న్యూఢిల్లీ: వాట్సాప్‌లో చాలా మందికి ఒకేసారి మెసేజ్‌లు పంపుతున్నారా..? నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్‌ను దుర్వినియోగం చేస్తున్నారా? కాస్త ఆలోచించండి. అలా చేస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే చాన్సుంది. జైలుశిక్షా పడొచ్చు. వ్యక్తులుగానీ, సంస్థలుగానీ ఒకేసారి చాలా మెసేజ్‌లు పంపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ తెలిపింది. ఈ నిబంధనలు డిసెంబర్ 7 నుంచి అమల్లోకొస్తాయంది. ‘కంపెనీ నిబంధనలు ఉల్లంఘించినా వారిపై, అందుకు సహకరించినా, ఆటోమేటిక్‌గా మెసెజ్‌లు పంపినా, ఒకేసారి ఎక్కువ మెసేజ్‌లు పంపినా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది.
ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. ఒకేసారి, ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు పంపేందుకు వాట్సాప్‌ను తయారు చేయలేదని పేర్కొంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో వాట్సాప్‌ను దుర్వినియోగపరిచి, ఫ్రీ క్లోన్ యాప్స్ ద్వారా ఓటర్లకు పెద్ద సంఖ్యలో సందేశాలు పంపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కేంద్రం వాట్సాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment