ముంబై: వివిధ కొత్త చట్టాల ఆసరాతో 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు...డిఫాల్టర్ల నుంచి రూ. 40,400 కోట్లు వసూలు చేయగలిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు రూ.38,500 కోట్లుకాగా, గత ఆర్థిక సంవత్సరం అంతకుమించిన మొండి బకాయిల్ని వసూలు చేయడం గమనార్హం. ఇన్‌సాల్వెన్సీ బాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) అమలులోకి రావడం, సెక్యూరిటైజేషన్, రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అసెట్స్ (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ) చట్ట సవరణలు జరగడంతో భారీగా మొండి బకాయిల్ని ఈ చట్ట ప్రయోగాల ద్వారా, డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు, లోక్ అదాలత్‌ల ద్వారా బ్యాంకులు వసూలు చేసినట్లు తాజాగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన నివేదికలో వివరించారు. ఐబీసీ ద్వారా రూ. 4,900 కోట్లు, (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐని ప్రయోగించి రూ. 26,500 కోట్లు వసూలుచేసినట్లు ఈ వారాంతంలో విడుదలైన ఆర్‌బీఐ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment