‘‘నాపై ఇప్పటివరకూ చాలా పుకార్లు వచ్చాయి. కానీ, వాటిపై నేను స్పందించ కుండా మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే వాస్తవం ఏంటనేది దేవుడికి తెలుసు. అయితే మౌనంగా ఉంటున్నానని పుకార్లు తెగ రాస్తున్నారు. నా గురించి నిరాధారమైన వార్తలు రాస్తే ఇకపై సహించను’’ అంటున్నారు సాయి పల్లవి. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడి పాత్రలో యశ్ నటిస్తున్నారు.
ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారానికి దూరంగా ఉండాలను కుంటున్నారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఉద్దేశించే సాయి పల్లవి పై విధంగా స్పందించి ఉంటారు. ‘‘నా సినిమాల రిలీజ్, నా ప్రకటనలు.. ఇలా నాకు సంబంధించిన వాటి గురించి నిరాధారమైన వార్తలు రాస్తే యాక్షన్ తీసుకుంటాను. ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ సహించాను. ఇకపై సిద్ధంగా లేను’’ అంటూ ΄ోస్ట్ చేశారామె.
Comments
Please login to add a commentAdd a comment