‘దర్యాప్తునకు అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోండి | 'To investigation Way to take actions against | Sakshi
Sakshi News home page

‘దర్యాప్తునకు అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోండి

Published Wed, Jun 25 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

‘దర్యాప్తునకు  అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోండి

‘దర్యాప్తునకు అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోండి

శిడ్లఘట్ట : తండ్రి మృతి కేసులో దర్యాప్తునకు అడ్డుకుంటున్న తనయుడి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా సంచాలకుడు సీఎం మునియప్ప మాట్లాడుతూ..

తిప్పేనహళ్లి గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప గత నెల అనుమానాస్పదంగా మరణించాడని, అతని మృతదేహం పాడు బడిన బావిలో లభ్యమైందని తెలిపారు. దీనిపై తిమ్మరాయప్ప పెద్దకుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రెండవ కుమారుడు మునిరాజు దర్యాప్తును అడ్డుకొంటున్నాడని ఆరోపించారు. ధర్నాలో తాలూకా సంచాలకుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement