని అంటున్నారు కాబట్టి మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు తర్వాత కూడా మీ సమస్యకు తగిన పరిష్కారం లభించకపోతే హైకోర్టులో కేసు వేయవచ్చు. పూర్వాపరాలు విచారించిన తర్వాత హైకోర్టు మీకు రక్షణ కలిగిస్తుంది. మీకు అగ్రిమెంట్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించి అగ్రిమెంట్‌ను అతిక్రమించేందుకు వీలు లేకుండా రక్షణ పొందవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (న్యాయయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు )(చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
చట్టపరమైన చర్యలకు వెనుకాడం: ఈసీపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలు బాధ్యతారారహిత్యమైనవని తెలిపింది. తమకు ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో కాంగ్రెస్ నిరాధార అరోపణలు చేస్తోందని మండిపడింది. ఇలాంటి పనికిమాలిన ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టేలా పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించింది.ఈసీ సమాధానంపై తాజాగా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సంఘం తరుచూ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నతేలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఇలాంటి వ్యాఖ్యలే కొనసాగిస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ ఈసీకి లేఖ రాసింది. సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అంతేగానీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ కార్యాలయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం సమాధానాలు మాత్రం మరోలా ఉంటున్నాయని తెలిపింది. తన స్వతంత్రతను పూర్తిగా పక్కనపెట్టడమే ప్రస్తుతం ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని, ఆ విషయంలో ఎన్నికల సంఘం అద్భుతమైన పనితీరు చూపుతోందని విమర్శలు గుప్పించింది. ‘ఎన్నికల సంఘం తమకు తాను క్లీన్ చిట్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈసీ స్పందన, వాడిన భాష, పార్టీపై చేసిన ఆరోపణలు వంటి అంశాలు మేము తిరిగి లేఖ రాసేందుకు కారణమయ్యాయి. ఎన్నికలు, ఫలితాలపై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. అయితే తన విధిని ఈసీ మరిచిపోయినట్లు అనిపిస్తోంది. ఈసీ స్పందన కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసీ ఇదే తరహా భాషను కొనసాగిత్తే.. అలాంటి వ్యాఖ్యలను తొలగించేందుకు న్యాయపరమైన ఆశ్రయం పొందడం తప్ప తమకు మరో మార్గం లేదు’ లేఖలో తీవ్రంగా స్పందించింది. ఈ లేఖపై కేసీ వేణుగోపాల్, అశోక్ గహ్లోత్, అజయ్ మాకెన్ సహా తొమ్మిది మంది సీనియర్ నేతలు సంతకం చేశారు. -
నకిలీ విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ కఠిన చర్యలు
హైదరాబాద్: ప్రెస్టీజీ బ్రాండు పేరుతో నకిలీ ఉపకరణాలు అమ్ముతున్న విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ చట్టపరమైన చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్‌ను దురి్వనియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న కొందరు విక్రేతలపై ఫిర్యాదు దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో శివసాయి కేంద్రం, తెలంగాణలో బెథల్ ఇండస్ట్రీస్‌పై ఫిర్యాదు చేసింది. ఈ రెండు కేసుల్లోనూ తక్షణం స్పందించిన పోలీసులు నకిలీ వస్తువులను స్వా«దీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ‘టీటీకే బ్రాండ్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీలపై ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి’ అని సంస్థ ఒక ప్రకటనలో కోరింది. -
ఈ–టూవీలర్ కంపెనీలకు చెక్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చట్టపరమైన చర్యలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, పథకం కింద పొందిన రూ. 469 కోట్ల పైచిలుకు సబ్సిడీ ప్రోత్సా హకాలను తిరిగి చెల్లించాలంటూ ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటో ఈ జాబితాలో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో రివోల్ట్ మోటార్స్ మాత్రమే ప్రోత్సాహకాలను తిరిగి చెల్లించేందుకు ముందుకు వచి్చనట్లు వివరించారు. మిగతా సంస్థలు ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు. రీఫండ్‌కు డెడ్‌లైన్ దాదాపు ముగిసిపోతోందని చెప్పారు. ‘వచ్చే వారం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని అధికారి వివరించారు. ఉల్లంఘనలు ఇలా.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేలా రూ. 10,000 కోట్ల ప్రోత్సాహకాలతో కేంద్రం 2019లో ఫేమ్–2 పథకాన్ని ఆవిష్కరించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రకటించిన తొలి ఫేమ్ వెర్షన్‌కు కొనసాగింపు. ఫేమ్–2 పథకం నిబంధనల ప్రకారం .. దేశీయంగా తయారైన పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అయితే, పలు కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ స్కీముతో ప్రయోజనం పొందిన కంపెనీలపై భారీ పరిశ్రమల శాఖ విచారణ జరిపింది. వీటిలో ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్న పరికరాలను ఉపయోగించినట్లుగా వెల్లడైంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం సబ్సిడీలను విడుదల చేయడంలో కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితంగా అటు సబ్సిడీ బకాయిలు చిక్కుబడిపోయి, ఇటు మార్కెట్ వాటా కోల్పోయి ఎలక్ట్రిక్ వాహన సంస్థలు దాదాపు రూ. 9,000 కోట్లు నష్టపోయినట్లు విద్యుత్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్ఎంఈవీ అంచనా వేసింది. కొనుగోళ్లపై పొందిన రిబేట్లను తిరిగి చెల్లించేలా కస్టమర్లకు సూచించే అవకాశాలను పరిశీలించాలంటూ సబ్సిడీలపరమైన మద్దతు కోల్పోయిన ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. -
మార్పింగ్ కు సచిన్ టెండూల్కర్ బలి
-
దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు. ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. వేగంగా పరిణామాలు... క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. -
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికావొద్దు: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావొద్దని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ అన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించామని, ప్రజలందరూ సంయమనం పాటిస్తూ సహకరించాలన్నారు. చదవండి: మంగళగిరిలో సాక్షి రిపోర్టర్‌పై టీడీపీ గూండాల దాడి -
చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు: ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, కర్నూలు: చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చంద్రబాబు ఎన్440కే వైరస్ ఉందని దుష్ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. కొత్త స్ట్రెయిన్ వైరస్ లేదని శాస్త్రవేత్తలే చెబుతున్నారని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. చదవండి: చంద్రబాబుపై క్రిమినల్ కేసు ధైర్యం చెప్పకుండా దుష్ప్రచారమా? -
గాంధీ కుటుంబ ట్రస్టులపై విచారణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సహా మూడు ట్రస్టుల్లో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణకు సిద్ధమైంది. మనీ ల్యాండరింగ్, విదేశీ నిధుల ఆరోపణలకు సంబంధించిన విచారణను సమన్వయపరచడానికి అంతర్ మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక డైరెక్టర్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు వచ్చే నిధుల్లో మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), ఆదాయపు పన్ను చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ఆర్సీఏ) వంటి చట్టాలను ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు న్న విషయం తెలిసిందే. వీటిపై విచారణకు అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ అధికారి చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదం రాజుకున్న నేపథ్యంలో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి భారీగా విరాళాలు అందాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి చైనా కంపెనీల నుంచి విరాళాలు అందాయంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. చైనా సైన్యం మన భూభాగంలోకి రాలేదంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టిన కాంగ్రెస్ మోదీ చైనాకు లొంగిపోయారంటూ ఆరోపణలు గుప్పించింది. ఇదంతా జరిగిన పదిహేను రోజుల్లోనే ట్రస్టుల్లో విచారణకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రపంచమంతా మోదీలాగే ఉండదు : రాహుల్ గాంధీ కుటుంబ ట్రస్టులపై విచారణకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి తాము పోరాటం చేస్తున్న నేపథ్యంలో తమన ఎవరూ భయపెట్టలేరని అన్నారు. ‘‘ప్రధాని మోదీ ప్రపంచమంతా తనలాగే ఉంటుందని అనుకుంటారు. ప్రతీ ఒక్కరికీ ధర ఉంటుందని, వారిని బెదిరించవచ్చునని భావిస్తారు. నిజాలు వెలికి తీయడం కోసం పోరాడేవారిని ఎవరూ కొనలేరు. ఈ విషయం ఆయనకి ఎప్పటికీ అర్థం కాదు’అని రాహుల్ ట్వీట్ చేశారు. కేంద్రం ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తూ గుడ్డిగా వెళుతోందని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ట్రస్టులపై విచారణకు సిద్ధమైన కేంద్రం కాషాయ ట్రస్టుల్ని ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ఎలాంటి భయం లేదని ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తామన్నారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు తోసిపుచ్చారు. సోనియా ఆధ్వర్యంలోనే ట్రస్టులు నిరక్షరాస్యతను పారద్రోలడం ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం కోసం 1991లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆధునిక భారత పురోగతి, సమానత్వ సాధన కోసం రాజీవ్ కన్న కలల్ని సాకారం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ట్రస్టుకి చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ వ్యవహరిస్తూ ఉంటే, ట్రస్టీలుగా మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఉన్నారు. రాజీవ్‌గాంధీ చారిటబుల్ ట్రస్ట్ గ్రామీణ భారత్‌లో నిరుపేదల అభ్యున్నతి కోసం 2002లో ఏర్పాటుచేశారు. ఉత్తరప్రదేశ్, హరియాణాలో ఈ ట్రస్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనికి సోనియా చైర్‌పర్సన్‌గా ఉంటే, రాహుల్, అశోక్ గంగూలీ, బన్సీ మెహతా సభ్యులుగా ఉన్నారు. మెగసెసె అవార్డు గ్రహీత దీప్ జోషి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2001లో ప్రారం భమైన ఇందిరాగాంధీ మెమో రియల్ ట్రస్ట్ విద్యారంగంలో కార్యక లాపాలు నిర్వహిస్తోంది. ఇందిరాగాంధీ పేరుతో పలు ఇంజనీరింగ్, డెంటల్ కళాశాలలను ఏర్పా టు చేసింది. ఈ ట్రస్ట్ సోనియా ఆధ్వర్యంలోనే నడుస్తోంది. -
‘బల్క్’ పంపారో బుక్కవుతారు
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో చాలా మందికి ఒకేసారి మెసేజ్‌లు పంపుతున్నారా..? నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్‌ను దుర్వినియోగం చేస్తున్నారా? కాస్త ఆలోచించండి. అలా చేస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే చాన్సుంది. జైలుశిక్షా పడొచ్చు. వ్యక్తులుగానీ, సంస్థలుగానీ ఒకేసారి చాలా మెసేజ్‌లు పంపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ తెలిపింది. ఈ నిబంధనలు డిసెంబర్ 7 నుంచి అమల్లోకొస్తాయంది. ‘కంపెనీ నిబంధనలు ఉల్లంఘించినా వారిపై, అందుకు సహకరించినా, ఆటోమేటిక్‌గా మెసెజ్‌లు పంపినా, ఒకేసారి ఎక్కువ మెసేజ్‌లు పంపినా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. ఒకేసారి, ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు పంపేందుకు వాట్సాప్‌ను తయారు చేయలేదని పేర్కొంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో వాట్సాప్‌ను దుర్వినియోగపరిచి, ఫ్రీ క్లోన్ యాప్స్ ద్వారా ఓటర్లకు పెద్ద సంఖ్యలో సందేశాలు పంపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కేంద్రం వాట్సాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
డిఫాల్టర్ల నుంచి బ్యాంకుల వసూళ్లు రూ. 40,400 కోట్లు
ముంబై: వివిధ కొత్త చట్టాల ఆసరాతో 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు...డిఫాల్టర్ల నుంచి రూ. 40,400 కోట్లు వసూలు చేయగలిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు రూ.38,500 కోట్లుకాగా, గత ఆర్థిక సంవత్సరం అంతకుమించిన మొండి బకాయిల్ని వసూలు చేయడం గమనార్హం. ఇన్సాల్వెన్సీ బాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) అమలులోకి రావడం, సెక్యూరిటైజేషన్, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అసెట్స్ (ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ) చట్ట సవరణలు జరగడంతో భారీగా మొండి బకాయిల్ని ఈ చట్ట ప్రయోగాల ద్వారా, డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు, లోక్ అదాలత్‌ల ద్వారా బ్యాంకులు వసూలు చేసినట్లు తాజాగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన నివేదికలో వివరించారు. ఐబీసీ ద్వారా రూ. 4,900 కోట్లు, (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐని ప్రయోగించి రూ. 26,500 కోట్లు వసూలుచేసినట్లు ఈ వారాంతంలో విడుదలైన ఆర్బీఐ నివేదిక తెలిపింది. -
ఆ దేవస్థానాలు.. చర్చిలు.. మసీదులు ఆర్టీఐ పరిధిలోకి రావు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందని దేవస్థానాలు, చర్చిలు, మసీదులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రావని ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి దేవాదాయ చట్టం కింద కమిషనర్ లేదా ఇతర ఏ అధికారి అయినా కూడా ఆర్టీఐ పరిధిలోకి రాని దేవస్థానాల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాల్సిన అవసరం లేదంది. అయితే తమకు నిర్దిష్టంగా తెలిసిన సమాచారాన్ని మాత్రం వారు ఆర్టీఐ కింద ఇవ్వాలని, ఆ చట్టం కింద వారు పబ్లిక్ అథారిటీ కిందకు వస్తారంది.మతపరమైన సంస్థలు ప్రస్తుతం వివిధ మార్గాల నుంచి విరాళాల రూపంలో భారీ మొత్తాలను అందుకుంటున్న నేపథ్యంలో ఆ నిధుల వినియోగం పారదర్శకంగా జరిగేందుకు, సమాచార హక్కు చట్టం లక్ష్యాలను సాధించేందుకు కనీసం రిజిష్టర్ అయిన దేవస్థానాలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చట్ట సవరణ తేవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల తీర్పునిచ్చారు. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉభయ రాష్ట్రాలకు చెందిన పలు మతపరమైన సంస్థలు, ధార్మిక సంస్థలు, ధర్మకర్తలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.ఇలా 2007 నుంచి ఈ ఏడాది వరకు దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల వీటన్నింటినీ కలిపి ఉమ్మడి తీర్పునిచ్చారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2 (హెచ్) ప్రకారం దేవస్థానాలు, ధార్మిక సంస్థలు పబ్లిక్ అథారిటీ నిర్వచన పరిధిలోకి రావన్నారు. కాబట్టి దేవస్థానాల ధర్మకర్తలు, పాలకమండళ్లు, చైర్పర్సన్లు ఆయా దేవస్థానాల సమాచారాన్ని ఆర్టీఐ చట్టం కింద అందించాల్సిన అవసరం లేదన్నారు. కేరళ హైకోర్టు సైతం హిందూ ధార్మిక సంస్థలు, దేవస్థానాలు ఆర్టీఐ చట్టం కింద పబ్లిక్ అథారిటీ నిర్వచనం పరిధిలోకి రావని తీర్పునిచ్చిన విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. దేవస్థానాల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నప్పటికీ, వారు ఆర్టీఐ చట్టం కింద పబ్లిక్ అథారిటీ పరిధిలోకి రారన్నారు. దేవస్థానాల కార్యకలాపాల నిర్వహణను చూస్తున్నంత మాత్రాన వాటిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలుగా, ప్రభుత్వ సాయం అందుతున్న దేవస్థానాలుగా పరిగణించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు.సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు అందచేయాలంటూ పలు దేవాలయాల ఈవోలు, ట్రస్టీలు తదితరులను ఆదేశిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. -
బికినీ ఫోటోలపై హీరోయిన్ ఆగ్రహం
సాక్షి, చెన్నై: హీరోయిన్ నివేథా పెతురాజ్(26) లీగల్ చర్యలకు సిద్ధమైపోయారు. కొన్ని ఛానెళ్లు, వెబ్సైట్లు ఈ మధ్య ఆమె బికినీ ఫోటోలంటూ కొన్నింటిని వైరల్ చేశాయి. అయితే ఫేక్ ఫోటోలని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. అవి నావి కావు... ‘నిజానికి ఆ ఫోటోలు నావి కావు. అయినప్పటికీ కొన్ని వెబ్ సంస్థలు అతితో వాటిని నా పేరు మీద ప్రచురించాయి. నా పరువుకు భంగం కలిగించిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నా. ఇప్పటికే లీగల్ నోటీసులు సిద్ధం చేశా’ అని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆ ఫోటోలు వర్షిణి పాకల్ అనే మోడల్‌వి అని ఫోటోగ్రాఫర్ ప్రసూన్ ప్రశాంత్ ప్రకటించారు. కాగా, నివేథా పెతురాజ్ మెంటల్ మదిలో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్థురాలే. జయం రవితో ఆమె నటించిన స్పేస్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ రిలీజ్‌కు రెడీగా ఉండగా, విజయ్ ఆంటోనీతో ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. -
లైంగిక ఆరోపణలు: గాయనికి హీరో నోటీసులు
ఇస్లామాబాద్ : పాక్ యువ నటుడు అలీ జఫర్‌పై గాయని మీషా షఫీ(36) సంచలన ఆరోపణలకు దిగింది. అలీ తనని లైంగికంగా వేధించాడంటూ గురువారం ఆమె తన ట్వీటర్లో ఓ పోస్టు చేయగా.. అది దుమారం రేపింది. ఇప్పటికైనా తాను మౌనం వీడకపోతే అర్థం లేదని.. మీటూ క్యాంపెయిన్ ఉవ్వెత్తున్న సాగుతున్న తరుణంలో తనపై జరిగిన అఘాయిత్యం గురించి కూడా స్పందిస్తున్నానని ఆమె ఆ పోస్టులో పేర్కొంది. ఇద్దరు పిల్లల తల్లి అని కూడా చూడకుండా జఫర్ తనను తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించాడని.. రేపు మరో అమ్మాయికి ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ విషయం బయటపెడుతున్నానని ఆమె తన ట్వీటర్లో ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి అలీ జఫర్ ఘాటుగా బదులిచ్చాడు. మీటూ ఉద్యమానికి నేను మద్ధతు ఇస్తాను. నేనూ ఓ పాపకు తండ్రినే. నా గురించి నా మిత్రులకు, బంధువులకు బాగా తెలుసు. అలాంటిది నాపై ఇలాంటి విమర్శలు రావటం తట్టుకోలేకపోతున్నా. దాచటానికి ఏం లేదు. మౌనంగా ఉండటం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమైపోతున్నా అని అలీ జఫర్ తన ట్వీటర్లో ఓ పోస్టు చేశారు. మీషాకు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 37 ఏళ్ల అలీ జఫర్ లాలీవుడ్(పాక్ సినీ ఇండస్ట్రీ)లో అర డజనుకుపైగా చిత్రాల్లో నటించగా.. బాలీవుడ్లో తెరె బిన్ లాడెన్, మేరీ బ్రదర్ కీ దుల్హన్, డియర్ జిందగీ తదితర చిత్రాలతో భారతీయ ప్రేక్షకులకూ సుపరిచితుడు. Sharing this because I believe that by speaking out about my own experience of sexual harassment, I will break the culture of silence that permeates through our society. It is not easy to speak out.. but it is harder to stay silent. My conscience will not allow it anymore #MeToo pic.twitter.com/iwex7e1NLZ — Meesha Shafi (@itsmeeshashafi) 19 April 2018 pic.twitter.com/j1C34onEXC — Ali Zafar (@AliZafarsays) 19 April 2018 -
స్పీకర్ పరామర్శ
అంబర్‌పేట: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య కుటుంబసభ్యులను తెలంగాణ శాసన సభా స్పీకర్ మధుసూదనాచారి మంగళవారం పరామర్శించారు. డీడీ కాలనీ ఉన్న రమ్య అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆయన.. ఇదే ప్రమాదం తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమై చిన్నారి తల్లి రాధిక ఆరోగ్య పరిస్థితిని ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా మీ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రమాదానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ పద్మవతిరెడ్డి ఉన్నారు. -
గీతను తీసుకొచ్చేందుకు సన్నాహాలు: సుష్మ
న్యూఢిల్లీ: భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన మూగ చెవిటి అమ్మాయి గీతను భారత్‌కు రప్పించేందుకు చట్టపరమైన చర్యలు చేట్టామని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ట్విటర్ ద్వారా తెలిపారు. ‘గీతను వెనక్కి తీసుకుని రావటానికి అవసరమైన చర్యలను పూర్తిచేస్తున్నాం’ అని ఆమె అన్నారు. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాలుగు కుటుంబాలు గీత తమ కూతురేనని చెప్తున్నారని సుష్మ పేర్కొన్నారు. ‘‘భారత హైకమిషనర్‌కు గీత కొన్ని వివరాలు చెప్పింది. తనకు ఏడుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారని పేర్కొంది. తన తండ్రితో కలసి ఆలయానికి వెళ్లినట్లు రాసి చూపింది. ఆలయం పేరు ‘వైష్ణోదేవి’ అని రాసింది. గీత కుటుంబాన్ని వెతకటంలో సాయం చేయండి’’ అని సుష్మ ట్వీట్ చేశారు. 15ఏళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్లో కాలుపెట్టిన గీతను కరాచీలోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ కలిసిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబుపై ఫిర్యాదు
ఖైరతాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్‌రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు హైదరాబాద్ నగరంలో ఉండి ఆంధ్రాను పరిపాలించడం విదేశాల్లో ఉండి పాలించినట్టుగా ఉందని చేసిన వాఖ్యలు పత్రికల్లో వచ్చాయని, తెలంగాణను అవమానించే రీతిలో విదేశంతో పోల్చడం రాజద్రోహం అవుతుందని రాజశేఖర్‌రెడ్డి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాఖ్యలు రాజద్రోహం కిందకు వస్తాయని చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు. -
‘దర్యాప్తునకు అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోండి
శిడ్లఘట్ట : తండ్రి మృతి కేసులో దర్యాప్తునకు అడ్డుకుంటున్న తనయుడి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా సంచాలకుడు సీఎం మునియప్ప మాట్లాడుతూ.. తిప్పేనహళ్లి గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప గత నెల అనుమానాస్పదంగా మరణించాడని, అతని మృతదేహం పాడు బడిన బావిలో లభ్యమైందని తెలిపారు. దీనిపై తిమ్మరాయప్ప పెద్దకుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రెండవ కుమారుడు మునిరాజు దర్యాప్తును అడ్డుకొంటున్నాడని ఆరోపించారు. ధర్నాలో తాలూకా సంచాలకుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.